Rishabh Pant Steps Down As LSG Captain Post IPL 2026: ఇండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ క్రికెట్ కెరీర్ ప్రస్తుతం ఒక లీన్ ప్యాచ్ (ఫామ్‌లేమి) లో సాగుతోంది. రీసెంట్ గా ఇంటర్నేషనల్ క్రికెట్ లోనే కాకుండా ఇండియన్ ప్రీమియ‌ర్ లీగ్ (IPL) లో కూడా పంత్ ఘోరంగా నిరాశపరిచాడు. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు లక్నో సూపర్ జాయింట్స్ (LSG) రికార్డ్ స్థాయిలో రూ. 27 కోట్లు పెట్టి పంత్‌ను కొనుగోలు చేసింది. అయితే ఫ్రాంచైజీ నమ్మకాన్ని పంత్ నిలబెట్టలేకపోయాడు. అటు కెప్టెన్‌గా, ఇటు ప్లేయర్‌గా రెండు సీజన్లలోనూ దారుణంగా ఫెయిల్ అయ్యాడు. ఐపీఎల్ 2026 ముగిసిన వెంటనే లక్నో కెప్టెన్సీ నుంచి పంత్ తప్పుకున్నాడు. ఈ క్రమంలోనే పంత్‌ను వదిలించుకోవాలని లక్నో, మళ్లీ పాత కెప్టెన్‌ను వెనక్కి తీసుకోవాలని ఢిల్లీ క్యాపిటల్స్ ఒక బిగ్ స్వాప్ డీల్ (ప్లేయర్ల మార్పిడి) ప్లాన్ చేశాయి.

Continues below advertisement

Read Also: Tilak Varma Comments: ఫైనల్ సమరానికి ముందే లంకకు మైండ్ గేమ్స్ షాక్.. ప్రెజర్ హ్యాండ్లింగ్ నేర్చుకున్నానంటూ తిలక్ వర్మ ఛాలెంజ్, లంక ఓపెనర్లే త‌మ టార్గెట్

 పే కట్ తో పంత్ రీ ఎంట్రీ..! ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జాయింట్స్ మధ్య ఒక భారీ ట్రేడింగ్ జరగబోతోందని ప్రముఖ క్రికెట్ వెబ్‌సైట్  తన రిపోర్ట్ లో క్లెయిమ్ చేసింది. ఈ డీల్ ప్రకారం రిషభ్ పంత్ తిరిగి ఢిల్లీ క్యాపిటల్స్ లోకి రానుండగా, లక్నో టీమ్ లోకి చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వెళ్లనున్నాడు. అయితే ఢిల్లీలోకి రావడం కోసం పంత్ భారీగా తన శాలరీని తగ్గించుకోవడానికి (పే కట్) రెడీ అయ్యాడు. ఐపీఎల్ 2026 వరకు ఢిల్లీ క్యాపిటల్స్ లో కుల్దీప్ యాదవ్ శాలరీ రూ. 13.25 కోట్లుగా ఉంది. దాదాపు ఇదే ప్రైస్ ట్యాగ్‌తో పంత్ ఢిల్లీకి వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఫామ్ లో లేని పంత్ కోసం కీ ప్లేయర్ అయిన కుల్దీప్ యాదవ్‌ను వదులుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనే చర్చ ఐపీఎల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్‌గా మారింది.

Continues below advertisement

Read Also: T20 World Cup - IND W vs SA W Preview: మాంచెస్టర్‌లో అస‌లైన ప‌రీక్ష‌.. సౌతాఫ్రికాను ఢీకొన‌బోతున్న హర్మన్‌ప్రీత్ సేన, సెమీస్ బెర్త్ పై క‌న్ను!

కుల్దీప్ ను వదులుకోవ‌డం చాలా పెద్ద త‌ప్పు..ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకుంటున్న ఈ నిర్ణయాన్ని ఇండియా మాజీ బ్యాటర్ మొహమ్మద్ కైఫ్ తీవ్రంగా తప్పుబట్టాడు. కుల్దీప్‌ను లక్నోకు పంపించడం ఢిల్లీ క్యాపిటల్స్ చేసే హిస్టారికల్ బ్లండర్ అని హెచ్చరించాడు. "ఢిల్లీ టీమ్ కుల్దీప్‌ను ఎల్‌ఎస్‌జీకి పంపిస్తే అంతకంటే పెద్ద పొరపాటు మరొకటి ఉండదు. ఈ ఒక్క ఏడాది పర్ఫార్మెన్స్ పక్కన పెట్టండి. కేవలం ఒక సీజన్ బ్యాడ్ ఫామ్ చూసి ప్లేయర్‌ను జడ్జ్ చేయకూడదు. ఢిల్లీ క్యాంప్ లో సౌరవ్ గంగూలీ కూడా ఉన్నాడు. పదేళ్లుగా క్రికెట్ ఆడుతున్న ఒక వరల్డ్ క్లాస్ ప్లేయర్‌ను ఒకే ఒక్క సీజన్ బేసిస్ మీద తక్కువ అంచనా వేయవద్దని గంగూలీ ఎప్పుడూ చెప్తుంటాడు. గతంలో కేకేఆర్ (KKR) టీమ్ ఇలాగే పానిక్ అయి కుల్దీప్‌ను వదిలేస్తే, ఢిల్లీ అతన్ని పిక్ చేసుకుంది. ఆ తర్వాత కుల్దీప్ ఎలాంటి మ్యాజిక్ చేశాడో అందరం చూశాం" అని కైఫ్ తన యూట్యూబ్ ఛానెల్ లో స్పష్టం చేశాడు.

కుల్దీప్ ఒంటిచేత్తో ..ఢిల్లీ క్యాపిటల్స్ ఈ ట్రేడ్ చేసిందంటే బ్యాడ్ టైమ్ లో కుల్దీప్‌కు ఎవరూ సపోర్ట్ చేయడం లేదనే విషయం క్లియర్ గా అర్థమవుతోందని కైఫ్ ఆవేదన వ్యక్తం చేశాడు. "గతంలో కేకేఆర్ సపోర్ట్ ఇవ్వలేదు, ఇండియా టీమ్ లోనూ ఫస్ట్ అతనిపైనే వేటు వేస్తారు. కుల్దీప్ లాంటి స్కిల్ ఉన్న బౌలర్ దొరకడం చాలా కష్టం. ఇలాంటి టైమ్ లో ప్లేయర్‌ను బ్యాక్ చేయాలి. ఐపీఎల్ లో ఢిల్లీ ఓడిపోవడానికి కేవలం కుల్దీప్ ఒక్కడే కారణం కాదు. టీమ్ మేనేజ్‌మెంట్ ఎన్నో తప్పులు చేసింది, అందులో కుల్దీప్ ఫామ్ కూడా ఒక ఫ్యాక్టర్ మాత్రమే. అంతేకాని ఒకరిపైనే బ్లేమ్ వేసి అతన్ని డ్రాప్ చేయడం, లక్నోకు వదిలేయడం బిగ్గెస్ట్ మిస్టేక్ అవుతుంది" అని కైఫ్ స్పష్టం చేశాడు. ఈ మెగా ట్రేడ్ పై ఐపీఎల్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాడు.