Best Mileage CNG Cars: పెట్రోల్ ధరలను తప్పించుకుని, తక్కువ ఖర్చుతో ప్రయాణించాలనుకునే వారికి CNG కార్లు మంచి ప్రత్యామ్నాయం. ముఖ్యంగా, ప్రతిరోజూ ప్రయాణించేవారికి ఇవి ఉపయోగకరంగా ఉంటాయి. పెట్రోల్ కార్లతో పోలిస్తే CNG కార్ల కొనుగోలు ధర కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ, నిర్వహణ ఖర్చు తక్కువగా ఉండటం వీటి ప్రత్యేకత. ప్రస్తుతం దేశంలో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ CNG కిట్‌తో అందుబాటులో ఉన్న కార్లలో అత్యధిక మైలేజీ ఇచ్చే టాప్ 10 మోడళ్ల జాబితా ఇది.

Continues below advertisement

ఈ జాబితాలో మారుతి సుజుకి మోడళ్ల ఆధిపత్యం కనిపిస్తోంది. హ్యుందాయ్, టయోటా కార్లు కూడా ఇందులో చోటు సంపాదించాయి. అధికారిక ARAI మైలేజీ ఆధారంగా ఈ కార్లు ర్యాంకింగ్స్ దక్కించుకున్నాయి.

10. Maruti Suzuki Victoris

Continues below advertisement

ధర: రూ.11.65 లక్షల నుంచి రూ.14.67 లక్షలు

ఇందులో 1.5 లీటర్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించారు. CNG మోడ్‌లో ఈ ఇంజిన్ 88hp పవర్, 121.5Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ARAI సర్టిఫైడ్ మైలేజీ 27.02km/kg. మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ కారులో ప్రత్యేకత ఏమిటంటే.. ఫ్యాక్టరీ ఫిట్టెడ్ CNG సిలిండర్‌ను బూట్‌లో కాకుండా కారు కింది భాగంలో అమర్చారు.

9. Hyundai Exter

ధర: రూ.7 లక్షల నుంచి రూ.9.47 లక్షలు

ఇందులో డ్యూయల్ సిలిండర్ సెటప్ అందించారు. ఐదు వేరియంట్లలో కొనుగోలు చేయవచ్చు. 1.2 లీటర్ 4 సిలిండర్ ఇంజిన్‌కు 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ జత చేశారు. దీని ARAI మైలేజీ 27.10km/kg. ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌కు ముందున్న మోడల్ ఆధారంగా 9వ ర్యాంక్‌ ఇచ్చారు.

8. Maruti Suzuki Fronx, Toyota Urban Cruiser Taisor

ధర: Fronx రూ.7.99 లక్షల నుంచి రూ.8.79 లక్షలు; Taisor రూ.8.45 లక్షలు

మారుతి ఫ్రాంక్స్, టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్ రెండూ ఒకే ప్లాట్‌ఫామ్‌పై రూపొందిన బ్యాడ్జ్ ఇంజినీరింగ్ మోడళ్లు. ఈ రెండు కార్లలోనూ 1.2 లీటర్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ CNG కిట్ అందించారు. ARAI మైలేజీ 28.51km/kg. 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తాయి. ఫ్రాంక్స్ CNG ధరలు రూ.7.99 లక్షల నుంచి రూ.8.79 లక్షల వరకు ఉన్నాయి. టైజర్ CNG మాత్రం E వేరియంట్‌లో రూ.8.45 లక్షలకు అందుబాటులో ఉంది.

ఇది కూడా చదవండి: పాత కారు ఇచ్చి కొత్త కారు కొంటున్నారా? ఈ ఒక్క సర్టిఫికెట్‌తో రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు తగ్గించుకోవచ్చు!

7. Maruti Suzuki S-Presso

ధర: రూ.4.69 లక్షల నుంచి రూ.5.19 లక్షలు

ఈ జాబితాలో అత్యంత తక్కువ ధర కలిగిన కారు మారుతి S-Presso CNG. LXi (O), VXi (O) వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో 1.0 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించారు. 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వచ్చే ఈ కారు ARAI ప్రకారం 32.73km/kg మైలేజీ ఇస్తుంది. దేశంలో అత్యంత చౌకైన కారుగా మాత్రమే కాకుండా, ప్రస్తుతం అమ్మకాల్లో ఉన్న అత్యంత చౌకైన CNG కారుగా కూడా S-Presso నిలుస్తోంది.

6. Maruti Suzuki Alto K10

ధర: రూ.4.85 లక్షల నుంచి రూ.5.34 లక్షలు

ఆల్టో K10 CNGలో కూడా S-Presso తరహాలోనే 1.0 లీటర్ 3 సిలిండర్ ఇంజిన్, 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఉన్నాయి. అయితే దీని మైలేజీ మరింత ఎక్కువ. ARAI సర్టిఫైడ్ గణాంకం 33.40km/kg. ఈ కారు LXi (O), VXi (O) వేరియంట్లలో అందుబాటులో ఉంది.

5. Maruti Suzuki Wagon R

ధర: రూ.5.99 లక్షల నుంచి రూ.6.55 లక్షలు

ఇందులోనూ 1.0 లీటర్ 3 సిలిండర్ ఇంజిన్‌ను 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేశారు. ARAI మైలేజీ 33.47km/kg. LXi, VXi వేరియంట్లలో లభించే ఈ కారు ధరలు రూ.5.99 లక్షల నుంచి ప్రారంభమవుతాయి.

ఇది కూడా చదవండి: CODని చూపిస్తే కొత్త కారుపై గ్యారెంటీ బెనిఫిట్స్! తెలంగాణలో రోడ్ ట్యాక్స్ రాయితీ ఎంతంటే?

4. Maruti Suzuki Celerio

ధర: రూ.5.98 లక్షలు

సెలెరియో CNGలోనూ పై మూడు కార్లలో ఉపయోగించిన 1.0 లీటర్ 3 సిలిండర్ ఇంజిన్‌నే అందించారు. అయితే ఈ నాలుగు మోడళ్లలో అత్యధిక మైలేజీ సెలెరియో సొంతం. ARAI ప్రకారం 34.43km/kg మైలేజీ ఇస్తుంది. VXi అనే ఒకే ఒక్క వేరియంట్‌లో అందుబాటులో ఉంది. దీని ధర రూ.5.98 లక్షలు.

3. Maruti Suzuki Baleno, Toyota Glanza

ధర: Baleno రూ.7.92 లక్షల నుంచి రూ.9.42 లక్షలు; Glanza రూ.8.76 లక్షల నుంచి రూ.10.23 లక్షలు

మారుతి బలెనో, టయోటా గ్లాంజా CNG వెర్షన్లు కూడా బ్యాడ్జ్ ఇంజినీరింగ్ మోడళ్లే. ఈ కార్లలో కొత్త 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించారు. 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. మాన్యువల్ వెర్షన్ ARAI మైలేజీ 33.61km/kg కాగా, AMT వెర్షన్ 34.47km/kg ఇస్తుంది.

బలెనో CNG Delta, Zeta వేరియంట్లలో రూ.7.92 లక్షల నుంచి రూ.9.42 లక్షల ధరతో లభిస్తుంది. గ్లాంజా CNG మాత్రం S, G వేరియంట్లలో రూ.8.76 లక్షల నుంచి రూ.10.23 లక్షల వరకు అందుబాటులో ఉంది.

2. Maruti Suzuki Swift

ధర: రూ.7.57 లక్షల నుంచి రూ.8.96 లక్షలు

మారుతి స్విఫ్ట్ CNG వెర్షన్‌ VXi, VXi (O), ZXi వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో కొత్త 1.2 లీటర్ 3 సిలిండర్ Z12 పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించారు. 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి.

మాన్యువల్ వెర్షన్ ARAI మైలేజీ 35.07km/kg. AMT వెర్షన్ మరింత మెరుగ్గా 35.34km/kg మైలేజీ ఇస్తుంది.

1. Maruti Suzuki Dzire

ధర: రూ.8.21 లక్షల నుంచి రూ.9.64 లక్షలు

ప్రస్తుతం, దేశంలోఅత్యధిక మైలేజీ CNG కారుగా మారుతి డిజైర్‌ నిలిచింది. ఈ జాబితాలో చోటు సంపాదించిన ఏకైక సెడాన్ కూడా ఇదే.

కొత్త తరం డిజైర్‌లో.. స్విఫ్ట్‌లో ఉపయోగించిన Z12 1.2 లీటర్ ఇంజిన్‌ను అందించారు. 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. మాన్యువల్ వెర్షన్ ARAI మైలేజీ 35.63km/kg కాగా, AMT వెర్షన్ ఏకంగా 36.47km/kg ఇస్తుంది. ఈ కారణంగా డిజైర్ CNG, స్విఫ్ట్ CNG కంటే ఎక్కువ మైలేజీ సాధిస్తోంది. VXi, ZXi వేరియంట్లలో లభించే దీని ధరలు రూ.8.21 లక్షల నుంచి రూ.9.64 లక్షల వరకు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: డీజిల్ ఎస్‌యూవీ కొనే ప్లాన్‌లో ఉన్నారా? లీటర్‌కు దాదాపు 22 కి.మీ. మైలేజీ ఇచ్చే బెస్ట్‌ కార్లు ఇవే!

ప్రత్యేక ప్రస్తావన: Tata Punch

టాటా పంచ్ CNG ఈ టాప్ 10 జాబితాలోకి కొద్దిలో చోటు కోల్పోయింది. 5-స్పీడ్ మాన్యువల్ వెర్షన్ ARAI మైలేజీ 26.99km/kg. ఈ లెక్క ఫేస్‌లిఫ్ట్‌కు ముందున్న మోడల్‌కు సంబంధించినది. AMT వెర్షన్‌కు అధికారిక మైలేజీ ఇంకా అందుబాటులో లేదు. పంచ్ CNG ధరలు రూ.6.85 లక్షల నుంచి రూ.10.77 లక్షల వరకు ఉన్నాయి.

గమనిక: ఈ కథనంలో చెప్పిన మైలేజీ లెక్కలన్నీ ARAI సర్టిఫైడ్ నంబర్లు. వాస్తవ వినియోగంలో డ్రైవింగ్ పరిస్థితులు, ట్రాఫిక్, ప్రయాణ విధానాన్ని బట్టి మైలేజీ మారవచ్చు. అన్ని ధరలు ఇండియా ఎక్స్‌షోరూమ్ ధరలు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.