Best Mileage Hybrid Cars In India In 2025: పెరిగిన పెట్రోల్ ధరలు, మారుతున్న వాతావరణ పరిస్థితులు… ఇవన్నీ కారు కొనుగోలుదారుడిని హైబ్రిడ్ వాహనాల వైపు దృష్టి మళ్లేలా చేస్తున్నాయి. మైలేజ్‌తో పాటు ఆధునిక టెక్నాలజీని కోరుకునే మధ్య తరగతి ప్రజల కోసం, ఇప్పుడు, భారత మార్కెట్లో చాలా చౌక హైబ్రిడ్ కార్లు అందుబాటులో ఉన్నాయి. 2025లో అందుబాటులో ఉన్న చౌకగా లభించే టాప్‌ 5 హైబ్రిడ్ కార్లు ఇవే.       

1. మారుతి గ్రాండ్ విటారా (Maruti Grand Vitara Strong Hybrid)ఈ SUV తరహా హైబ్రిడ్ కారులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటర్ ఉంటుంది. ఇది 27.97 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. మైల్డ్‌ కాకుండా స్ట్రాంగ్‌ హైబ్రిడ్ టెక్నాలజీ ఉన్న ఈ వాహనం ధర, తెలుగు రాష్ట్రాల్లో, రూ. 12.40 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌) నుంచి ప్రారంభం అవుతుంది.        

2. టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ (Toyota Hyryder Hybrid)మారుతి గ్రాండ్ విటారాతో పోలిక కలిగిన ఈ కారులోనూ గ్రాండ్‌ విటారా ప్లాట్‌ఫామ్‌, అదే టెక్నాలజీ ఉంటుంది. మైలేజ్ లీటరుకు 27.97 km. ఆంధ్రప్రదేశ్‌ &తెలంగాణ నగరాల్లో ఈ కారు ధర (ఎక్స్‌-షోరూమ్‌) రూ. 11.14 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. టయోటా సర్వీస్ నెట్‌వర్క్‌, బ్రాండ్ విలువతో పాటు దీని మైలేజ్‌ను ప్రత్యేకంగా చెప్పుకోవాలి.             

3. హోండా సిటీ e:HEV (Honda City Hybrid)హోండా సిటీ హైబ్రిడ్ మోడల్‌లో 1.5 లీటర్ ఆటోమేటిక్‌ హైబ్రిడ్ పవర్‌ట్రైన్‌ ఉంటుంది. ఇది సుమారు 27.13 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. హైదరాబాద్‌ & విజయవాడలో ఈ కారు రేటు (ఎక్స్‌-షోరూమ్‌) రూ. 18.89 లక్షల వరకు ఉంది. అయితే, దీనికి సంబంధించిన కొత్త వేరియంట్‌లు సరికొత్త ఫీచర్లతో వస్తున్నాయి.        

4. మారుతి ఇన్విక్టో (Maruti Invicto Hybrid)ఈ MPV తరహా కారులోనూ స్ట్రాంగ్‌ హైబ్రిడ్ టెక్నాలజీ ఉంది. మైలేజ్ 23.24 కిలోమీటర్ల వరకు ఇస్తుంది. తెలుగు రాష్ట్రాల నగరాల్లో, ఈ ఫోర్‌వీలర్‌ ధర (ఎక్స్‌-షోరూమ్‌) రూ. 25.21 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఇది టయోటా ఇనోవా హైక్రాస్‌ ప్లాట్‌ఫామ్‌పై తయారైంది. పెద్ద ఫ్యామిలీ కోసం ఇది మంచి ఎంపిక.

5. టయోటా ఇనోవా హైక్రాస్ (Toyota Innova Hycross Hybrid)ఇది ఒక శక్తిమంతమైన హైబ్రిడ్ MPV. ఇది 23.24 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ &తెలంగాణలో, దీని ధర (ఎక్స్‌-షోరూమ్‌) రూ. 25 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఫ్యామిలీ ట్రావెల్‌, లాంగ్‌ జర్నీలకు హైబ్రిడ్‌ కార్లలో ఇది బెస్ట్ ఆప్షన్.

మధ్యతరగతి ప్రజల కోసం హైబ్రిడ్ బెస్ట్‌ఈ కార్లు పెట్రోల్‌ వాహనాల కన్నా ఎక్కువ మైలేజ్ ఇస్తున్నాయి. ముఖ్యంగా టోకెన్స్, గ్రీన్ ట్యాగ్‌లు, రిజిస్ట్రేషన్‌పై రాయితీలు కూడా లభించవచ్చు. మైలేజ్ + టెక్నాలజీ కోరేవారికి ఈ టాప్‌ 5 హైబ్రిడ్ కార్లు ఖచ్చితంగా సరైన ఎంపికలు అవుతాయి. పై లిస్ట్‌ నుంచి మీ బడ్జెట్‌కు సరిపోయే కారును ఎంచుకోండి!.