Toyota Land Cruiser Prado J250 Price And Features: టయోటా ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో J250 డీజిల్ వేరియంట్‌ను మొదటిసారిగా భారతదేశ మార్కెట్‌లో అమ్మకానికి తెచ్చింది ఆ కంపెనీ. కేరళ ఆటో మార్కెట్ సమాచారం ప్రకారం, ఆ రాష్ట్రంలో ఈ లగ్జరీ ఆఫ్-రోడ్ SUVని ఎంపిక చేసిన వినియోగదారులకు అందుబాటులో ఉంచారని తెలుస్తోంది. విశేషం ఏంటంటే, ఈ కారు అధికారికంగా మన దేశంలో ఇంకా లాంచ్‌ కాలేదు. అయినా కేరళ మార్కెట్‌లో ఎంపిక చేసిన వారికి ఇచ్చినట్టు సమాచారం.   

అయితే, ప్రాడో J250 మోడల్ కొన్ని ప్రపంచ మార్కెట్లలో 2023 ఆగస్టులోనే లాంచ్‌ అయింది. ఈ మోడల్‌ను నచ్చిన & మెచ్చిన కొందరు సంపన్నులు ఈ కార్లు ఇప్పటికే భారతదేశంలోకి దిగుమతి చేసుకుని రయ్‌ రయ్‌ మంటూ రోడ్లపై తిరుగుతున్నారు. 2025 ఫిబ్రవరిలో, పంజాబ్‌లో నాలుగు ప్రాడో SUVలు కనిపించాయి. ఈ మోడల్ ల్యాండ్ క్రూయిజర్ LC300 కంటే కొంచం రేంజ్‌ తక్కువ & CBU (కంప్లీట్ బిల్ట్ యూనిట్)గా భారతదేశానికి దిగుమతి అవుతోంది. ఇది ఒక హై-ఎండ్ ఆఫ్-రోడింగ్ SUV. అందుకే దీనిపై మోజును పెంచుకుంటున్నారు. 

ఫీచర్లు & ఇంజిన్ పవర్‌ ఎలా ఉంటుంది?టయోటా ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో J250 SUV డిజైన్ (Toyota Land Cruiser Prado J250 Design) బాక్సీగా, ఆఫ్-రోడ్ ఫోకస్డ్‌గా & ప్రాక్టికల్ గా ఉంటుంది. పాత J60 మోడల్ ప్రేరణతో J250 ని డిజైన్‌ చేశారు. ప్రాడో J250ని GA-F ప్లాట్‌ఫామ్‌పై నిర్మించారు, దీంతో ఫ్రేమ్ దృఢత్వం 50% మెరుగుపడింది. ఈ SUV 2.8 లీటర్ డీజిల్ ఇంజిన్‌తో (1GD-FTV) పవర్‌ తీసుకుంటుంది. ఈ ఇంజిన్ దాదాపు 201 Bhp పవర్ & 500 Nm టార్క్‌ను జనరేట్‌ చేస్తుంది. ఇంకా.. 48V మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ & 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఎలాంటి రోడ్లపై అయినా ఈజీగా, బలంగా పరుగులు పెడుతుంది. ఈ SUV అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోల్ హైబ్రిడ్ & మైల్డ్ హైబ్రిడ్ డీజిల్ ఆప్షన్లలోనూ అందుబాటులో ఉంది.       

భారతదేశంలో ఎప్పుడు లాంచ్‌ అవుతుంది?కేరళలో ఈ SUV కనిపించిందంటే, కొన్ని ప్రాడో J250 యూనిట్లను ఇప్పటికే భారతదేశంలోకి దిగుమతి చేసుకున్నారని అర్ధం చేసుకోవాలి. ఈ మోడల్ 2025 చివరి నాటికి భారతదేశంలో అధికారికంగా లాంచ్‌ అవుతుంది. దీని ఎక్స్‌-షోరూమ్‌ ధర (Toyota Land Cruiser Prado J250 ex-showroom price) రూ. 1.25 కోట్ల నుంచి రూ. 1.50 కోట్ల వరకు ఉంటుందని అంచనా.                   

భారతదేశంలో టయోటా ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో J250 ప్రవేశం, ముఖ్యంగా కేరళలో దాని ప్రదర్శన, దేశంలో హై-ఎండ్ ఆఫ్-రోడింగ్ SUVల పట్ల క్రేజ్ మళ్లీ పెరుగుతోందని సూచిస్తుంది. ఈ SUV బోల్డ్‌ డిజైన్ & బలమైన నిర్మాణం విషయంలో మాత్రమే కాదు, కారులో ఇచ్చిన మైల్డ్‌ హైబ్రిడ్ టెక్నాలజీ వల్ల కూడా ప్రత్యేకంగా నిలుస్తుంది.