TVS Orbiter Electric Scooter: టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ లైనప్‌లో అందుబాటు ధరలో లభిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ TVS Orbiter. ఈ స్కూటర్‌లో iQube నుంచి తీసుకున్న 3.1kWh బ్యాటరీ ప్యాక్‌ ఉపయోగించారు. పెర్ఫార్మెన్స్‌ కంటే ఎక్కువగా రేంజ్‌ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ స్కూటర్‌ను ట్యూన్‌ చేశారు. అందుకే సిటీ యూజర్ల దృష్టిలో ఇది ఓ ఆసక్తికరమైన ఆప్షన్‌గా నిలుస్తోంది.         

Continues below advertisement

రైడింగ్‌ మోడ్‌లు, టాప్‌ స్పీడ్‌

TVS Orbiter‌లో Eco, City అనే రెండు రైడింగ్‌ మోడ్‌లు ఉన్నాయి. Eco మోడ్‌లో గరిష్టంగా సుమారు 46 కి.మీ./గం వేగం వస్తే, City మోడ్‌లో 68 కి.మీ./గం వరకు స్పీడ్‌ చేరుతుంది. ట్రాఫిక్‌లో నడిపే వారికి, డైలీ ఆఫీస్‌ కమ్యూట్‌ కోసం ఈ సెటప్‌ అనుకూలంగా ఉంటుంది.      

Continues below advertisement

రియల్‌ వరల్డ్‌ రేంజ్‌ టెస్ట్‌ ఎలా చేశారు?

ఎక్స్‌పర్ట్‌లు, ఈ రేంజ్‌ టెస్ట్‌ను City మోడ్‌లో మాత్రమే నిర్వహించారు. బ్యాటరీని 100 శాతం ఛార్జ్‌ చేసి, ముంబై నగర రోడ్లపై వివిధ రైడింగ్‌ పరిస్థితుల్లో నడిపారు. ప్రారంభంలో Distance-to-Empty మీటర్‌ 97 కి.మీ. చూపించింది. సుమారు 51 కి.మీ. ప్రయాణించిన తర్వాత కూడా బ్యాటరీలో 60 శాతం ఛార్జ్‌ మిగిలి ఉండటం గమనార్హం. City మోడ్‌లో 50–55 కి.మీ./గం వేగాన్ని స్కూటర్‌ సులభంగా నిలబెట్టింది. అయితే ఓవర్‌టేక్‌లకు కొద్దిగా సమయం తీసుకుంది.              

బ్యాటరీ శాతం - ప్రయాణించిన దూరం

80% ---------- 27.5 కి.మీ.

60% ---------- 51.4 కి.మీ.

40% ---------- 71.4 కి.మీ.

20% ---------- 91.7 కి.మీ.

10% ---------- 102.6 కి.మీ.

0% ---------- 112.6 కి.మీ.

చివరి 10 శాతం బ్యాటరీతో కూడా దాదాపు 10 కి.మీ. ప్రయాణించడం ఈ స్కూటర్‌ సామర్థ్యాన్ని చూపించింది. మొత్తం రియల్‌ వరల్డ్‌ రేంజ్‌ 112.6 కి.మీ. రావడం మంచి ఫలితం.

ఎవరికి ఎక్కువ రేంజ్‌ వస్తుంది?

సాధారణంగా ట్రాఫిక్‌ స్పీడ్‌తో నడిపే వారికి, ఆకస్మికంగా యాక్సిలరేటర్‌ ఇవ్వకుండా ప్రయాణించే వారికి Orbiter మంచి రేంజ్‌ ఇస్తుంది. అయితే బరువైన రైడర్‌, గట్టిగా థ్రాటిల్‌ వాడితే రేంజ్‌ తగ్గే అవకాశం ఉంటుంది.

విజయవాడ & హైదరాబాద్‌ ఆన్‌రోడ్‌ ధరలు

TVS Orbiter విజయవాడ ఆన్‌రోడ్‌ ధర

ఎక్స్‌-షోరూమ్‌ ధర: ₹1,04,900

EMPS 2024 సబ్సిడీ: ₹5,000

ఆన్‌రోడ్‌ ధర: ₹1,19,279

TVS Orbiter హైదరాబాద్‌ ఆన్‌రోడ్‌ ధర

ఎక్స్‌-షోరూమ్‌ ధర: ₹1,04,900

EMPS 2024 సబ్సిడీ: ₹5,000

ఆన్‌రోడ్‌ ధర: ₹1,06,730

మొత్తం మీద, రోజూ నగర ప్రయాణాలకు, తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం వెళ్లాలనుకునే వారికి TVS Orbiter ఓ నమ్మకమైన ఎలక్ట్రిక్‌ స్కూటర్‌గా నిలుస్తోంది. రియల్‌ వరల్డ్‌లో 110 కి.మీ. పైగా రేంజ్‌ ఇవ్వడం దీని బలంగా చెప్పుకోవచ్చు.          

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.