TVS Star City Plus Discontinued: టీవీఎస్ మోటార్, తన పాపులర్ కమ్యూటర్ బైక్ Star City Plusకు ముగింపు పలికినట్లు తెలుస్తోంది. 2014లో మార్కెట్లోకి వచ్చిన ఈ బైక్‌ దాదాపు పుష్కరం (12 సంవత్సరాలు) పాటు మార్కెట్‌లో కొనసాగింది. తక్కువ ధరలో రోజువారీ ప్రయాణాలకు అనువైన బైక్‌గా గుర్తింపు పొందిన ఈ మోటార్‌సైకిల్‌ను కంపెనీ ఇప్పుడు నిలిపివేసినట్లు సమాచారం. అంటే, Star City Plus ఇకపై TVS విక్రయాల జాబితాలో కనిపించకపోవచ్చు.

Continues below advertisement

టీవీఎస్ 110cc ఇంజిన్ ప్లాట్‌ఫామ్‌పై రూపొందించిన మూడు కమ్యూటర్ బైక్‌లలో Star City Plus ఒకటి. మిగిలిన రెండు మోడళ్లు Radeon, Sport. స్టార్‌ సిటీ ప్లస్‌ నిలిచిపోయినప్పటికీ Radeon, Sport బైక్‌ల విక్రయాలు మాత్రం కొనసాగనున్నాయి.

 109.7cc ఇంజిన్.. 4 స్పీడ్ గేర్‌బాక్స్

Continues below advertisement

TVS Star City Plusలో 109.7cc సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉండేది. ఈ ఇంజిన్ 7,350rpm వద్ద 8.2hp పవర్, 4,500rpm వద్ద 8.7Nm టార్క్ ఉత్పత్తి చేసేది. దీనికి 4 స్పీడ్ గేర్‌బాక్స్‌ను జత చేశారు.      

ఎంట్రీ లెవల్ బైక్ అయినప్పటికీ ఇందులో కొన్ని ఉపయోగకరమైన ఫీచర్లను అందించారు. LED హెడ్‌ల్యాంప్, USB ఛార్జర్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఇందులో ఉన్నాయి. వెనుక వైపు 5-స్టెప్ అడ్జస్టబుల్ ప్రీలోడ్ సదుపాయం ఉన్న షాక్ అబ్జార్బర్‌ను కూడా ఇచ్చారు.          

ఇది కూడా చదవండి: కంపెనీ స్టోర్లకు గుడ్‌బై చెప్పనున్న ఓలా.. ఇకపై డీలర్ల ద్వారానే టూవీలర్ల విక్రయాలు!

 రెండు వేరియంట్లలో అందుబాటులో..

TVS Star City Plusను Drum, Disc అనే రెండు వేరియంట్లలో విక్రయించారు. దీని ఎక్స్‌షోరూమ్ ధరలు రూ.72,500 నుంచి రూ.75,200 వరకు ఉండేవి.     

ఈ బైక్‌కు చివరిసారిగా ఐదేళ్లకు పైగా క్రితం అప్‌డేట్ వచ్చింది. అప్పట్లో BS6 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా ఇంజిన్‌ను మార్చారు. ఆ తర్వాత పెద్దగా డిజైన్ మార్పులు లేదా ఫీచర్ అప్‌డేట్లు అందించలేదు.     

ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో సరికొత్త రవాణా వ్యవస్థ.. డ్రైవర్‌లెస్ పాడ్ ట్యాక్సీలు రాబోతున్నాయ్‌!

 Radeon వల్లే Star City Plusకు బ్రేక్?   

Star City Plus నిలిపివేతకు గల కారణంపై టీవీఎస్ అధికారికంగా ఏమీ చెప్పలేదు. అయితే, ఒకే 110cc ప్లాట్‌ఫామ్‌పై రూపొందిన Radeon బైక్‌ కూడా దాదాపు అదే కస్టమర్లను లక్ష్యంగా చేసుకుంటోంది. Star City Plusతో పోలిస్తే Radeonకు మార్కెట్లో ఎక్కువ ఆదరణ ఉండటంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని అంచనా.     

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.