EV vs Petrol Car On Monsoon: భారత్ సహా పలు దేశాల్లో ఎలక్ట్రిక్ వాహనాల (EV) మార్కెట్ వేగంగా పుంజుకుంటోంది. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు, పర్యావరణానికి సైతం మేలు చేస్తుందన్న అవగాహన కారణంగా జనం ఎలక్ట్రిక్ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, వర్షాకాలం ప్రారంభం కాగానే చాలా మంది వాహనదారులకు ఒక డౌట్ వస్తుంది. భారీ వర్షాలు, నీరు నిలిచిన రోడ్లపై ఈవీ కారు సురక్షితమా లేక పెట్రోల్ కారా? నడిపితే మంచిదా అని ఆలోచిస్తుంటారు. వర్షాకాలంలో పెట్రోల్ లేదా ఈవీ కార్లు.. వేటిని ఎక్కువగా నమ్మవచ్చు. ఈ రెండింటి సెక్యూరిటీ ఫీచర్లు ఎలా ఉంటాయో ఇక్కడ తెలుసుకోండి. 

Continues below advertisement

వర్షంలో ఎలక్ట్రిక్ కార్లు ఎంతవరకు సురక్షితం?ఎలక్ట్రిక్ వాహనాలను అన్ని రకాల వెదర్ కండీషన్లను దృష్టిలో ఉంచుకునే డిజైన్ చేస్తారు. వీటిలో ఉపయోగించే బ్యాటరీ ప్యాక్, హై వోల్టేజ్ వైరింగ్, ఎలక్ట్రికల్ సిస్టమ్‌లను ప్రత్యేక భద్రతా ప్రమాణాల ప్రకారమే కంపెనీలు తయారు చేస్తాయి. ఈవీ బ్యాటరీ లోపలికి నీరు కానీ, దుమ్ము  ప్రవేశించకుండా ఉండేలా దానిని పూర్తిగా సీల్ చేస్తారని తెలిసిందే. చాలా వరకు ఎలక్ట్రిక్ కార్లు వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ స్థాయిని తెలిపే ఐపీ (IP) రేటింగ్‌తో వస్తాయి. అందుకే సాధారణ వర్షంలో రోడ్లపై ఈవీ నడపడం పూర్తిగా సురక్షితంగా భావించవచ్చు. మరోవైపు, ప్రపంచంలోని పలు దేశాలలో భారీ వర్షాలు, మంచు కురిసే ప్రాంతాలలో కూడా ఎలక్ట్రిక్ కార్లను ఏ ఇబ్బంది లేకుండా ఉపయోగిస్తున్నారు. ఏ వాహనమైనా సరే.. నీరు ఎక్కువగా నిలిచిన ప్రాంతాల్లోకి తీసుకెళ్లకూడదు. వాహనం నీళ్లలో చిక్కుకునే ప్రమాదం ఉంటుంది.

వర్షంలో ఈవీని ఛార్జ్ చేయడం సురక్షితమేనా?ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి ప్రజల్లో ఛార్జింగ్ గురించి అపోహలు ఉంటాయి. వర్షం పడుతున్నప్పుడు ఛార్జింగ్ పెడితే కరెంట్ షాక్ కొడుతుందేమోనని చాలా మంది అనుకుంటారు. ఆధునిక ఛార్జింగ్ సిస్టమ్‌లు అనేక రకాల భద్రతా సాంకేతికతలతో వస్తాయి. సాధారణ వర్షం లేదా తేమ ఉన్న సమయంలో కూడా భద్రత ఉండేలా ఛార్జింగ్ పోర్ట్, కనెక్టర్‌లను డిజైన్ చేస్తారు. ఇళ్ల వద్ద, పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు కూడా నిర్ణీత భద్రతా ప్రమాణాల ప్రకారమే ఏర్పాట్లు చేస్తారు. అయినప్పటికీ, వర్షంలో ఛార్జింగ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పదు. 

Continues below advertisement

Also Read: Bike Customization: సులభంగా కస్టమైజ్ చేయించగల టాప్ 5 బైకులివే..స్పెషల్ లుక్ ఎలా ఇవ్వాలంటే..

పెట్రోల్ కార్లకు సైతం వర్షాకాలం కొంచెం ఇబ్బందేఒకవైపు వాహనదారులు ఎలక్ట్రిక్ కార్ల గురించి ఆందోళన చెందుతుంటే, మరోవైపు వర్షాకాలం పెట్రోల్, డీజిల్ కార్లకు కూడా సవాళ్లను తెచ్చిపెడుతుంది. నిరంతరం తేమ, బురద, నీటిలో తడవడం, కాంటాక్ట్ ఉండటం వల్ల వాహనంలోని అనేక భాగాలపై ప్రభావం పడుతుంది.  ముందుగా కార్ లైట్లపై దృష్టి పెట్టాలి. హెడ్‌లైట్, ఫాగ్ లైట్, టెయిల్ లైట్ కేసింగ్‌లలో ఏవైనా పగుళ్లు లేదా లీకేజీలు ఉంటే నీరు లోపలికి వెళ్లి, లైటింగ్ తగ్గిపోయే ఛాన్స్ ఉంది. వర్షాకాలంలో రబ్బర్ సీల్స్ కూడా చాలా ముఖ్యమే. ఒకవేళ డోర్లు, కిటికీల రబ్బర్ సీల్స్ పాడైపోతే, నీరు కేబిన్ లోపలికి వచ్చి కారు ఇంటీరియర్‌ను దెబ్బతీస్తుంది.

వర్షాకాలంలో దేనిని నమ్మవచ్చు?భద్రత పరంగా చూస్తే.. వర్షంలో ఈవీ మరియు పెట్రోల్ కార్లు రెండూ సురక్షితమైనవే. ఎలక్ట్రిక్ కార్లలో బ్యాటరీ మరియు ఛార్జింగ్ సిస్టమ్‌ను కాపాడటానికి అడ్వాన్స్డ్ వాటర్‌ప్రూఫ్, ఎలక్ట్రికల్ ప్రొటెక్షన్ ఇస్తారు. అదే సమయంలో పెట్రోల్ కార్లలో ఇంజన్, బ్రేకులు, లైట్లు మరియు అండర్ బాడీని క్రమం తప్పకుండా చెక్ చేసుకుంటూ జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.