Ultraviolette X-47 Venom Details: ఎలక్ట్రిక్ బైక్ ప్రియులకు అల్ట్రావయొలెట్ ఆటోమోటివ్ గుడ్ న్యూస్ చెప్పింది. కంపెనీ కొత్తగా తీసుకొచ్చిన Ultraviolette X-47 Venom మోటార్‌సైకిల్ డెలివరీలను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఉన్న సంస్థకు చెందిన 55 షోరూమ్‌ల ద్వారా కస్టమర్లకు బైక్‌లను అందిస్తోంది. గత నెల చివర్లో ఈ మోడల్‌ను పరిచయం చేయగా, లాంచ్ ఈవెంట్ ముగిసిన వెంటనే బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి.

Continues below advertisement

కొత్త 100V ఆర్కిటెక్చర్‌తో రూపొందించిన VX-100 ప్లాట్‌ఫామ్‌పై వచ్చిన తొలి ఉత్పత్తి ఇదే. పాత X-47 Crossover స్థానంలో ఇప్పుడు X-47 Venom అందుబాటులోకి వచ్చింది. బరువు తగ్గడం, రేంజ్ పెరగడం, కొత్త ఫీచర్లు ఈ మోడల్‌లో ప్రధాన ఆకర్షణలుగా ఉన్నాయి.

దశలవారీగా నాలుగు వేరియంట్ల డెలివరీలు

Continues below advertisement

X-47 Venom బుక్ చేసుకున్న కస్టమర్లకు కంపెనీ దశలవారీగా డెలివరీలు అందిస్తోంది. ప్రారంభ లాంచ్ ఈవెంట్ తర్వాత వెంటనే బుక్ చేసినవారికి కూడా త్వరలో బైక్ అందే అవకాశం ఉంది. అయితే నాలుగు వేరియంట్ల డెలివరీలను ఒకేసారి కాకుండా విడతల వారీగా పూర్తి చేస్తున్నట్లు అల్ట్రావయొలెట్ స్పష్టం చేసింది. అందువల్ల ముందుగా బుక్ చేసిన ప్రతి ఒక్కరికీ ఒకే సమయంలో డెలివరీ లభించకపోవచ్చు.

X-47 Venom ప్రత్యేకతలు

కొత్త 100V ఆర్కిటెక్చర్ కారణంగా X-47 Venomలో కొన్ని మార్పులు తీసుకొచ్చారు. పాత మోడల్‌తో పోలిస్తే బైక్ బరువు 17 కిలోల వరకు తగ్గింది. అలాగే రేంజ్ 20km వరకు పెరిగింది.

ఫీచర్ల విషయానికి వస్తే.. పెద్ద 7-అంగుళాల TFT డిస్‌ప్లేను అందించారు. దీనికి అదనంగా క్రూయిజ్ కంట్రోల్ కూడా కొత్తగా వచ్చింది. ఈ మార్పులతో పాత X-47 Crossover స్థానంలో కొత్త Venom మోడల్‌ను కంపెనీ తీసుకొచ్చింది.

ఇది కూడా చదవండి: హైయెస్ట్‌ మైలేజీ ఇచ్చే టాప్ 10 CNG కార్లు ఇవే.. కిలో గ్యాస్‌తో ఏకంగా 36.47km! టాప్‌లో Maruti Dzire

ధరలు ఎంతంటే?

Ultraviolette X-47 Venom నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ప్రస్తుతం ప్రకటించిన ధరలు ప్రారంభ ఆఫర్‌లో భాగం, ఆ తర్వాత పెరగవచ్చు.

వేరియంట్ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర
X-47 Venomరూ.2.65 లక్షలు - రూ.2.78 లక్షలు
X-47 Venom+రూ.3.15 లక్షలు - రూ.3.28 లక్షలు
X-47 Venom Reconరూ.3.75 లక్షలు - రూ.3.88 లక్షలు
X-47 Venom Recon+రూ.4.00 లక్షలు - రూ.4.12 లక్షలు

ధరల పెంపు ఎప్పటి నుంచి?

ప్రస్తుతం ఉన్న ధరలు పరిచయ ఆఫర్ కింద ప్రకటించినవే. తొలి 5,000 కొనుగోళ్లు పూర్తయిన తర్వాత అన్ని వేరియంట్ల ధరలను మరో రూ.35,000 పెంచనున్నట్లు కంపెనీ తెలిపింది. అంటే ప్రారంభ ధరలో బుక్ చేసుకునే అవకాశం తొలి 5,000 మంది కొనుగోలుదారులకే పరిమితం, వాళ్లకు రూ.35,000 ఆదా అవుతుంది.

ఇది కూడా చదవండి: లాంచ్‌కు ముందే షోరూమ్‌లో దర్శనమిచ్చిన Bajaj Pulsar 125 Neon.. పాత క్లాసిక్ లుక్‌తో అదరగొడుతున్న బైక్!

మొత్తంగా చూస్తే... కొత్త 100V ప్లాట్‌ఫామ్, 17 కిలోల వరకు తగ్గిన బరువు, అదనంగా 20km రేంజ్, 7-అంగుళాల TFT డిస్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్‌తో X-47 Venomను అల్ట్రావయొలెట్ అప్‌డేట్ చేసింది. ప్రస్తుతం నాలుగు వేరియంట్ల డెలివరీలు దేశవ్యాప్తంగా దశలవారీగా కొనసాగుతున్నాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.