TVS XL100 Heavy Duty Alloy TVS Wheels Launched: టీవీఎస్ మోటార్స్, తన ఫేమస్ XL100 హెవీ డ్యూటీ లైనప్‌లో తాజాగా కొత్త వేరియంట్‌ని పరిచయం చేసింది, అది - TVS XL100 Heavy Duty Alloy. ఆలాయ్ వీల్స్‌తో వచ్చిన ఏకైక HD (హెవీ డ్యూటీ) వేరియంట్ ఇదే. దీనిలో ట్యూబ్‌లెస్ టైర్లను కూడా కంపెనీ ఇచ్చింది. కొత్త లుక్ కేవలం స్టైలిష్ మాత్రమే కాకుండా, పంక్చర్ రిపేర్ విషయంలో కూడా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ సౌలభ్యాన్ని ఇస్తుంది.
ప్రత్యేకమైన LED హెడ్‌ల్యాంప్‌ఈ కొత్త XL100 Heavy Duty Alloy వేరియంట్ ప్రత్యేకంగా LED హెడ్‌ల్యాంప్‌తో లాంచ్ అయింది, రాత్రి సమయాల్లో మరింత ఎక్కువ కాంతిని పెంచి, గ్రామీణ రోడ్లపై గుంతలు & మలుపులు వంటి వాటిని స్పష్టంగా చూపిస్తుంది. అదనంగా, USB చార్జింగ్ పోర్ట్ కూడా అందుబాటులో ఉంది, రైడింగ్ సమయంలో ఫోన్లు & ఇతర పరికరాలను సులభంగా చార్జ్ చేసుకోవచ్చు, సమయం ఆదా అవుతుంది.
రంగులుతాజా XL100 Heavy Duty Alloy వేరియంట్ మొత్తం మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది, అవి - రెడ్, బ్లూ, & గ్రే. వీటిలో ప్రతి ఒక్క రంగూ ప్రత్యేక ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
ఇంజిన్ విషయానికి వస్తే, XL100 Heavy Duty Alloy మిగతా వేరియంట్ల లాగే మెకానికల్‌గా ఒకే విధంగా ఉంటుంది. 99.7cc, ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ 4.3 hp పవర్‌తో 6.5 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. సస్పెన్షన్ & బ్రేకింగ్ సిస్టమ్ కూడా మిగతా వేరియంట్ల తరహాలోనే ఉంటాయి, ఫ్రంట్ & రియర్ రెండూ డ్రమ్ బ్రేక్‌లు ఉంటాయి.
ఆఅయ్ వీల్స్ తీసుకురావడం వల్ల ఈ మోటార్ సైకిల్ మోడర్న్ లుక్ అందుకుంది, పాత స్పోక్డ్ వీల్స్ కంటే భిన్నమైన ఫీల్ ఇస్తుంది. మరొక ప్రాక్టికల్ బెనిఫిట్ ఏమిటంటే, పంక్చర్ రిపేర్ చాలా సులభం అయింది. ఈ వేరియంట్ కర్బ్ వెయిట్ విషయంలోనూ పెద్ద మార్పు లేదు, ఇది ఇతర మోడల్స్‌తో దాదాపు సమానంగా, సుమారుగా 89 కిలోల బరువు తూగుతుంది.
తెలుగు రాష్ట్రాల్లో ధరఆంధ్రప్రదేశ్ & తెలంగాణలో, XL100 Heavy Duty Alloy ధర రూ. 60,500 (ఎక్స్-షోరూమ్), ఈ మోడల్‌లో ఇదే టాప్-స్పెక్స్ వేరియంట్. రిజిస్ట్రేషన్ ఖర్చులు దాదాపు రూ. 7,300, ఇన్సూరెన్స్ దాదాపు రూ. 6,300, ఇతర ఖర్చులు కలుపుకుని ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 78,000 అవుతుంది.
ప్రస్తుతం, ఈ మోటర్ సైకిల్‌కు డైరెక్ట్‌గా పోటీ ఇచ్చే బండి మార్కెట్‌లో లేదు, కానీ ఎలక్ట్రిక్ Kinetic e-Luna (రూ. 69,990 - 82,490) కొంత పోలిక ఉంటుంది.
TVS XL100 Heavy Duty Alloy ఒక చవకైన, స్టైలిష్, ఫీచర్లతో ఫుల్ ఫ్లెక్సిబుల్ ఆఫ్షన్స్ ఇచ్చే టూ-వీల్‌ర్ కావడం వల్ల రైడర్లకు బాగా ఆకర్షణీయంగా ఉంటుంది. రోజువారీ తిరగడానికి ఉపయోగించే కమ్యూటర్ బైక్‌లా ఉపయోగించుకోవడానికి కూడా ఇది పర్ఫెక్ట్. LED లైట్, USB చార్జింగ్, & అలాయ్ వీల్స్ వంటివి ఈ వేరియంట్‌కు ప్రీమియం ఫీల్ ఇస్తాయి, కానీ ధర అందుబాటులోనే ఉంది.