TVS Ntorq 125 Updated Version: టీవీఎస్ మోటార్ కంపెనీ తన స్కూటర్ ఎన్‌టార్క్ 125ను అప్‌డేట్‌తో విడుదల చేసింది. ఈ స్కూటర్‌లో కొత్త కలర్ ఆప్షన్‌లు అందించారు. ఈ స్కూటీ స్టాండర్డ్ మోడల్‌లో మూడు కొత్త రంగులు అందించారు. అదే సమయంలో దాని రేస్ ఎక్స్‌పీ వెర్షన్‌లో మరో కొత్త మ్యాట్ బ్లాక్ కలర్ కూడా చేర్చారు. కొత్త కలర్ ఆప్షన్‌ను తీసి పక్కన పెడితే టీవీఎస్ ఈ స్కూటర్‌లో ఇతర పెద్ద మార్పులు చేయలేదు.


కొత్త వేరియంట్ ధర ఎంత?
టీవీఎస్ ఎన్‌టార్క్ 125 కొత్త వేరియంట్, టీవీఎస్ ఎన్‌టార్క్ రేస్ ఎక్స్‌పీ స్కూటర్లు భారత మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. టీవీఎస్ ఎన్‌టార్క్ 125 ఎక్స్ షోరూమ్ ధర రూ. 86,871 నుంచి ప్రారంభం అవుతుంది. అదే సమయంలో టీవీఎస్ ఎన్‌టార్క్ రేస్ ఎక్స్‌పీ ఎక్స్ షోరూమ్ ధర రూ.97,501 నుంచి మొదలవుతుంది. టీవీఎస్ తన స్కూటర్‌లో ఎలాంటి మెకానికల్ మార్పులు చేయలేదు.


టీవీఎస్ ఎన్‌టార్క్ 125లో కొత్త రంగులు
టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్టాండర్డ్ మోడల్ మూడు రంగులలో వస్తుంది. వీటిలో టర్కోయిస్, హార్లెక్విన్ బ్లూ, నార్డో గ్రే ఉన్నాయి. టీవీఎస్ ఎన్‌టార్క్ రేస్ ఎక్స్‌పీ వేరియంట్ కొత్త మ్యాట్ బ్లాక్ కలర్‌లో వస్తుంది. ఈ స్కూటర్ అద్భుతమైన కలర్ వేరియంట్లు ద్విచక్ర వాహనం ఆధునిక డిజైన్‌ను ప్రదర్శిస్తాయి.


Also Read: మహీంద్రా థార్ 5 డోర్స్‌ వెర్షన్‌ ROXXలో అదిరిపోయే ఫీచర్ - సేల్స్ దుమ్ములేపాలని టార్గెట్


టీవీఎస్ ఎన్‌టార్క్ 125 ఇంజిన్ ఇలా...
టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటీలో 124.8 సీసీ 3 వాల్వ్ ఇంజన్‌తో అమర్చారు. ఈ స్కూటర్‌లోని ఇంజన్ 7,000 ఆర్‌పీఎమ్ వద్ద 9.5 బీహెచ్‌పీ పవర్, 5,500 ఆర్‌పీఎమ్ వద్ద 10.6 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. Ntorq Race XPలో కూడా ఇదే ఇంజన్ ఉపయోగించారు. కానీ ఈ వేరియంట్ ఇంజన్ టీవీఎస్ ఎన్‌టార్క్ 125 కంటే ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. టీవీఎస్ ఎన్‌టార్క్ రేస్ ఎక్స్‌పీ 10.1 బీహెచ్‌పీ పవర్‌ని, 10.6 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.


టీవీఎస్ ఎన్‌టార్క్ 125 ఫీచర్లు
టీవీఎస్ ఎన్‌టార్క్ 125 డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉంది. ఈ స్కూటర్‌ని బ్లూటూత్‌తో కూడా కనెక్ట్ చేయవచ్చు. ఇందులో రెండు రైడింగ్ మోడ్‌లు అందించారు. దీన్ని రేస్, స్ట్రీట్ మోడ్‌లో నడపవచ్చు.


టీవీఎస్ ఎన్‌టార్క్ 125 కొత్త మోడల్
టీవీఎస్ ఎన్‌టార్క్ 125కు సంబంధించి ఐదు ఎడిషన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ స్కూటర్ స్టాండర్డ్ మోడల్‌తో పాటు, రేస్ ఎడిషన్, సూపర్ స్క్వాడ్ ఎడిషన్, రేస్ ఎక్స్‌పీ, ఎక్స్‌టీ వేరియంట్లు ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. టీవీఎస్ ఎన్‌టార్క్ 125 ఎక్స్‌టీ వేరియంట్‌లో సోషల్ మీడియా నోటిఫికేషన్ల ఫీచర్ కూడా ఉంది. ఈ స్కూటర్‌లో వాయిస్ అసిస్ట్ ఫీచర్ కూడా కంపెనీ అందించింది.




Also Read: 4 లక్షల స్కూటర్లు వెనక్కి తీసుకుంటున్న సుజుకి- మీ దగ్గర ఉంటే వెంటనే షోరూమ్‌కి తీసుకెళ్లండి