2023 తొలి నాలుగు నెలల్లో దేశంలో కొత్త తరం హ్యుందాయ్ వెర్నా, మారుతి సుజుకి ఫ్రాంక్స్, హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ లాంటి కార్లు లాంచ్ అయ్యాయి. మరికొద్ది రోజుల్లోనే టాప్ బ్రాండ్లకు చెందిన లేటెస్ట మోడల్ కార్లు లాంచ్ అయ్యేందుకు రెడీ అవుతున్నాయి. దేశీయ మార్కెట్లోకి రాబోతున్నా పెద్ద బ్రాండ్ల కార్లు ఏవో ఇప్పుడు చూద్దాం..


1. మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్


కార్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోడళ్లలో ఒకటి మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్. ఈ కారు  ఈ నెలలో(మే 2023లో) విడుదల కానుంది. ఈ SUV ప్రొడక్షన్ ఏప్రిల్ నుంచే మొదలయ్యింది. త్వరలో ఈ కారు ధరను కంపెనీ ఫైనల్ చేయనుంది. ఈ వాహనం 1.5 లీటర్ K15B పెట్రోల్ ఇంజన్‌తో రానుంది. 105 bhp, 134 Nm గరిష్ట టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్,  4-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.  జిమ్నీ రెండు ట్రిమ్‌లలో అందించబడుతుంది. అంటే జీటా,  ఆల్ఫా ధరలతో రానుంది. ఈ కారు ధర దాదాపు రూ. 12 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుందని అంచనా.


2. మారుతి సుజుకి ఇన్నోవా హైక్రాస్ బేస్డ్ ప్రీమియం MPV


ఈ కారు జులై 2023లో లాంచ్ కాబోతోంది.  పవర్‌ట్రెయిన్ నుంచి ఫీచర్ల వరకు ప్రతిదీ ఇన్నోవా హైక్రాస్ నుండి నేరుగా లిఫ్ట్-ఆఫ్ అవుతుంది. సుజుకి లోగో మినహా ఇంటీరియర్‌ ఒకే విధంగా ఉంటాయి. అయితే ఎక్టీరియర్ డిజైన్‌లో చిన్న మార్పులు ఉండవచ్చు. భారతీయ  ప్రీమియం MPVలో అత్యంత ఖరీదైన వాహనంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.


3. టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్


ప్రస్తుతం భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ SUV టాటా నెక్సాన్. ఈ కారు త్వరలో ఫేస్‌ లిఫ్ట్‌ ను పొందనుంది. అప్ గ్రేడ్ చేయబడిన ఈ మోడల్ ఇప్పటికే అనేకసార్లు పరీక్షలు జరుపుకుంది. పాత మోడల్ తో పోల్చితే డిజైన్ మార్పులను కొంతవరకు గుర్తించవచ్చు. క్యాబిన్ లోపల, 2 స్పోక్ స్టీరింగ్ వీల్, సరికొత్త పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, కనెక్ట్ చేయబడిన కార్ టెక్ సహా పలు మార్పులు ఉండబోతున్నాయి. ఈ ఫేస్‌లిఫ్టెడ్ మోడల్ కొత్త 1.2-లీటర్ tGDi పెట్రోల్ ఇంజన్ 125 bhp,  225 Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ యూనిట్‌తో పాటు DCT గేర్‌బాక్స్‌ తో జతచేయబడుతుంది.


4. హ్యుందాయ్ ఎక్స్‌టర్


టాటా పంచ్‌ను లక్ష్యంగా చేసుకుని హ్యుందాయ్ ఎక్స్‌ టర్ ను తీసుకొస్తుంది. పలు నివేదికల ప్రకారం ఈ మైక్రో-SUV ఆగస్ట్ 2023లో లాంచ్ కానుంది. హ్యుందాయ్ SUV లైనప్  దిగువన దీనిని రూపొందించారు. ఇది 1.2 లీటర్ కప్పా పెట్రోల్ ఇంజన్‌తో పాటు ఫరర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ 1.0-లీటర్ tGDi పెట్రోల్ యూనిట్‌తో అందించబడుతుంది. CNG ఇంధన ఎంపికలో కూడా వస్తున్నట్లు తెలుస్తోంది.


5. టాటా ఆల్ట్రోజ్,  పంచ్ CNG


టాటా మోటార్స్ త్వరలో CNGతో నడిచే పంచ్, ఆల్ట్రోజ్‌ ను భారత మార్కెట్లో విడుదల చేయనుంది. 2023 ఆటో ఎక్స్‌ పోలో ఈ కార్లు ప్రదర్శించనున్నారు. కొన్ని వారాల్లో Altroz CNG లాంచ్ కానుంది. ఆ తర్వాత 2-3 నెలల్లో  పంచ్ CNGతో రానుంది.  టాటా మోటార్స్ నుంచి వచ్చే ఈ తాజా CNG మోడల్‌లు డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీని (ఒక్కొక్కటి 30 లీటర్లు) కలిగి ఉంటాయి. ఇది సాంప్రదాయ వ్యవస్థలతో పోలిస్తే మంచి బూట్‌ స్పేస్ ను కలిగి ఉంటుంది. CNG హ్యాచ్ నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.  XE, XM+, XZ, XZ+S వేరియెంట్లలో వినియోగదారుల ముందుకురానుంది. ఈ కార్లు 83 bhp, 110 Nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేయనున్నాయి. 1.2 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ నుండి శక్తిని పొందుతాయి.


Read Also: మారుతి నుంచి మరో కాంపాక్ట్ SUV విడుదల, ధర, ఫీచర్లు ఇవే !