భారత్ లో ఈ ఏడాది ఎండలు మరిండ మండనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ ప్రకటనకు అనుగుణంగానే ఏప్రిల్ నెలలోనే ఎండలు పెరిగిపోయాయి. ఉదయం 11 దాటక ముందే సూర్యుడు సెగలు కక్కుతున్నాడు. సాయంత్రం 5 గంటల వరకు ఎండ తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో ప్రయాణాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. కొంత మంది మాత్రం ప్రయాణ సమయంలో వేడిని అధిగమించడం కోసం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. కారులో సాధారణ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్‌తో పాటు, వేడి వాతావరణ పరిస్థితులలో ఉపశమనం కలిగించే వెంటిలేటెడ్ సీట్లు ఒక ప్రముఖ ఫీచర్.  వేడి వాతావరణ పరిస్థితులలో వెంటిలేటెడ్ సీట్లు చాలా ఉపశమనాన్ని అందిస్తాయి. ఈ నేపథ్యంలో వెంటిలేటెడ్ సీట్లతో కూడిన టాప్ 5 అత్యంత సరసమైన కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..


టాటా నెక్సాన్ XZ+ LUX పెట్రోల్


Tata Nexon XZ+ LUXPetrol వేరియంట్ వెంటిలేటెడ్ సీట్లు కలిగిన అత్యంత సరసమైన కారు.  దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 11.60 లక్షలు. టాటా మోటార్స్ నుంచివచ్చిన నెక్సాన్ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన SUVలలో ఒకటి. XZ+ LUX వేరియంట్ ఈ వేసవిలో వేడిని తట్టుకోవాలనుకునే వారి కోసం వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లతో వస్తుంది.


కియా సోనెట్ HTX ప్లస్ టర్బో iMT


కియా సోనెట్ అనేది ప్రముఖ కాంపాక్ట్ SUV. ఇది HTX ప్లస్ టర్బో iMT వేరియంట్‌లో వెంటిలేటెడ్ సీట్లను అందిస్తుంది. దీని ధర రూ. 12.75 లక్షలు (ఎక్స్-షోరూమ్).  మార్కెట్లో అత్యుత్తమంగా కనిపించే సబ్-4M SUVలలో ఇది ఒకటి. కియా ఈ కారును వెంటిలేటెడ్ సీట్లతో పాటు పలు చక్కటి ఫీచర్లను పొందుపర్చింది.


మారుతీ సుజుకి XL6 ఆల్ఫా ప్లస్


మారుతి సుజుకి XL6 కూడా  వెంటిలేటెడ్ సీట్లను కలిగి ఉంది. ఆల్ఫా ప్లస్ వేరియంట్ ధర రూ. 13.05 లక్షలు (ఎక్స్-షోరూమ్). మారుతి సుజుకి భారతదేశంలోని నెక్సా ఔట్‌లెట్ల ద్వారా XL6ని ప్రీమియం MPVగా విక్రయిస్తుంది. మారుతి సుజుకి ఈ ఫీచర్‌ను కలిగి ఉన్న ఏకైక కారు కూడా ఇదే.


హ్యుందాయ్ వెర్నా SX(O) పెట్రోల్


ఈ ఏడాది ప్రారంభంలో హ్యుందాయ్ న్యూ జెనరేషన్ వెర్నాను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కారు సరికొత్త ఇంటీరియర్, ఎక్ట్సీరియర్ డిజైన్ ను పొందింది. కారు ఫీచర్ల జాబితాను కూడా అప్ డేట్ చేసింది. SX(O) వేరియంట్ ఇప్పుడు వెంటిలేటెడ్ సీట్లతో వస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 14.66 లక్షలు.


స్కోడా స్లావియా స్టైల్


స్కోడా స్లావియా అనేది ప్రముఖ సెడాన్. ఇది స్టైల్ ట్రిమ్ నుంచి వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లను అందిస్తుంది. దీని ధర రూ. 14.80 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ కారు 1.0L TSI, 1.5L TSI అనే రెండు ఇంజన్ ఆప్షన్‌లతో లభిస్తుంది. స్లావియాలో ప్రీమియం ఇంటీరియర్,  అధునాతన ఫీచర్లు ఉన్నాయి. 


Read Also: మారుతి సుజుకి జిమ్నీ TO హ్యుందాయ్ క్రెటా, భారత్ లో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ SUVలు ఇవే!