Sajjala Comments  :   స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో  టీడీపీ అధినేత , ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎప్పుడైనా అరెస్ట్ కావొచ్చని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ పై హైకోర్టు ఇచ్చిన స్టేను సుప్రీంకోర్టు కొట్టి వేసిన అంశంపై ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.  సిట్  పై  న్యాయస్థానం   ఏ  దృష్టిలో  చూడాలో  అదే  దృష్టి లో   చూసిందన్నారు.  రాజకీయ  పార్టీ  ల నిర్ణయాలు...ప్రభుత్వ  నిర్ణయాలు...పై  సమీక్ష  చెయ్యచ్చా  లేదా  అనేది  ఎప్పుడు  చర్చనీయాంశమేనన్నారు.  ప్రభుత్వ  నిర్ణయం  ప్రజలకి  నష్టం  కలిగించినప్పుడు  ఖచ్చితంగా  సమీక్ష జరగాలని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. 


ప్రజలకు నష్టం కలిగినందుకే సిట్ వేశామన్న సజ్జల 


అయితే సమీక్ష కక్ష పూరితంగా  చేస్తే  మాత్రం  తప్పు అవుతుందన్నారు.  మా  ప్రభుత్వం  సబ్  కమిటీ  ఏర్పాటు   చేసి  అసెంబ్లీ లో  చర్చించాక  సిట్  ఏర్పాటు జరిగిందన్నారు.  లోతుగా  చూడాలనే  ఉద్దేశంతో  సిట్ ఏర్పాటు జరిగిందని తెలిపారు.  టీడీపీ  సిట్ పై  ఛాలెంజ్  చెయ్యడం  దుస్సాహసమని..  భారీ  స్థాయిలో  జరిగే  విచారణలో  టీడీపీ  కి భయం  ఎందుకని ఆయన ప్రశ్నించారు.  ఆ రోజు  స్టే  తెచ్చుకున్న  కూడా  ఈ రోజు  సుప్రీంకోర్టు ఎత్తి వేసిందన్నారు.   రాష్ట్ర  సంపద కు  నష్టం  కలిగించే కుట్రలను జగన్ ప్రభత్వం భగ్నం చేసిందన్నారు.  ఇప్పుడు   విచారణ  ఇంకా  సులభతరం  అవుతుందని సజ్జల చెప్పుకొచ్చారు. 


అమరావతిలో భూ స్కామ్ బయట  పెడతాం : సజ్జల 


అమరావతి  భూ స్కామ్  లో నిజాలను బయట పెట్టడానికి ఇప్పుడు  ఇంకా  మార్గం  సులువు  అవుతుందన్నారు.  ఫైబర్ నెట్...స్కిల్ దవలప్మెంట్  అన్నింటి లో  విచారణ  జరుగుతోందని అన్ని బయటకు వస్తాయని సజ్జల స్పష్టం చేశారు.  అమరావతి లో వేల ఎకరాల  భూమి... తరతరాల  సంపద కోసం  రియల్  ఎస్టేట్  స్కామ్  గా మార్చారని ఆరోపించారు.  స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో చంద్రబాబు ఎప్పుడైనా అరెస్ట్ అవ్వచ్చునని జోస్యం చెప్పారు.  అమరావతి లో  ఎక్కడ  టచ్  చేసిన  అవినీతీ....ఇది ఒక  కేస్  స్టడీ అన్నారు.  అరెస్ట్  చేస్తే  వేధింపులు.. చెయ్యకపోతే  ధైర్యం  లేదు  అంటారని మండిపడ్డారు.  ఇది కక్ష  సాధింపు  కాదు....దర్యాప్తు  లో  అన్ని  తెలుస్తాయన్నారు. 


సిట్ పై స్టే కొట్టి వేస్తూ సుప్రీం ఏం చెప్పిందంటే ?


ఏపీ ప్రభుత్వ ‘సిట్‌’పై  స్టే విధిస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ కేసును మరోసారి మెరిట్ ప్రాతిపదికన విచారించి తుది నిర్ణయాన్ని వెలువరించాలని హైకోర్టుకు సుప్రీం సూచించింది. హైకోర్టు ఈ కేసు అపరిపక్వ స్థాయిలో జోక్యం చేసుకొని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని సుప్రీంకోర్టు పేర్కొంది. అందువల్లనే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను త్రోసిపుచ్చుతున్నామని వెల్లడించింది. సుప్రీంకోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయాలతో సంబంధం లేకుండా మెరిట్స్ ప్రాతిప్రదికన ఈ కేసును విచారించి తుది నిర్ణయం వెలువరించాలని హైకోర్టుకు సూచించింది.