Long Range Electric Scooter | ప్రపంచ వ్యాప్గంగా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ఇదివరకు భారత్‌లోనూ EV కొనేముందు ఛార్జింగ్, రేంజ్ గురించి ఆలోచించేవారు. ఇప్పుడు భారత మార్కెట్లోకి లాంగ్ రేంజ్ కు అద్భుతంగా ఉపయోగపడే స్కూటర్లు వచ్చేశాయి. అదే సమయంలో పెట్రోల్ ఖర్చులతో పోల్చితే తక్కువ మెయింటనెన్స్ వీటికి ప్లస్ పాయింట్. కొన్ని Electric Scooterలు సింగిల్ ఛార్జ్‌తో ఏకంగా 200KM కంటే ఎక్కువ దూరం వెళ్తాయని కంపెనీలు క్లెయిమ్ చేస్తున్నాయి. దాంతో ఇక పెట్రోల్ వాహనాలకు డిమాండ్ తగ్గుతోంది. పెట్రోల్ స్కూటర్లను వదిలేసి EV వైపు షిఫ్ట్ అవుతున్నారు.
ఎక్కువ రేంజ్‌తో పాటు తక్కువ రన్నింగ్ కాస్ట్, స్మార్ట్ ఫీచర్లు యువతను బాగా ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం TVS iQube హై రేంజ్ మోడల్స్ వైరల్ అవుతున్నాయి. మరోవైపు Bajaj, Hondaల రాబోయే EV మోడల్స్ మార్కెట్లో పోటీని పెంచుతున్నాయి. ప్రస్తుతం కస్టమర్లు కేవలం డిజైన్‌ను మాత్రమే కాకుండా బ్యాటరీ పర్ఫార్మెన్స్, ఫీచర్లు, రియల్ లైఫ్ రేంజ్‌కు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు.
212KM రేంజ్ ఇవ్వనున్న Electric Scooter ఎక్కువ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్లు భారత మార్కెట్లో సరికొత్త ట్రెండ్‌గా మారాయి. TVS iQube కొన్ని ప్రీమియం మోడల్స్ దాదాపు 212 కిలోమీటర్ల వరకు IDC రేంజ్ ఇస్తామని క్లెయిమ్ చేస్తున్నారు. దాంతో ఎక్కువ దూరం ప్రయాణించే వారు ఈ ఈవీ వైపు ఫోకస్ చేస్తున్నారు. ఈ స్కూటర్లలో టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, నావిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు మల్టిపుల్ రైడింగ్ మోడ్స్ వంటి అడ్వాన్స్డ్ ఫీచర్లు లభిస్తాయి.
Also Read: Bike Customization: సులభంగా కస్టమైజ్ చేయించగల టాప్ 5 బైకులివే..స్పెషల్ లుక్ ఎలా ఇవ్వాలంటే..
ప్రస్తుతం చాలా మంది యూజర్లు ప్రతిరోజూ ఛార్జింగ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. Ather, OLA వంటి కంపెనీలు కూడా తమ కొత్త మోడల్స్‌లో మెరుగైన బ్యాటరీ, ఎక్కువ రేంజ్ ఇవ్వడంపై ఫోకస్ చేశాయి. పెరుగుతున్న పెట్రోల్ ధరల మధ్య, ఎక్కువ రేంజ్ ఇచ్చే EVలు వ్యక్తిగతంగానూ, దేశానికి సైతం ప్రయోజనకరంగా మారుతున్నాయి. కేంద్రం సైతం అధికంగా ముడి చమురు దిగుమతి చేసుకోవద్దని, దాని వల్ల విదేశీ మారక ద్రవ్యంపై ప్రభావం చూపుతాయని చెబుతోంది.
Honda, Bajajలతో పోటీ అంత సులువు కాదుBajaj Chetak తన మన్నికైన బిల్డ్ క్వాలిటీ, నమ్మకమైన పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంటోంది. అలాగే Honda కూడా భారత మార్కెట్‌కు కావాల్సిన కొత్త Electric Scooterలను సిద్ధం చేస్తోంది. ప్రస్తుతానికి ఎక్కువ రేంజ్, హైటెక్ ఫీచర్ల విషయంలో కొత్త EV బ్రాండ్లు ఎక్కువగా వార్తల్లో ఉంటున్నాయి. కస్టమర్లు ఇప్పుడు స్టైలిష్‌గా కనిపించే, ఎక్కువ దూరం ప్రయాణించే, రోజువారీ ఖర్చులను తగ్గించే స్కూటర్లను కొంటున్నారు.
ఇందువల్లే 200KM కంటే ఎక్కువ రేంజ్ ఇచ్చే Electric Scooterలకు డిమాండ్ పెరుగుతోంది. ప్రతిరోజూ ఛార్జింగ్ పెట్టే అవసరం లేకపోవడంతో ఇలాంటి EV లకు మార్కెట్లో పోటీ మరింత పెరుగుతుంది. ప్రతి కంపెనీ ఇప్పుడు ఎక్కువ రేంజ్, ఫాస్ట్ ఛార్జింగ్, స్మార్ట్ టెక్నాలజీ, ఫీచర్లపై పనిచేస్తోంది.
Also Read: EV vs Petrol Car.. వర్షాకాలంలో ఏది బెటర్? రెండింటి సేఫ్టీ ఫీచర్లు ఎలా ఉంటాయి?
