New Tata Nexon Facelift Launch Date, Price And Features: టాటా మోటార్స్, జనం మెచ్చిన తన పాపులర్‌ నెక్సాన్‌ను కొత్త అవతారంలో (ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌) విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది, దీనికి గరుడ్ (Garud) అనే కోడ్‌నేమ్ ఇచ్చింది. కొత్త టాటా నెక్సాన్‌ను 2027లో లాంచ్‌ చేయవచ్చు. ఈ కారు, ఇప్పటికే ఉన్న X1 ప్లాట్‌ఫామ్‌కు అప్‌డేటెడ్‌ వెర్షన్‌పై ఆధారపడి తయారవుతుంది. కొత్త కారు డిజైన్ & ఇంటీరియర్‌లో కీలక అప్‌డేట్స్‌ ఉంటాయని భావిస్తున్నారు.

ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న టాటా నెక్సాన్‌తో పోలిస్తే, కొత్త మోడల్‌ మోడరన్‌ డిజైన్ & అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ కలబోతగా వస్తుంది. ప్రస్తుతం, తెలుగు రాష్ట్రాల్లో, టాటా నెక్సాన్‌ను కేవలం రూ. 8 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరకు (Tata Nexon ex-showroom price, Hyderabad) కొనుగోలు చేయవచ్చు. కొత్త వెర్షన్‌ రేటు ఇంకొంచం ఎక్కువగా ఉన్నప్పటికీ, కామన్‌ మ్యాన్‌ బడ్జెట్‌ మాత్రం దాటదని మార్కెట్ ఎక్స్‌పర్ట్స్‌ భావిస్తున్నారు.

టాటా నెక్సాన్‌ కొత్త డిజైన్ & అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లుకొత్త టాటా నెక్సాన్ డిజైన్, టాటా కర్వ్ కాన్సెప్ట్ నుంచి ప్రేరణతో రూపొందుతుంది. ఈ కారు ఫుల్లీ LED లైట్ బార్, సొగసైన LED హెడ్‌ల్యాంప్‌లు & సీక్వెన్షియల్ LED DRLs ను కలిగి ఉంటుంది. ఇంకా... ఇంటీరియర్‌లో కూడా చాలా గణనీయమైన మార్పులను చూసే అవకాశం ఉంది. ఈ కారులో 6 ఎయిర్‌ బ్యాగ్‌లు సహా, ప్రయాణీకుల భద్రత కోసం అడ్వాన్స్‌డ్‌ సేఫ్టీ ఫీచర్లను అందిస్తారు. 

10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో/ఆపిల్ కార్‌ప్లే & 10.25-అంగుళాల డ్రైవర్ డిస్‌ప్లే వంటి లేటెస్ట్‌ టెక్నాలజీలు కొత్త టాటా నెక్సాన్‌లో ఉంటాయి. ఈ కారులో వాయిస్ అసిస్టెడ్ సన్‌రూఫ్, JBL ఆడియో సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు కూడా ఏర్పాటు చేస్తారు. ఇంకా... 360 డిగ్రీల కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటర్ & ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు కూడా టాటా నెక్సాన్‌ ఫేస్‌లిఫ్ట్‌లో ఉన్నాయి. 

టాటా నెక్సాన్‌ ప్రస్తుత వెర్షన్‌కు 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ప్రస్తుతం ఉన్న టాటా నెక్సాన్‌, ఇప్పటికే, గ్లోబల్‌ ఎన్‌క్యాప్‌ (GNCAP) & భారత్‌ ఎన్‌క్యాప్‌ (BNCAP) క్రాష్‌ టెస్టుల్లో 5-స్టార్ రేటింగ్‌ సాధించింది, అంటే, చిన్న పిల్లలు సహా ఫ్యామిలీతో కలిపి ప్రయాణించడానికి సురక్షితమైనది. 6 ఎయిర్‌ బ్యాగులు, ABS, ESP వంటి ఫీచర్లు నెక్సాన్‌లో అందుబాటులో ఉన్నాయి, భద్రత పరంగా ఇది బలమైన కారు. 

భారత మార్కెట్లో, Maruti Suzuki Brezza, Hyundai Venue & Mahindra XUV 3XO వంటి SUVలతో టాటా నెక్సాన్‌ పోటీ పడుతుంది.

బెటర్‌ మైలేజీప్రస్తుత టాటా నెక్సాన్ పెట్రోల్ మోడల్ లీటరుకు 17 km నుంచి 17.44 km & డీజిల్ మోడల్‌ లీటరుకు 23.23 km నుంచి 24.08 km & CNG వేరియంట్ కిలోగ్రాముకు 17.44 km మైలేజీని ఇస్తుందని కంపెనీ వెల్లడించింది. ఇంజిన్ ట్యూనింగ్ & బరువు తగ్గడం కారణంగా కొత్త టాటా నెక్సాన్‌ ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ మైలేజ్ మెరుగుపడుతుందని ఎక్స్‌పర్ట్స్‌ భావిస్తున్నారు.