Ola Dealership Model: ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్‌లో మళ్లీ పుంజుకోవడానికి, ఓలా ఎలక్ట్రిక్ తన విక్రయాల విధానంలో పెద్ద మార్పు చేస్తోంది. ఇప్పటివరకు ఎక్కువగా సొంతంగా నిర్వహించే స్టోర్ల ద్వారా వాహనాలను విక్రయించిన ఈ సంస్థ.. ఇకపై థర్డ్ పార్టీ డీలర్ల ఆధారంగా అమ్మకాలు చేపట్టనుంది. ఖర్చులను తగ్గించుకోవడం, నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుకోవడం ఈ నిర్ణయం వెనుక ప్రధాన లక్ష్యాలుగా కనిపిస్తున్నాయి.

Continues below advertisement

నవంబర్ 1 నుంచి, కంపెనీ సొంత స్టోర్లలో కొత్త ఆర్డర్లను స్వీకరించడం నిలిపివేసింది. ప్రస్తుతం ఉన్న స్టోర్ల నెట్‌వర్క్‌ను 2026 డిసెంబర్ ముగిసే నాటికి దాదాపుగా మూసివేయాలని భావిస్తోంది. కొన్ని పరిమిత సంఖ్యలోని అవుట్‌లెట్లను మాత్రమే కొనసాగించనుంది.

ఓలా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ దీపక్ రస్తోగి వెల్లడించిన వివరాల ప్రకారం.. కంపెనీ సొంత స్టోర్ల విధానం నుంచి డీలర్‌షిప్ ఆధారిత విక్రయ వ్యవస్థకు మారే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ కొత్త విధానంలో తొలి డీలర్‌షిప్ సెప్టెంబర్ 4న కార్యకలాపాలు కూడా ప్రారంభించింది.

Continues below advertisement

ఇది కూడా చదవండి: విన్‌ఫాస్ట్ నుంచి 3 కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు.. భారతీయుల కోసమే ప్రత్యేకంగా తయారీ!

డీలర్‌షిప్ నెట్‌వర్క్ విస్తరణపై దృష్టి

నవంబర్ 8 నాటికి ఓలా ఎలక్ట్రిక్ 255 మంది డీలర్లను తన నెట్‌వర్క్‌లో చేర్చుకుంది. వీరి ఆధ్వర్యంలో మొత్తం 319 స్టోర్లు పనిచేస్తున్నాయి. ఈ సంఖ్యను 2026 డిసెంబర్ నాటికి 450కి పెంచాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. 2027 మార్చి నాటికి 700కు పైగా అవుట్‌లెట్లను ఏర్పాటు చేయాలని ప్రణాళిక సిద్ధం చేసింది.

ఈ మార్పుతో స్టోర్ల నిర్వహణ, ఇన్వెంటరీ బాధ్యతలు ఎక్కువగా డీలర్లకు బదిలీ అవుతాయి. తద్వారా కంపెనీ నిర్వహణ ఖర్చులు తగ్గడంతో పాటు వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు కూడా తగ్గుతాయని భావిస్తోంది.

 పెండింగ్ ఆర్డర్ల డెలివరీపై ప్రత్యేక దృష్టి

విక్రయాల విధానంలో మార్పుతో పాటు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంపైనా ఓలా దృష్టి పెట్టింది. చార్జర్లు అందుబాటులో లేకపోవడంతో సెప్టెంబర్ నుంచి సుమారు 5,000 వాహనాల డెలివరీలు ఆలస్యమైనట్లు కంపెనీ వెల్లడించింది. వీటికి సంబంధించిన చెల్లింపులు ఇప్పటికే అందినట్లు తెలిపింది.

పెండింగ్ ఆర్డర్లను త్వరగా పూర్తి చేయడానికి సరఫరాదారుల నుంచి విడిభాగాల ఉత్పత్తిని పెంచడం, వాహనాల తయారీని వేగవంతం చేయడం ప్రస్తుతం తమ ప్రాధాన్యత అని కంపెనీ యాజమాన్యం పేర్కొంది.

ఇది కూడా చదవండి: హై-వోల్టేజ్‌తో తిరిగొచ్చిన Ultraviolette X-47 Venom.. పాత X-47 మోడల్‌తో పోలిస్తే కొత్తగా ఏం మారింది?

 తాజా ఉత్పత్తి S1X+.. ప్రత్యేక ఫీచర్లు

ఓలా ఎలక్ట్రిక్, చివరిగా, ఏప్రిల్‌లో S1X+ స్కూటర్‌ను విడుదల చేసింది. దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ.1.64 లక్షలు. ఈ స్కూటర్‌లో కంపెనీ స్వయంగా అభివృద్ధి చేసిన 4680 భారత్ సెల్‌ను ఉపయోగించారు.

ఒక్కసారి ఛార్జ్ చేస్తే IDC విధానం ప్రకారం గరిష్ఠంగా 320 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. దీని గరిష్ఠ వేగం గంటకు 125 కిలోమీటర్లు. బ్రేక్-బై-వైర్ టెక్నాలజీ కూడా ఇందులో ఉంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.