ఆటోమొబైల్స్‌లో భవిష్యత్తు ఏది? ఎలక్ట్రిక్ కార్లా లేకపోతే హైడ్రోజన్ కార్లా? లేకపోతే ఇవి రెండూ సమాంతరంగా ఎదుగుతాయా? అయితే ప్రస్తుతం నంబర్లను చూస్తే ఎలక్ట్రిక్ కార్ల కంటే హైడ్రోజన్ కార్లే ముందంజలో ఉన్నాయని చెప్పవచ్చు. హైడ్రోజన్ నింపడానికి తక్కువ సమయం పడుతుంది. దీంతోపాటు ఎలక్ట్రిక్ కారు కంటే ఎక్కువ రేంజ్‌ను అందిస్తుంది.


ప్రస్తుతం ఎక్కువ హైడ్రోజన్ కార్లు అందుబాటులో లేవు. కానీ టొయోటా మాత్రం ఒక హైడ్రోజన్ కారును రూపొందించింది. అదే టొయోటా మిరాయ్. హైడ్రోజన్‌పై ఈ కారు పనిచేయనుంది. ఇందులో మొదటి తరం 2014లోనే లాంచ్ కాగా... ఇది దానికి తర్వాతి వెర్షన్.


ఇది ఒక హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ కారు. ఇందులో మూడు హైడ్రోజన్ ట్యాంకులు, ఫ్యూయల్ సెల్స్ అందించారు. ఇందులో లిథియం ఇయాన్ బ్యాటరీ, ఎలక్ట్రిక్ మోటార్ కూడా ఉన్నాయి. ఈ మూడు హైడ్రోజన్ ట్యాంకుల్లో 5.6 కేజీల హైడ్రోజన్ ఫిల్ చేయవచ్చు. సాధారణంగా ఇంత హైడ్రోజన్‌తో 600 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. కానీ ఈ కారు 1,000 కిలోమీటర్ల రేంజ్‌ను అందించనుంది.


కొత్త మిరాయ్ చూడటానికి లగ్జరీ సెడాన్‌లా అనిపించింది. ఇందులో పెద్ద వీల్ బేస్ అందించారు. హైడ్రోజన్ ట్యాంకుల కోసం ఎక్కువ స్పేస్ కూడా ఇందులో ఉంది. దీని ఇంటీరియర్ కూడా చాలా లగ్జరియస్‌గా ఉండనుంది. ఇందులో జేబీఎల్ ఆడియో సిస్టంను అందించారు. సస్టెయినబుల్ లెదర్ అప్‌హోల్స్టెరీ కూడా ఇందులో ఉంది.


డ్రైవ్ చేయడానికి ఇది ఎలక్ట్రిక్ కారు తరహాలో ఉంది. ఈ కారు డ్రైవ్ చేయడానికి చాలా స్మూత్‌గా ఉంది. అస్సలు సౌండ్ రాదు. అయితే హైడ్రోజన్, దానికి సంబంధించిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో తెలియాల్సి ఉంది.


ఈ కారును ఫిల్ చేయడానికి 10 నిమిషాల సమయం పట్టనుంది. ప్రస్తుతం మనదేశంలో హైడ్రోజన్ ఖరీదు కొంచెం ఎక్కువగా ఉంది. అయితే పెట్రోల్, డీజిల్ ధరలు భవిష్యత్తులో పెరుగుతాయి. కానీ హైడ్రోజన్ ఖరీదు తగ్గుతుందని వార్తలు రానుండటం విశేషం.


Also Read: Baleno Vs Swift: బలెనో వర్సెస్ స్విఫ్ట్ - బడ్జెట్ కార్లలో ఏది బెస్ట్!


Also Read: ఏకంగా మూడు కొత్త కార్లు లాంచ్ చేయనున్న జీప్ - అదిరిపోయే ఫీచర్లు - ధర కూడా తక్కువగానే!