Best Family Scooter Comparison Pros And Cons 2025: స్కూటర్‌ మార్కెట్లో పోటీ రోజురోజుకి పెరుగుతోంది. అందులో TVS Jupiter 110, Honda Activa, Hero Pleasure+ స్కూటర్లు ఫ్యామిలీ యూజర్స్‌ నుంచి యంగ్‌స్టర్స్‌ వరకు అందరికీ బాగా నచ్చుతున్నాయి. అయితే, ఏ బండి కొనుగోలు చేయాలి? అన్నదే సందేహంగా మారింది. దీనికి సమాధానం కోసం ప్రతి మోడల్‌లోని లాభాలు, నష్టాలు తెలుసుకోవడం చాలా అవసరం.

TVS Jupiter 110 - ప్రాక్టికల్‌ ఆప్షన్‌

లాభాలు:

  • 109.7cc ఇంజిన్‌ శక్తిమంతమైన పెర్ఫార్మెన్స్‌ ఇస్తుంది.
  • రోజువారీ ప్రయాణాలకు లీటరుకు 45-50 km వరకు మంచి మైలేజీ.
  • రైడర్‌ కంఫర్ట్‌ కోసం వెడల్పాటి సీటు, మంచి సస్పెన్షన్‌ సెటప్‌.
  • పెద్ద అండర్‌ సీట్‌ స్టోరేజ్‌, మొబైల్‌ ఛార్జింగ్‌, ఎక్స్‌టర్నల్‌ ఫ్యూయల్‌ ఫిల్లింగ్‌ లాంటి ప్రాక్టికల్‌ ఫీచర్లు.
  • నిర్వహణ సులభం, విడిభాగాలు ఈజీగా దొరుకుతాయి.

నష్టాలు:

  • డిజైన్‌ కాస్త సింపుల్‌గా ఉండడం వల్ల స్టైలిష్‌ లుక్‌ కోరుకునేవారికి అంతగా నచ్చకపోవచ్చు.
  • డిజిటల్‌ క్లస్టర్‌, బ్లూటూత్‌ కనెక్టివిటీ లాంటి మోడ్రన్‌ ఫీచర్లు లేవు.
  • హైవే రైడింగ్‌లో పవర్‌ కాస్త తక్కువ.

Honda Activa - నమ్మకమైన బ్రాండ్‌

లాభాలు:

  • 109.5cc ఇంజిన్‌ రిఫైన్డ్‌గా, స్మూత్‌గా పని చేస్తుంది.
  • హోండా బ్రాండ్‌పై నమ్మకం కారణంగా ఎక్కువమంది యాక్టివా వైపు మొగ్గు చూపుతారు.
  • మైలేజీ కూడా లీటరుకు 45-50 km రేంజ్‌లో ఉంటుంది.
  • సిటీ రైడింగ్‌లో ఈజీ హాండిల్‌ చేయవచ్చు, సింపుల్‌ లుక్స్‌లో కనిపిస్తుంది.

నష్టాలు:

  • ఫీచర్ల పరంగా చాలా బేసిక్‌ స్కూటర్‌.
  • కొత్తగా మార్కెట్లో ఉన్న మోడల్స్‌తో పోలిస్తే డిజైన్‌లో మార్పులు తక్కువ.
  • ధర కాస్త ఎక్కువగా ఉంటుంది, కానీ ఫీచర్లు లిమిటెడ్‌.

Hero Pleasure Plus - స్టైలిష్‌ బడ్జెట్‌ ఆప్షన్‌

లాభాలు:

  • 110cc ఇంజిన్‌ సిటీ రైడింగ్‌కి సరిపడే పవర్‌ ఇస్తుంది.
  • కాంపాక్ట్‌ డిజైన్‌, తేలికైన బాడీ వల్ల మహిళలకు, సీనియర్‌ సిటిజన్లకు సులభంగా నడపడానికి వీలవుతుంది.
  • కలర్‌ ఆప్షన్లు, డిజైన్‌ స్టైలిష్‌గా ఉండటం యువతరాన్ని ఆకర్షిస్తుంది.
  • మైలేజీ లీటరుకు 50 km వరకు ఇస్తుంది.

నష్టాలు:

  • లాంగ్‌ డ్రైవ్స్‌కి అంత కంఫర్ట్‌ ఇవ్వదు.
  • స్టోరేజ్‌ స్పేస్‌ జూపిటర్‌తో పోలిస్తే తక్కువ.
  • పవర్‌ కూడా హైవే రైడ్స్‌లో తగ్గిపోతుంది.

ఎవరికి ఏది సూటవుతుంది?

డైలీ యూజ్‌, ఫ్యామిలీ కోసం - TVS జూపిటర్ 110 ఉత్తమం.        

నమ్మకమైన బ్రాండ్‌, సింపుల్‌ యూజ్‌ కోసం - Honda Activa సరైన ఎంపిక.            

స్టైల్‌, బడ్జెట్‌, తేలికైన స్కూటర్‌ కోసం - Hero Pleasure+ మంచి ఆప్షన్‌.        

ప్రాక్టికాలిటీ & కంఫర్ట్‌ ముఖ్యం అయితే జూపిటర్, రిలయబిలిటీ & సింప్లిసిటీ కావాలంటే ఆక్టివా, స్టైల్ & బడ్జెట్‌ కోరుకునేవారికి ప్లెజర్ ప్లస్‌ సరైన స్కూటర్‌గా చెప్పవచ్చు.