Suhas Couple Blessed With Baby Boy: టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ గుడ్ న్యూస్ చెప్పారు. ఆయన మరోసారి తండ్రయ్యారు. ఆయన భార్య లలిత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా ఆయన ప్రకటించారు. దీంతో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు సెలబ్రిటీలతో పాటు నెటిజన్లు ఆయనకు విషెష్ చెబుతున్నారు.

Continues below advertisement

గతేడాది ఈ దంపతులకు మగబిడ్డ జన్మించాడు. తాజాగా మరోసారి వీళ్లకు కొడుకు పుట్టాడు. సుహాస్, లలిత ఏడేళ్లు పాటు ప్రేమించుకుని 2017లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 

Also Read: 'కొత్త లోక' సీక్వెల్ అఫీషియల్ అనౌన్స్ - స్పెషల్ వీడియోతో దుల్కర్ సల్మాన్

తొలుత షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌లతో ఫేం సంపాదించుకుని ఆ తర్వాత ఇండస్ట్రీలోకిి ఎంట్రీ ఇచ్చారు సుహాస్. తొలుత క్యారెక్టర్ ఆర్టిస్టుగా సత్తా చాటి ఆ తర్వాత హీరోగా మారారు. 'కలర్ ఫోటో' మూవీతో మంచి ఫేం సంపాదించుకుని 'రైటర్ పద్మభూషణ్', 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్', 'ఉప్పు కప్పు రంబు', 'ఓ భామ అయ్యో రామ', 'జనక అయితే గనక', శ్రీరంగ నీతులు, ప్రసన్నవదనం, గొర్రె పురాణం వంటి మూవీస్‌లో నటించి మెప్పించారు. ప్రస్తుతం తెలుగులో హే భగవాన్ చేస్తుండగా 'మందాడి' మూవీతో తమిళంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు.