Two Wheeler Sales in December 2023: 2023 డిసెంబర్‌లో దేశీయ మార్కెట్‌లో ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో 15.9 శాతం పెరుగుదల నమోదైంది. దీని కారణంగా మొత్తం అమ్మకాలు 12,11,966 యూనిట్లకు చేరాయి. ఇంతకు ముందు అమ్మకాల గురించి మాట్లాడినట్లయితే 2022 డిసెంబర్‌లో 10,45,052 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. ఇందులో బైక్‌ల అమ్మకాలు 7,68,402 యూనిట్లు కాగా, స్కూటర్ల అమ్మకాలు 4,05,274 యూనిట్లుగా ఉన్నాయి.
బైక్‌ల అమ్మకాల్లో టాప్ ఎవరు?
రెండు సెగ్మెంట్లలో హీరో మోటోకార్ప్ 2023 డిసెంబర్‌లో 3,77,842 యూనిట్ల విక్రయాలతో అగ్రగామిగా నిలిచింది. 2,86,078 యూనిట్ల విక్రయాలను నమోదు చేసిన హోండా రెండో స్థానాన్ని ఆక్రమించగా, 2,14,988 యూనిట్ల విక్రయాలతో టీవీఎస్ మూడో స్థానాన్ని ఆక్రమించింది.
ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో...
ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి చెప్పాలంటే గత నెలలో ఓలా ఎలక్ట్రిక్ 30,219 యూనిట్లతో టాప్‌లో నిలిచింది. TVS ఐ క్యూబ్ 12,216 యూనిట్లతో, బజాజ్ చేతక్ 10,323 యూనిట్లతో, ఏథర్ ఎనర్జీ 4,481 యూనిట్లతో, గ్రీవ్స్ ఎలక్ట్రిక్ 2,974 యూనిట్లతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ఎలక్ట్రిక్ టూ వీలర్స్‌కు డిమాండ్
భారతీయ ద్విచక్ర వాహనాల మార్కెట్లో ఎలక్ట్రిక్ సెగ్మెంట్ గ్రాఫ్ ఇప్పుడు నిరంతరం పైకి కదులుతున్నట్లు స్పష్టంగా చూడవచ్చు. ఈవీ కంపెనీలకు ప్రభుత్వం ఇచ్చే సాయం మాత్రం మునుపటిలా లేదు. కాస్త వరకు తగ్గిపోయింది.
భారతదేశంలో ఏడాది పొడవునా ద్విచక్ర వాహనాలకు డిమాండ్ కనిపిస్తుంది. భారతదేశం అతిపెద్ద ద్విచక్ర వాహనాల మార్కెట్‌లలో ఒకటిగా ఉండటానికి ఇదే కారణం. ఇంత పెద్ద సంఖ్యలో ద్విచక్ర వాహనాలు రావడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో రన్నింగ్ కాస్ట్, టైమ్ సేవింగ్ ముఖ్యమైనవి.
Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!