ప్రపంచ వ్యాప్తంగా నేర నియంత్రణకు పోలీసులు అత్యాధునిక టెక్నాలజీని ఆసరాగా చేసుకుంటున్నారు. నేరస్తుల ఆటకట్టించాలంటే.. వారికంటే చురుగ్గా పోలీసులు వ్యవహరించాల్సి ఉంటుంది. అందులో భాగంగానే అత్యాధునిక ఆయుధాలు, లేటెస్ట్ టెక్నాలజీ, హైపర్ స్పీడ్ వెహికల్స్ వాడాల్సి ఉంటుంది. అయితే, యూకే పోలీసులు మాత్రం సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. నేర నియంత్రణలో భాగంగా మహీంద్రా ఈ రిక్షా Tuk-Tuksను వినియోగిస్తున్నారు. గ్వెంట్ పోలీసులు వేల్స్‌లోని కౌంటీ, మోన్‌ మౌత్‌ షైర్‌లోని న్యూపోర్ట్ తో పాటు అబెర్గవెన్నీలో ఉపయోగించేందుకు నాలుగు Tuk-Tuks ఇ-రిక్షాలను కొనుగోలు చేశారు.


‘సేఫ్ స్పేసెస్’గా Tuk-Tuks పెట్రోలింగ్ వాహనాలు


ఈ Tuk-Tuksను పగలు, రాత్రి సమయాల్లో పార్కులు, నడక మార్గాలు సహా ఇతర బహిరంగ ప్రదేశాల్లో పెట్రోలింగ్ చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఇ-రిక్షాల వేగం గంటకు 55 కిలో మీటర్లుగా ఉంటుంది. నేరాలకు సంబంధించిన వివరాలను వెల్లడించడానికి, పోలీసులు సహాయం కోరడానికి, నేర నిరోధక సలహాలు ఇవ్వడానికి వీటిని ‘సేఫ్ స్పేసెస్’గా ఉపయోగిస్తున్నామని గ్వెంట్ పోలీసులు తెలిపారు.  "మా పోలీసు సిబ్బంది  బిహైండ్ ది బ్యాడ్జ్ డేలో కనిపిస్తుంటారు. స్థానిక నివాసితులకు వారిని దగ్గరగా చూడడానికి అవకాశం ఉంటుంది. రాత్రి పూట Tuk-Tuks పెట్రోలింగ్ కు యువకులకు నుంచి సహాయ సహకారాలు ఉన్నాయి. మహిళలు సైతం ఈ పెట్రోలింగ్ ద్వారా తమకు తాముగా సురక్షితంగా ఉన్నట్లు భావిస్తున్నారు. ఇ-రిక్షాలపెట్రోలింగ్ ప్రజలకు మరింత చేరువ అవుతున్నది" అని గ్వెంట్  చీఫ్ ఇన్‌స్పెక్టర్ డామియన్ సౌరే వెల్లడించారు.


గొప్ప కార్యక్రమంలో భాగమైనందుకు చాలా గర్వంగా ఉంది- మహీంద్రా ఎలక్ట్రిక్


మహీంద్రా కంపెనీకి చెందిన ఈ ఎలక్ట్రిక్ వాహనాలను భారత్ లో ఇ-రిక్షాలుగా ఉపయోగిస్తున్నారు. ఈ Tuk-Tuks  గ్వెంట్ పోలీసులు పెట్రోల్ లో ఉపయోగిండం పట్ల మహీంద్రా కంపెనీ స్పందించింది. "ఈ ఆటోలు ప్రజా రవాణా కోసం తయారు చేబడ్డాయి. కానీ, గ్వెంట్ పోలీసులు వీటిని చక్కటి పని కోసం వినియోగిస్తున్నారు. నేర నియంత్రణతో పాటు నేరాలు జరగకుండా నియంత్రించే సలహాలు సూచనలు తీసుకునేందుకు ఇ- రిక్షాల ద్వారా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. నేరాలను నివేదించడానికి, సహాయం కోరడానికి, నేర నిరోధక సలహా ఇవ్వడానికి వీలుగా ఇ-ఆటోలను సేఫ్టీ స్పేస్ లుగా ఉపయోగిస్తున్నారు. ఇలాంటి గొప్ప కార్యక్రమంలో భాగమైనందుకు చాలా గర్వంగా ఉంది" అని మహీంద్రా ఎలక్ట్రిక్ ట్వీట్ చేసింది.


Read Also: అబ్బ, భలే ఆఫర్ - ఖరీదైన ఎలక్ట్రిక్ వాహనాలు కొనేందుకు పేదలకు భారీ సబ్సీడీలు, ఎక్కడో తెలుసా?