Best Mileage Diesel SUVs: భారత్‌లో SUV కార్లకు మంచి ఆదరణ ఉంది. ముఖ్యంగా డీజిల్ ఇంజిన్‌ కార్లను ఇష్టపడేవాళ్లు.. తక్కువ వేగాల్లోనే లభించే మెరుగైన టార్క్, మంచి మైలేజీ కారణంగా వాటిని ఎంచుకుంటున్నారు. ఇటీవలి కాలంలో కఠినమైన ఉద్గార నిబంధనల కారణంగా డీజిల్ కార్ల సంఖ్య తగ్గుతోంది. ప్రస్తుతం కొన్ని కంపెనీలు మాత్రమే డీజిల్ SUVలను అమ్ముతున్నాయి.

Continues below advertisement

రూ.30 లక్షల లోపు ధరలో అందుబాటులో ఉన్న & అత్యధిక మైలేజీ ఇచ్చే 10 డీజిల్ మిడ్‌సైజ్ SUVల జాబితాను పరిశీలిద్దాం. ఈ లిస్ట్‌లో Hyundai Creta టాప్‌ ప్లేస్‌లో ఉంది. 

 10. Mahindra Thar RoxxARAI మైలేజీ: 15.20 కి.మీ./లీటర్

Continues below advertisement

ఈ జాబితాలో పదో స్థానంలో ఉన్న Mahindra Thar Roxxలో 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్‌ ఉంది. ఇది 152hp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. ఈ రెండు వెర్షన్లలోనూ ARAI మైలేజీ 15.20 కి.మీ./లీటర్‌.

 9. Mahindra Scorpio NARAI మైలేజీ: 15.94 కి.మీ./లీటర్

Mahindra Scorpio Nలో 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంది. ఇది 175hp పవర్, 400Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులోనూ 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. మాన్యువల్ వెర్షన్ 15.94 కి.మీ./లీటర్ మైలేజీ ఇస్తుండగా, ఆటోమేటిక్ వెర్షన్ 15.42 కి.మీ./లీటర్ అందిస్తుంది.

 8. Tata SafariARAI మైలేజీ: 16.30 కి.మీ./లీటర్

Land Rover D8 ప్లాట్‌ఫామ్‌పై Tata Safariని డిజైన్‌ చేశారు. ఇందులో 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 170hp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. మాన్యువల్ వెర్షన్‌లో 16.3 కి.మీ./లీటర్ మైలేజీ ఆకట్టుకునే అంశం.

ఇది కూడా చదవండి: కారు టైర్లలో గాలి ఎంత ఉండాలి? ఈ చిన్న తప్పు వల్ల మైలేజీ తగ్గడమే కాదు, ప్రమాదం పెరుగుతుంది!

 7. Tata HarrierARAI మైలేజీ: 16.80 కి.మీ./లీటర్

Tata Harrierలోనూ Safari తరహాలో 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంది. ఇది 170hp పవర్‌ను అందిస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. ఈ రెండు వెర్షన్లలోనూ ARAI మైలేజీ 16.8 కి.మీ./లీటర్‌.

 6. Force GurkhaARAI మైలేజీ: 17 కి.మీ./లీటర్

Force Gurkha ఈ జాబితాలోని ప్రత్యేకమైన ఆఫ్‌రోడ్ SUV. మూడు డోర్ల వెర్షన్‌లో 2.6 లీటర్ డీజిల్ ఇంజిన్‌ అందించారు. దీనికి 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మాత్రమే ఉంది. ARAI ప్రకారం ఇది లీటర్‌కు 17 కి.మీ. మైలేజీ ఇస్తుంది. ఈ జాబితాలో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ లేని SUV ఇదే.

 5. Jeep CompassARAI మైలేజీ: 17.30 కి.మీ./లీటర్

Jeep Compassలో ప్రస్తుతం పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ లేదు. ఇందులో 2.0 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్‌ను అందిస్తున్నారు. ఇది 170hp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ లేదా 9-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు. మాన్యువల్ వెర్షన్ 17.3 కి.మీ./లీటర్ మైలేజీ ఇస్తుండగా, ఆటోమేటిక్ వెర్షన్ 16.2 కి.మీ./లీటర్ అందిస్తుంది.

 4. Kia SeltosARAI మైలేజీ: 19.4 కి.మీ./లీటర్

Kia Seltosలో 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్‌ను కొనసాగిస్తున్నారు. ఇది 116hp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. మాన్యువల్ వెర్షన్ లీటర్‌కు 19.4 కి.మీ. మైలేజీ ఇస్తుంది. ఆటోమేటిక్ వెర్షన్‌లో ఈ గణాంకం 17.8 కి.మీ./లీటర్‌గా ఉంది.

ఇది కూడా చదవండి: పొల్యూషన్ రూల్స్‌ పాటించని 17,000కు పైగా వాహనాలు సీజ్.. దాదాపు 26,000 ట్రాఫిక్‌ చలాన్లు జారీ, జర జాగ్రత్త!

 3. Hyundai AlcazarARAI మైలేజీ: 20.40 కి.మీ./లీటర్

Hyundai Alcazar ఈ జాబితాలో మూడో స్థానంలో ఉంది. ఇందులో 1,493cc సామర్థ్యం ఉన్న 4 సిలిండర్ల టర్బో డీజిల్ ఇంజిన్‌ను అందించారు. ARAI ప్రకారం, 6-స్పీడ్ మాన్యువల్ వెర్షన్‌ లీటరుకు 20.4 కి.మీ. మైలేజీ, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ వెర్షన్‌ లీటరకు 18.1 కి.మీ. మైలేజీ అందించగలరు.

 2. Tata SierraARAI మైలేజీ: 21.26 కి.మీ./లీటర్

ఇందులో మూడు ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. వాటిలో 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ 118hp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌కు 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. మాన్యువల్ వెర్షన్ 260Nm టార్క్‌ను, ఆటోమేటిక్ వెర్షన్ 280Nm టార్క్‌ను అందిస్తుంది. డీజిల్ మాన్యువల్ వెర్షన్ 21.26 కి.మీ./లీటర్ అందిస్తుండగా, ఆటోమేటిక్ వెర్షన్ 19.22 కి.మీ./లీటర్ ఇస్తుంది.

 1. Hyundai CretaARAI మైలేజీ: 21.80 కి.మీ./లీటర్

హ్యుందాయ్‌ క్రెటాలో 116hp పవర్ అందించే 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంది. మాన్యువల్ వెర్షన్‌ 21.8 కి.మీ./లీటర్ మైలేజీ అందిస్తుంది. ఆటోమేటిక్ వెర్షన్‌ 19.1 కి.మీ./లీటర్‌ ఇవ్వగలరు.

ఇవన్నీ ARAI పరీక్షల ఆధారంగా ప్రకటించిన గణాంకాలు మాత్రమే. వాస్తవ వినియోగంలో డ్రైవింగ్ స్టైల్‌, రోడ్డు పరిస్థితులను బట్టి మైలేజీ మారవచ్చు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.