Triumph Thruxton 400 Price In Hyderabad, Vijayawada: స్టైలిష్, రెట్రో లుక్ & స్మార్ట్‌ ఫీచర్లతో ట్రయంఫ్‌ థ్రక్ట్సన్‌ 400 భారతదేశంలో లాంచ్‌ అయింది. దీని ధర రూ. 2.74 లక్షలు (ఎక్స్-షోరూమ్). హైదరాబాద్‌ & విజయవాడలో.. రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు, ఇన్సూరెన్స్‌, ఇతర అవసరమైన ఖర్చులు కలుపుకుని ఆన్‌-రోడ్‌ ధర (Triumph Thruxton 400 on-road price, Hyderabad) దాదాపు రూ. 3.31 లక్షలు అవుతుంది. రైడింగ్ & స్టైల్ విషయంలో రాజీ పడకూడదనుకునే బైకర్ల కోసం ఈ బైక్‌ను ప్రత్యేకంగా తయారు చేశారు.

బలమైన పునరాగమనంథ్రక్ట్సన్‌ అనే పేరు, కేఫ్ రేసర్ స్టైల్ బైక్‌లతో బాగా పాపులర్‌ అయింది. ఈసారి ట్రయంఫ్, తన థ్రక్ట్సన్‌ 400 ను కొత్త & ఆధునిక రూపంలో పరిచయం చేసింది. ఇది 398cc TR-సిరీస్ ఇంజిన్‌తో వచ్చింది, 42 PS పవర్‌ ఇస్తుంది. శక్తి & పనితీరు పరంగా, ఈ బైక్ దాని విభాగంలోని ఇతర బైక్‌ల కంటే ముందుంది. థ్రక్ట్సన్‌ 400 అధిక వేగాన్ని & అదే సమయంలో అద్భుతమైన నియంత్రణ కలగలిపి మంచి రైడింగ్‌ అనుభవాన్ని అందిస్తుంది.

ట్రయంఫ్ థ్రక్ట్సన్‌ 400, ప్రతి ఒక్కరూ తిరిగి చూసే రూపంతో లాంచ్‌ అయింది. కండలు తిరిగిన యోధుడిలా కనిపించే & జాగ్రత్తగా డిజైన్‌ చేసిన ఇంధన ట్యాంక్, క్లిప్-ఆన్ హ్యాండిల్‌ బార్లు & కలర్‌-కోడెడ్ బుల్లెట్ సీట్ కౌల్ వంటి ప్రత్యేక అంశాలు దీని డిజైన్‌లో ఉన్నాయి, ఇవి ఈ బండిని ఎంతటి జనసమూహంలోనైనా ప్రత్యేకంగా నిలబెటతాయి. ఈ బైక్ పూర్తిగా రెట్రో కేఫ్ రేసర్ లుక్‌ ఇస్తుంది, అదే సమయంలో ఆధునిక టచ్ కూడా కనిపిస్తుంది.

పనితీరు & సాంకేతికతట్రయంఫ్ థ్రక్ట్సన్‌ 400 లుక్స్‌లోనే కాకుండా పెర్ఫార్మెన్స్ & టెక్నాలజీ పరంగా కూడా గొప్ప బైక్‌. ట్రాక్షన్ కంట్రోల్‌ను మార్చుకోగలగే సౌకర్యం దీనిలో ఉంది, ఇది బైక్‌ను జారే రోడ్లపై కూడా స్థిరంగా ఉంచుతుంది. టార్క్-అసిస్ట్ క్లచ్ కారణంగా క్లచ్ ఆపరేషన్ చాలా స్మూత్‌గా ఉంటుంది, తద్వారా ఎక్కువ దూరం ప్రయాణించేటప్పుడు రైడర్‌ అలసిపోడు. రైడ్-బై-వైర్ థ్రోటిల్ సహాయంతో బైక్ ప్రతి మలుపులోనూ అద్భుతమైన ప్రతిస్పందనను ఇస్తుంది. అలాగే, దాని డెడికేటెడ్ ఛాసిస్ & అప్‌గ్రేడ్ సస్పెన్షన్ సిస్టమ్ రైడ్‌ను మరింత సౌకర్యవంతంగా & నియంత్రణలో ఉంచేలా చేస్తాయి.

ట్రయంఫ్ థ్రక్ట్సన్‌ 400 గురించి ఒక ప్రత్యేక విషయం ఏమిటంటే దీనికి సుదీర్ఘ సర్వీస్‌ విరామం ఉంది, కాబట్టి దీని నిర్వహణ ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. సాధారణంగా, ట్రయంఫ్ బైకుల నిర్మాణ నాణ్యత బలంగా ఉంటుంది, ప్రపంచవ్యాప్తంగా ఇష్టపడడానికి ఇది కూడా ఒక కారణం. థ్రక్ట్సన్‌ 400 కూడా ఈ నమ్మకాన్ని నిలబెట్టుకోలదని భావిస్తున్నారు. ఈ బైక్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని పెద్ద దేశాల్లో అందుబాటులో ఉంది. 

థ్రక్ట్సన్‌ 400 ఎక్స్-షోరూమ్ ధర రూ. 2,74,137, ఇది ఎక్కువగా అనిపించినప్పటికీ... ప్రీమియం బైక్‌ల సెగ్మెంట్‌లో ఇది బడ్జెట్-ఫ్రెండ్లీ బైక్‌గా నిలుస్తుంది.