Upcoming Cars in 2024: చాలా కార్ల తయారీ కంపెనీలు 2023లో రికార్డు విక్రయాలను నమోదు చేశాయి. అవి ఇప్పుడు 2024లో అనేక కొత్త కార్లను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో టాప్ ఆఫ్ ది లైన్ లగ్జరీ ఎస్‌యూవీలు, ఎంపీవీలతో సహా అనేక కొత్త కార్లు ఉంటాయి. అప్‌డేట్ చేసిన ఫ్లాగ్‌షిప్‌లతో పాటు కొత్త వాహనాలు కూడా ఇందులో ఉండనున్నాయి. ఇప్పుడు వీటిలో ఏమేం ఉన్నాయో చూద్దాం.


మహీంద్రా థార్ 5 డోర్
స్టాండర్డ్ 3 డోర్ థార్ రికార్డు సక్సెస్ అయిన తర్వాత, పొడవైన వీల్‌బేస్‌తో కూడిన పెద్ద 5 డోర్ వేరియంట్ త్వరలో మార్కెట్లోకి రానుంది. థార్ 5 డోర్ 4x4, 4x2 వేరియంట్‌లలో మార్కెట్లోకి రానుంది. దీనిని 2024 ఆగస్టులో లాంచ్ చేసే అవకాశం ఉంది. దీని అంచనా ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ. 16 లక్షలుగా ఉండవచ్చు.


మారుతి సుజుకి ఈవీఎక్స్
భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి తన మొదటి EVని విడుదల చేయబోతోంది. ఇది 2025లో లాంచ్ కానుంది. దాదాపు 500 కిలోమీటర్ల వరకు రేంజ్ ఉండే అవకాశం ఉంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 20 లక్షల నుంచి 25 లక్షల మధ్య ఉండనుందని సమాచారం.


మెర్సిడెస్ బెంజ్ ఈక్యూజీ
జీ-వ్యాగన్ పెద్ద సక్సెస్ అయిన తర్వాత కంపెనీ భారతదేశంలో తన ఎలక్ట్రిక్ మోడల్ ఈక్యూజీని తీసుకురాబోతోంది. ఇది 2025 జూన్‌లో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. దీని అంచనా ఎక్స్-షోరూమ్ ధర రూ. 3.05 కోట్లు ఉండవచ్చని అంచనా.


లెక్సస్ ఎల్ఎమ్
టయోటా వెల్‌ఫైర్ లాగానే లగ్జరీ ఫీచర్లతో కూడిన లెక్సస్ ఎల్ఎం కూడా మార్కెట్లోకి రాబోతోంది. 3.5 లీటర్ టర్బో పెట్రోల్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో వస్తున్న ఈ ఎంపీవీ 2024 మార్చిలో వచ్చే అవకాశం ఉంది. దీని అంచనా ధర రూ. 1.5 కోట్లు ఉండవచ్చు.


కియా ఈవీ9
కియా ఫ్యూచరిస్టిక్ ఈవీ6ని ఇప్పటికే లాంచ్ చేసింది. కానీ దాని ఫ్లాగ్‌షిప్ ఈవీ9 ఎస్‌యూవీ నిజమైన హైలైట్. ఐదు మీటర్ల పొడవుతో ఈవీ9 ఒక పెద్ద ఎస్‌యూవీ. ఈ కారు 99.8 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో 490 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉందని పేర్కొన్నారు. ఇది 2024 జూన్‌లో లాంచ్ కానుంది. దీని అంచనా ధర రూ. 80 లక్షలు (ఎక్స్-షోరూమ్).


ఆడి క్యూ8 ఈ-ట్రాన్
ఆడి క్యూ6 ఈ ట్రాన్ గ్లోబల్ లాంచ్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఆడి 2025 వరకు ఈ-ఎస్‌యూవీని భారతదేశానికి తీసుకువచ్చే అవకాశం లేదు. దాని స్థానంలో ఆడీ ఎలక్ట్రిక్ ఫ్లాగ్‌షిప్‌ని తీసుకువచ్చే అవకాశం ఉంది. క్యూ8 ఈ-ట్రాన్ తాజా వెర్షన్ అందుబాటులో ఉంటుంది. ఇది 2024 అక్టోబర్‌లో లాంచ్ కానుందని తెలుస్తోంది. దీని ధర రూ. 1.07 కోట్ల నుంచి రూ. 1.43 కోట్లు (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుందని అంచనా.


స్కోడా ఎన్యాక్ ఐవీ
స్కోడా ఈవీ సెగ్మెంట్‌లో లైనప్‌ను పెంచుతోంది. దీని కోసం భారతీయ ఈవీ మార్కెట్లో ఎన్యాక్ ఐవీని లాంచ్ చేయనుంది. ఇది 2024 మార్చిలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీని అంచనా ధర రూ. 60 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉండవచ్చు.


Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!