Upcoming Toyota SUV: టయోటా కిర్లోస్కర్ మోటార్ ఇటీవలే 'అర్బన్ క్రూయిజర్ టెయిజర్' అనే కొత్త పేరును ట్రేడ్‌మార్క్ చేయడానికి దరఖాస్తు చేసింది. ఇది కొత్త వాహనానికి సంబంధించింది. ఈ నేమ్‌ప్లేట్‌తో వస్తున్న ఉత్పత్తి గురించి ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక సమాచారం లేదు. మారుతి సుజుకి ఫ్రాంక్స్‌కు రీ బ్యాడ్జ్‌డ్ మోడల్ ఇదేనని తెలుస్తోంది. ఇదే టెయిజర్ పేరుతో మార్కెట్లో లాంచ్ కావచ్చని భావిస్తున్నారు. ఈ కారు కంపెనీ నిలిపివేసిన అర్బన్ క్రూయిజర్ స్థానాన్ని భర్తీ చేస్తుంది.
డిజైన్
టయోటా, మారుతి సుజుకి భాగస్వామ్యంలో అభివృద్ధి అయిన ఈ కాంపాక్ట్ క్రాసోవర్ ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్ డిజైన్‌లో కొన్ని మార్పులు చూడవచ్చు. టయోటా టెయిజర్ మైక్రో ఎస్‌యూవీ కొత్త ఫ్రంట్, రియర్ బంపర్ డిజైన్‌తో పాటు కొత్త వీల్స్‌ను పొందుతుంది. ఫాగ్ ల్యాంప్స్ చుట్టూ కనిపించే కొన్ని ప్లాస్టిక్ ఎలిమెంట్స్‌లో కూడా మార్పులు చూడవచ్చు. ఇవి టయోటా రుమియన్ ఎంపీవీ లాగా ఉండవచ్చు. ఇంటీరియర్‌లు కొత్త ఇన్‌సర్ట్‌లు, అప్‌హోల్స్టరీతో అప్‌డేట్ అయిన డ్యాష్‌బోర్డ్‌ను చూడవచ్చు.
ఫీచర్లు
కొత్త టెయిజర్‌కు సంబంధించిన టాప్ ఎండ్ ట్రిమ్ లెదర్ కవర్ స్టీరింగ్ వీల్, 360 డిగ్రీ కెమెరా, హెడ్స్ అప్ డిస్‌ప్లే (HUD), క్రూయిజ్ కంట్రోల్, 16 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్స్ వంటి ఫీచర్లను పొందవచ్చు. 6 స్పీకర్ సౌండ్ సిస్టమ్, ఫాస్ట్ యూఎస్‌బీ ఛార్జింగ్ పాయింట్, సుజుకి కనెక్టెడ్ కార్ ఫీచర్లు, రియర్‌వ్యూ కెమెరా, కలర్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జర్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన 9.0 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వాయిస్ అసిస్టెంట్, OTA అప్‌డేట్‌లు, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు వంటి ఇతర ఫీచర్లు కూడా అందించనున్నారు.
ఇంజిన్ ఎలా ఉండనుంది?
ఈ కారు పవర్‌ట్రెయిన్ గురించి చెప్పాలంటే ఇందులో మారుతి ఫ్రాంక్స్ తరహా ఇంజిన్‌నే అందిస్తారని భావిస్తున్నారు. ఇది రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌ల్లో రానుంది. ఇందులో 1.2 లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ అందించనున్నారు. ఇది 90 బీహెచ్‌పీ పవర్‌ని, 113 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంకో 1.0 లీటర్ బూస్టర్‌జెట్ ఇంజన్ 100 బీహెచ్‌పీ శక్తిని, 147 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్లు మాన్యువల్, ఏఎంటీ గేర్‌బాక్స్‌లతో అందుబాటులో ఉన్నాయి. ఇది 1.2 లీటర్ పెట్రోల్ మాన్యువల్ ఇంజిన్ 21.79 కిలోమీటర్ల మైలేజీని అందించనుంది. 1.0 లీటర్ టర్బో పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ 21.5 కిలోమీటర్ల మైలేజ్‌ని, 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఆటోమేటిక్ 20.01 కిలోమీటర్ల మైలేజీని అందించే అవకాశం ఉంది.
వేటితో పోటీ పడుతుంది?
ఈ కారు టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్‌టర్‌లతో పోటీపడుతుంది. రెండూ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను పొందుతాయి. ఈ రెండు మోడల్స్‌లోనూ సీఎన్‌జీ పవర్‌ట్రెయిన్ ఆప్షన్ అందుబాటులో ఉండనుంది.
Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?
Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial