TVS RTR 125 LC Details: టీవీఎస్‌ కంపెనీ, EICMA 2026లో నాలుగు కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించింది. వీటిలో కొత్త RTR 125 LC మోటార్‌సైకిల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనితో పాటు యూరప్ మార్కెట్ కోసం Orbiter, X & M1S అనే మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లను కూడా పరిచయం చేసింది. ఈ నాలుగు వాహనాల్లో.. Orbiter, X ఇప్పటికే భారత్‌లో అందుబాటులో ఉన్నాయి. అయితే యూరప్ మార్కెట్ కోసం X స్కూటర్‌లో వీల్ సెటప్‌ను మార్చారు. RTR 125 LC & M1S మోడళ్లను భారత్‌లో కూడా విడుదల చేసే అవకాశం ఉందని భావిస్తున్నప్పటికీ, కంపెనీ నుంచి ఇప్పటివరకు అలాంటి అధికారిక సంకేతాలు లేవు.

Continues below advertisement

TVS RTR 125 LC: ఇంజిన్, పవర్ వివరాలు

కొత్త TVS RTR 125 LCలో 125cc సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ను అందించారు. ఈ ఇంజిన్ 9,000rpm వద్ద 14.7hp పవర్‌ను, 7,000rpm వద్ద 12Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది. స్లిప్ & అసిస్ట్ క్లచ్ కూడా ఉంది. ఈ బైక్ కోసం కొత్త ట్యూబ్యులర్ ట్రెల్లిస్ ఫ్రేమ్‌ను రూపొందించారు. కాస్ట్ స్వింగార్మ్‌ను కూడా కొత్తగా అందించారు.

Continues below advertisement

సస్పెన్షన్ బాధ్యతలను KYB నిర్వహిస్తుంది. ముందు భాగంలో 41mm USD ఫోర్క్, వెనుక భాగంలో మోనోషాక్ ఉన్నాయి. టైర్ల విషయానికి వస్తే ముందు 100/80-17 టైర్, వెనుక 140/70R17 టైర్‌ను ఉపయోగించారు.

బ్రేకింగ్ కోసం Bybre బ్రేక్‌లను అందించారు. ముందు భాగంలో 300mm డిస్క్, వెనుక భాగంలో 240mm డిస్క్ ఉన్నాయి. భద్రత కోసం డ్యూయల్ ఛానల్ ABS స్టాండర్డ్‌గా వస్తుంది.

ఇది కూడా చదవండి: Honda CBR1000RR-R Fireblade: 2026, 2027 మోడళ్ల మధ్య తేడాలేంటి? కొత్తగా ఏ మారింది?

టెక్నాలజీ ఫీచర్లకు ప్రాధాన్యం

TVS ఈ RTR 125 LCని కొత్తగా బైక్ నడపడం ప్రారంభించే A1 లైసెన్స్ హోల్డర్లను దృష్టిలో పెట్టుకుని రూపొందించినట్లు కనిపిస్తోంది. ఇందులో టెక్నాలజీ ఫీచర్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. బైక్‌లో 5-అంగుళాల TFT డిస్‌ప్లే స్టాండర్డ్‌గా లభిస్తుంది. ఇందులో ఫుల్ స్క్రీన్ మ్యాప్ మిర్రరింగ్ సదుపాయం ఉంది. రైడింగ్ మోడ్‌లు కూడా అందించారు. వీటితో పాటు బ్లూటూత్‌ & స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.

యూరప్ కోసం మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లు

RTR 125 LCతో పాటు TVS తన మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లను కూడా యూరప్ మార్కెట్‌కు పరిచయం చేసింది. అవి Orbiter, X & M1S.

Orbiter స్కూటర్‌లో భారత్‌లో అందుబాటులో ఉన్న వెర్షన్‌తో పోలిస్తే ఎలాంటి మార్పులు చేయలేదు. X స్కూటర్‌లో మాత్రం కీలక మార్పు ఉంది. భారత్‌లో ఈ మోడల్‌కు 12-అంగుళాల వీల్స్ ఉండగా, యూరప్ వెర్షన్‌లో 14-అంగుళాల వీల్స్‌ను అందించారు.

M1S స్కూటర్ మాత్రం ప్రస్తుతం భారత్‌లో అందుబాటులో లేదు. ఇందులో 4.2kWh బ్యాటరీ ఉంటుంది. దీని మోటార్ గరిష్ఠంగా 12.5kW పవర్‌ను ఉత్పత్తి చేయగలదు. WMTC పరీక్షా విధానం ప్రకారం ఈ స్కూటర్ 120km రేంజ్‌ను అందిస్తుంది.

ఇది కూడా చదవండి: జనం ఎక్కువగా కొంటున్నది ఈ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్లనే.. అక్టోబర్‌లో రెట్టింపు అమ్మకాలు!

ధరలు, లాంచింగ్‌ టైమ్‌

ఈ నాలుగు కొత్త ఉత్పత్తుల ధరలను TVS ఇంకా ప్రకటించలేదు. వీటి లాంచ్‌ తేదీలపై కూడా కంపెనీ స్పష్టత ఇవ్వలేదు. ఒకవేళ RTR 125 LC భారత్‌లో ల్యాండ్‌ అయితే.. ఇందులో ఉన్న అధునాతన ఫీచర్ల కారణంగా TVS బైక్ లైనప్‌లో ఇది ఎక్కువ ధర పలికే అవకాశం ఉంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.