16 billion passwords exposed : ప్రపంచంలోనే అతి పెద్ద డేటా బ్రీచ్ వెలుగులోకి వచ్చింది. పదహారు బిలియన్ల పాస్ వర్డ్స్ లీక్ అయ్యాయని తేలింది. ఇన్ఫోస్టీలర్ మాల్వేర్ ద్వారా సేకరించిన 16 బిలియన్ లాగిన్ క్రెడెన్షియల్స్ బహిర్గతమైనట్లుగా గుర్తించారు. ఈ లీక్‌ను "చరిత్రలో అతిపెద్ద డేటా ఉల్లంఘనలలో ఒకటి"గా చెబుతున్నారు. ఇది సోషల్ మీడియా, కార్పొరేట్ ప్లాట్‌ఫారమ్‌లు, VPNలు, డెవలపర్ పోర్టల్‌లు, ప్రభుత్వ సేవలతో సహా అనేక ఆన్‌లైన్ సేవల క్రెడిన్షయల్స్ కూడా లీకయినట్లుగా తెలుస్తోంది.. సైబర్‌న్యూస్ రీసెర్చర్స్ 2025 ప్రారంభం నుండి 30 విభిన్న డేటాసెట్‌లను కనుగొన్నారు, ఒక్కొక్కటి టెన్స్ ఆఫ్ మిలియన్స్ నుండి 3.5 బిలియన్ రికార్డుల వరకు కలిగి ఉన్నాయి. డేటా URLలు, లాగిన్ వివరాలు, పాస్‌వర్డ్‌లు ఇందులో ఉన్నాయి. ఇవి ఇన్ఫోస్టీలర్ మాల్వేర్ ద్వారా సేకరించినట్లుగా భావిస్తున్నారు. ఈ డేటా ఆపిల్, గూగుల్, ఫేస్‌బుక్, టెలిగ్రామ్, గిట్‌హబ్, VPN సేవలు, ప్రభుత్వ పోర్టల్‌లతో సహా దాదాపు అన్ని ఆన్‌లైన్ సేవలకు సంబంధింంచినవి ఉన్నాయి. సేఫ్టీగా ఉన్నవి ఏవీ లేవు.
ఇన్ఫోస్టీలర్ మాల్వేర్ బ్రౌజర్‌లు, ఇమెయిల్ క్లయింట్‌లు, మెసేజింగ్ యాప్‌లు, క్రిప్టో వాలెట్‌ల నుండి సున్నితమైన సమాచారాన్ని రహస్యంగా సేకరిస్తుంది. ఈ డేటా స్ట్రక్చర్డ్ రూపంలో(URL, యూజర్‌నేమ్, పాస్‌వర్డ్) ఉంటుంది. ఇది ఆధునిక ఇన్ఫోస్టీలర్‌ల లక్షణం. ఈ డేటా గతంలో చోరీ చేసిన డేటా నుండి రీసైకిల్ చేసింది కాదు. కొత్తగా సేకరించిన, తక్షణం ఉపయోగించగల సమాచారం, ఇది సైబర్‌క్రిమినల్స్‌కు చేరితే అత్యంత ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు.
ఈ డేటాసెట్‌లు ఇంటర్నెట్‌లో కొంత సమయం వరకు బహిర్గతమయ్యాయి, కానీ త్వరగా లాక్ అయ్యాయి. ఈ డేటాను ఎవరు నియంత్రిస్తున్నారో గుర్తించడం సాధ్యం కాలేదనితెలుస్తోంది. డేటా సైబర్‌క్రిమినల్స్ లేదా సెక్యూరిటీ పరిశోధకులు సేకరిచి ఉండవచ్చని.. కానీ దాని బహిర్గతం అనుకోకుండా జరిగినట్లు కనిపిస్తుందిని నిపుణులు చెబుతున్నారు.
ఈ లీక్ "కేవలం లీక్ కాదు, సామూహిక దోపిడీకి ఒక బ్లూప్రింట్"గా అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే ఇవి సైబర్‌క్రిమినల్స్‌కు చేరితేే ఫిషింగ్, ఖాతా టేకోవర్‌లు, ఐడెంటిటీ థెఫ్ట్, రాన్సమ్‌వేర్ దాడులకు అవకాశం కలుగుతుంందది. 5.5 బిలియన్ మంది ఇంటర్నెట్ యూజర్లు ఉన్న నేటి ప్రపంచంలో, 16 బిలియన్ రికార్డులు అంటే సగటున ప్రతి వ్యక్తికి రెండు ఖాతాల పాస్ వర్డ్‌లు బహిర్గతమయ్యాయని అనుకోవచ్చు. ఈ డేటాను డార్క్ వెబ్‌లో విక్రయిస్తారు.
2024లో 26 బిలియన్ రికార్డులతో "మదర్ ఆఫ్ ఆల్ బ్రీచెస్" (MOAB), 2024లో రాక్‌యూ2024 లీక్ (9 బిలియన్ రికార్డులు) ఘటనలు జరిగాయి. కానీ ఈ 16 బిలియన్ రికార్డుల లీక్ వాటన్నింటికంటే పెద్దది.ఇప్పుడు ఉన్న పళంగా అన్ని ముఖ్యమైన ఖాతాలు.. ఇమెయిల్, బ్యాంకింగ్, సోషల్ మీడియా పాస్‌వర్డ్‌లను వెంటనే మారుకోవాలని నిపుణులు సలహాలు ఇస్తున్నారు.