Ultraviolette Tesseract Electric Scooter: అల్ట్రావయోలెట్ ఆటోమోటివ్ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్సెరాక్ట్ ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ స్కూటర్‌ను ఫ్యూచరిస్టిక్ డిజైన్ ఆధారంగా రూపొందించారు. ఈ EV కోసం కంపెనీ బుకింగ్‌లను కూడా స్టార్ట్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కేవలం రూ.999కే బుక్ చేసుకోవచ్చు. ఈ EV తక్కువ ధరకు మెరుగైన పని తీరు అందిస్తుందని చెబుతున్నారు. 

అల్ట్రావయోలెట్ ఆటోమోటివ్ టెస్సెరాక్ట్ రేంజ్ ఎంత?అల్ట్రావయోలెట్ ఆటోమోటివ్ కాంతి టెస్సెరాక్ట్ నెక్స్ట్ జనరేషన్ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ EV లోని మోటారు 20.1 bhp పవర్‌ను జనరేట్ చేస్తుంది. టెస్సెరాక్ట్ మూడు బ్యాటరీ ప్యాక్(3.5 kWh, 5 kWh, 6 kWh) ఆప్షన్స్‌తో మార్కెట్లోకి వచ్చింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 3.5 kWh బ్యాటరీ ప్యాక్‌తో 162 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. 6 kWh బ్యాటరీ ప్యాక్ నుంచి 261 కి.మీ ట్రావెల్ చేయవచ్చని కంపెనీ పేర్కొంది.

Also Read: టాటా నెక్సాన్ బేసిక్ మోడల్‌ హైదరాబాద్‌లో ఆన్‌రోడ్ ప్రైస్ ఎంత?

అల్ట్రావయోలెట్ టెస్సెరాక్ట్ ఫీచర్స్‌ఈ అల్ట్రావయోలెట్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఇంటిగ్రేటెడ్ రాడార్, డాష్‌క్యామ్, ఓమ్నిసెన్స్ మిర్రర్లు ఉన్నాయి. ఇలాంటి ఫీచర్సస్ అందిస్తున్న మొదటి ఎలక్ట్రిక్ అటోమొబైల్ కంపెనీ ఇదే. ఈ ఎలక్ట్రిక్ వాహనంలో LED DRL లతో కూడిన డ్యూయల్ ప్రొజెక్టర్ ల్యాంప్‌లు అమర్చారు. ఈ స్కూటర్ 7-అంగుళాల టచ్‌స్క్రీన్ TFT డిస్ప్లే, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, లేన్ చేంజ్, ఓవర్‌టేకింగ్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్‌తో రియల్ టైమ్ అలర్ట్‌తో వస్తుంది.

టెస్సెరాక్ట్ ధరఅల్ట్రావయోలెట్ టెస్సెరాక్ట్ ధర గురించి చెప్పాలంటే, ఈ స్కూటర్ ధరను రూ. 1.2 లక్షలుగా చెబుతున్నారు. మొదటి 10 వేల మంది కస్టమర్లకు మాత్రమే ఈ ధర వర్తిస్తుంది. ఆ తరువాత ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర పెంచబోతున్నారు. ఈ స్కూటర్ ఫస్ట్ లుక్, ధరను పరిశీలిస్తే, దీనిని మెరుగైన అప్‌గ్రేడ్‌ వెర్షన్‌గా చెప్పవచ్చు. కంపెనీ ఈ స్కూటర్‌ను వచ్చే ఏడాది 2026 ప్రారంభంలో డెలివరీ చేయబోతోంది. 

Also Read: భారత్‌లో టెస్లా కార్‌ ధరెంతో తెలుసా? లో-ఎండ్‌ మోడల్‌ను కూడా సామాన్యులు కొనలేరు