Toyota Fortuner Neo Drive Mild Hybrid Review: భారత మార్కెట్‌లో టయోటా ఫోర్ట్యూనర్‌కి ఉన్న ఫ్యాన్‌ బేస్‌ ప్రత్యేకం. Ford Endeavor తర్వాత ఈ సిగ్మెంట్‌లో దాదాపు సింగిల్‌ ఛాయిస్‌గా మిగిలిపోయిన SUV ఇది. ఇప్పుడు, టయోటా నిశ్శబ్దంగా ఒక కొత్త వెర్షన్‌ను తీసుకొచ్చింది, అది - ఫార్చ్యూనర్‌ నియో డ్రైవ్‌ మైల్డ్‌ హైబ్రిడ్‌.

Continues below advertisement


కొత్త టచ్‌ - మైల్డ్‌ హైబ్రిడ్‌ టెక్నాలజీ


ఇది పూర్తి హైబ్రిడ్‌ కాదు, కానీ 48V సిస్టమ్‌తో వచ్చిన మైల్డ్‌ హైబ్రిడ్‌. ఫ్యూయల్‌ ఎఫిషెన్సీ పెరగడం, డ్రైవింగ్‌ నిశ్శబ్దంగా ఉండడం ఈ టెక్నాలజీ హైలైట్స్‌. 2.8 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌ ఇంతకుముందు ఉన్నట్లే పవర్‌ఫుల్‌గా ఉంది కానీ ఇగ్నిషన్‌ సమయంలో మరింత రిఫైన్‌డ్‌గా అనిపిస్తుంది. రోడ్డు పైకి వెళ్ళాక సంప్రదాయ డీజిల్‌ సౌండ్‌ తిరిగి వినిపిస్తుంది కానీ మొత్తంగా చూస్తే డ్రైవ్‌ స్మూత్‌గానే అనిపిస్తుంది.


పెర్ఫార్మెన్స్‌ & మైలేజ్‌


డ్రైవింగ్‌ అనుభవంలో పెద్దగా మార్పు లేకపోయినా, పెర్ఫార్మెన్స్‌ ఓ చిన్న మోతాదులో మెరుగైందని చెప్పవచ్చు. అసలు తేడా మైలేజ్‌లో కనిపిస్తుంది. టెస్ట్‌ డ్రైవింగ్‌ సమంయలో మాకు వచ్చిన సగటు మైలేజీ లీటరుకు 12 km, ఇది పాత వెర్షన్‌ కంటే కాస్త మెరుగ్గా ఉంది. ఇప్పుడు, ఫుల్‌ ట్యాంక్‌తో అదనంగా 40-50 కి.మీ. రేంజ్‌ రాబట్టవచ్చు. అంటే హైవే ట్రిప్స్‌లో కొంచెం ఎక్స్‌ట్రా మైలేజ్‌ ఇస్తుంది.


కొత్త ఫీచర్లు & మిస్‌ అయిన ఫీచర్లు


టఫ్‌ బాడీ, 225mm గ్రౌండ్‌ క్లియరెన్స్‌, వాటర్‌ వాడింగ్‌ కెపాసిటీ - ఇవన్నీ పాత వెర్షన్‌లో నుంచి అలాగే వచ్చాయి. అయితే, ఈ వెర్షన్‌లో కొత్తగా 360-డిగ్రీ కెమెరా చేర్చారు. ఇది చాలామందికి చాలా అవసరమైన ఫీచర్‌. కానీ కెమెరా క్వాలిటీ ఇంకా బెటర్‌ అవ్వాల్సి ఉంది. మరోవైపు, మల్టీ-టెరైన్‌ సెలెక్ట్‌ (MTS) సిస్టమ్‌ ఇచ్చారు, దీనితో రకరకాల రోడ్లపై SUVని సులభంగా నడిపించవచ్చు.


ఫార్చ్యూనర్‌ నియో డ్రైవ్‌ మైల్డ్‌ హైబ్రిడ్‌ డ్రైవింగ్‌ చేసేటప్పుడు ప్లస్‌లే కాదు, కొన్ని మైనస్‌లు కూడా కనిపించాయి. వెంటిలేటెడ్‌ సీట్స్‌ ఈ వెర్షన్‌లో లేవు. అలాగే, హైబ్రిడ్‌ ప్యాకేజింగ్‌ కారణంగా మూడో వరుస సీటింగ్‌ స్పేస్‌ కొంచెం తగ్గిపోయింది. కానీ మిగతా ఫీచర్లు మాత్రం ప్రీమియం టచ్‌ ఇస్తాయి. పవర్డ్‌ టెయిల్‌గేట్‌, డ్యూయల్‌ జోన్‌ క్లైమేట్‌ కంట్రోల్‌, వైర్‌లెస్‌ ఛార్జింగ్‌, 7 ఎయిర్‌బ్యాగ్స్‌ వంటివి అందుబాటులో ఉన్నాయి.


కొనవచ్చా, లేదా?


కొత్త వెర్షన్‌ ధర పెరిగినప్పటికీ, ఫార్చ్యూనర్‌ ఎప్పటికీ రగ్డ్‌ & రిలయబుల్‌ SUV గానే నిలుస్తుంది. కొత్త నియో డ్రైవ్‌ వెర్షన్‌ స్మూత్‌ డ్రైవ్‌, మెరుగైన మైలేజ్‌, కొత్త ఫీచర్లతో మరింత ఆకర్షణీయంగా ఉంది. కొంత స్పేస్‌ తగ్గిపోవడం, వెంటిలేటెడ్‌ సీట్స్‌ లేకపోవడం మైనస్‌ అయినా, ఫ్యామిలీ SUVగా & ప్రీమియం టఫ్‌ వెహికల్‌గా ఇది ఇంకా బెస్ట్‌ ఆప్షన్‌గానే ఉంది.