Yash's Toxic New Release Date Locked : రాకింగ్ స్టార్ యశ్ అవెయిటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ టాక్సిక్ రిలీజ్ డేట్ వచ్చేసింది. 'ధురంధర్ 2'తో పాటు రిలీజ్ కావాల్సిన ఈ మూవీ పలుమార్లు వివిధ కారణాలతో వాయిదా పడింది. ఫైనల్‌గా యశ్ రిలీజ్ డేట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.

Continues below advertisement

రిలీజ్ ఎప్పుడంటే?

వరల్డ్ వైడ్‌గా ఆగస్ట్ 26న టాక్సిక్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫాదర్స్ డే సందర్భంగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ స్పెషల్ పోస్ట్ చేశారు యశ్. కేజీఎఫ్ తర్వాత థియేటర్లలోకి వస్తున్న యశ్ మూవీ కావడంతో భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఇప్పటికే రిలీజైన హీరో ఇంట్రడ్యూసింగ్ వీడియో, టీజర్ ట్రెండ్ అవుతున్నాయి. మోస్ట్ వయలెంట్ యాక్షన్ సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. 

Continues below advertisement

Also Read : Kiran Abbavaram : మొన్న క, నిన్న కె ర్యాంప్, నేడు చెన్నై లవ్ స్టోరీ - వరుస హిట్స్ కన్ఫర్మ్ చేసిన కిరణ్ అబ్బవరం

ఈ మూవీకి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించగా... పవర్ ఫుల్ రాయగా యశ్ కనిపించనున్నారు. ఐదుగురు హీరోయిన్స్ కీలకపాత్రలో కనిపించనున్నారు. నదియా పాత్రలో కియారా అద్వానీ, రెబెకాగా తారా సుతారియా, మెలిసా పాత్రలో రుక్మిణి వసంత్, గంగ పాత్రలో నయనతార, ఎలిజిబెత్‌గా హుమా ఖురేషీ నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన లుక్స్ ట్రెండ్ అవుతున్నాయి. KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ మూవీని నిర్మిస్తున్నారు. వరల్డ్ వైడ్‌గా తెలుగుతో పాటు తమిళం, ఇంగ్లీష్, హిందీ, మలయాళం భాషల్లో మూవీ రిలీజ్ కానుంది. 

1940 - 70 టైంలో గోవా బ్యాక్‌డ్రాప్‌గా సాగే పవర్ ఫుల్ యాక్షన్ థ్రిల్లర్‌గా టాక్సిక్ తెరకెక్కించారు. అందమైన తీర ప్రాంతం చుట్టూ సాగే ఇల్లీగల్ యాక్టివిటీస్, మాఫియా నేర సామ్రాజ్యం, సిండికేట్స్, వయలెన్స్ ఇలా అన్నింటితోనూ పోరాడే ఓ సామాన్యుడు, వీటిని అధిగమించి లీడర్‌గా ఎదిగిన తీరును మూవీలో చూపించారు. పవర్ ఫుల్ యాక్షన్ మూవీలో యశ్‌ను ఎప్పుడెప్పుడు చూస్తామా? అంటూ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

Also Read : Chennai Love Story Jigithara Song : జిగితార జిగితార దిగినావా మనసారా - క్యూట్ కపుల్‌కు ఫీల్ గుడ్ లిరిక్స్