సంక్రాంతి పండుగ నేపథ్యంలో  దాదావు 600 ప్రత్యేక రైళ్లను నడిపింది దక్షిణ మద్య రైల్వే. ఈ రైళ్లకు వచ్చిన ఆదరణ చూసి ఫిబ్రవరి నెలలో కూడా కొన్ని వీటిలో కొన్నింటిని నడపాలని నిర్ణయించారు రైల్వే అధికారులు. అవేంటో చూద్దాం 

Continues below advertisement

రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి..1) ట్రైన్ నెం 07033 కాకినాడ -మైసూరు ఎక్స్ ప్రెస్ ను 02.02.26 నుండి 27.02.2026 వరకూ అంటే ఫిబ్రవరి నెల అంతా నడపాలని నిర్ణయించారు.  ప్రతీ సోమ, శుక్రవారాల్లో నడిచే ఈ ట్రైన్ భీమవరం,విజయవాడ, గుంటూరు, నల్గొండ, సికింద్రాబాద్, బెంగుళూరు మీదుగా మైసూర్ వెళుతుంది. కాస్త ఆల్ రౌండ్ ట్రైన్ గా పేరు పడినా దీనివల్ల గోదావరి జిల్లాల నుండి హైదరాబాద్ కు మరో రైలు అందుబాటులోకి వచ్చినట్టు అయింది. అలానే సికింద్రాబాద్ నుండి బెంగుళూరు,మైసూర్ లకు కూడా మరో డైరెక్ట్ ట్రైన్ గా ఇది నడుస్తుంది.

2) 07034-మైసూర్ -కాకినాడ ఎక్స్ ప్రెస్ ను 03.02.2026 నుండి 28.02.2026 వరకూ పొడిగించారు. భవిష్యత్ లో దీన్ని రెగ్యులర్ ట్రైన్ గా మార్చాలన్న డిమాండ్ ఎక్కువగా ఉంది.

Continues below advertisement

3) 07153-నరసాపురం -బెంగళూరు ఎక్స్ ప్రెస్ ను 6.02.26 నుండి 27.02.26 వరకూ పొడిగించారు. ఇది వీక్లీ ఎక్స్ ప్రెస్. ప్రతీ శుక్రవారం మధ్యాహ్నం 3:50కి  నరసాపురం లో బయలుదేరి భీమవరం, గుడివాడ, విజయవాడ, రేణిగుంట మీదుగా SMVT బెంగళూరు చేరుకుంటుంది 

4) 07154-SMVT బెంగళూరు -నరసాపురం ఎక్స్ ప్రెస్ ను 07.02.26 నుండి 28.02.26 వరకూ పొడిగించారు. ఈ ట్రైన్ బెంగళూరు నుండి ప్రతీ శనివారం అందుబాటులో ఉంటుంది.

5) 02863-సత్రాగచి -యెలాహంక A/C ఎక్స్ ప్రెస్ ను 22.01.26 నుండి 26.02.26 వరకూ పొడిగించారు. ఈ ట్రైన్ ప్రతీ గురువారం సత్రాగచి లో  మధ్యాహ్నం 12:50కి బయలుదేరి ఖరగ్ పూర్, కటక్, భువనేశ్వర్, పలాస, శ్రీకాకుళం రోడ్,విజయనగరం, కొత్తవలస, పెందుర్తి, సింహాచలం నార్త్,దువ్వాడ,రాజమండ్రి, విజయవాడ, గుంటూరు,నరసరావుపేట, నంద్యాల,డోన్, గుత్తి,అనంతపురం,ధర్మవరం, హిందూపూర్ మీదుగా యెలహంక చేరుకుంటుంది.

6) 02864-యెలహంక-సత్రాగచి AC ఎక్స్ ప్రెస్ ను  24.01.26 నుండి 28.02.26 వరకూ పొడిగించారు. ఈ ట్రైన్ ప్రతీ శనివారం ఉదయం 4:50కి యెలహంక (బెంగళూరు ) నుండి బయలుదేరుతుంది.

7) 07043-హైదరాబాద్ -బెల్గావి -ఎక్స్ ప్రెస్ ను 05.02.26 నుండి 12.02.26 వరకూ పొడిగించారు.ఈ ఎక్స్ ప్రెస్ ప్రతీ గురువారం సాయంత్రం 4:30కి హైదరాబాద్ లో బయలుదేరి బేగంపేట్, లింగంపల్లి,వికారాబాద్,తాండూర్,రాయచూరు, మంత్రాలయం రోడ్,ఆదోని, బళ్లారి, హోస్పెట హుబ్లీ మీదుగా బెలగావి చేరుకుంటుంది.

8) 07044-బెళగావి -హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ ను 06.2.26 నుండి 13.02.26 వరకూ పొడిగించారు. ఈ ట్రైన్ ప్రతీ శుక్రవారం మధ్యాహ్నం 1గంటకు బెళగావి లో అందుబాటులో ఉంటుంది.

9)  02841-షాలిమార్ -MGR చెన్నై ఎక్స్ ప్రెస్ ను 02.02.26 నుండి 23.02.26 వరకూ పొడిగించారు.ఈ ట్రైన్ ప్రతీ సోమవారం సాయంత్రం 6:30కి షాలిమార్ లో బయలుదేరి సత్రాగచి, ఖరగ్ పూర్,కటక్, భువనేశ్వర్,విజయవాడ, సింహాచలం నార్త్, దువ్వాడ,రాజమండ్రి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు మీదుగా MGR చెన్నై చేరుకుంటుంది.

10) 02842-MGR చెన్నై -షాలీమార్ ట్రైన్ ను 04.2.26 నుండి 25.02.26 వరకూ పొడిగించారు. ఈ ఎక్స్ ప్రెస్ ప్రతీ బుధవారం ఉదయం 4:30కి MGR చెన్నై సెంట్రల్ స్టేషన్ లో అందుబాటులో ఉంటుంది.