భారత్ లో కార్ల వినియోగం రోజు రోజుకు పెరిగిపోతోంది. అందులోనూ ఎక్కువ మంది SUVలను బాగా ఇష్టపడుతున్నారు. పెరుగుతున్న డిమాండ్ కు అనుగుణంగా వాహన తయారీ సంస్థలు సరికొత మోడళ్లను పరియం చేస్తున్నాయి. ఇప్పటికే ఉన్న వాటిని అప్‌ గ్రేడ్ చేస్తున్నాయి. దేశీయ మార్కెట్లో గేమ్‌ను ఛేంజర్ గా మారిన టాప్ 5 SUVల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నంచేద్దాం..


1.మారుతి సుజుకి జిమ్నీ


మారుతి సుజుకి సంస్థకు చెందిన  జిమ్నీ కారు  ఔత్సాహికులలో మంచి క్రేజ్ తీసుకొచ్చింది. ముందు నుంచే ఈ వాహనంపై బాగా ప్రచారం జరిగింది. అనుకున్నట్లుగానే భారత మార్కెట్‌ లో ఈ కారు అమ్మకాల సునామీ సృష్టించింది. 5-డోర్ల జిమ్నీ ఇప్పటికే 22 వేలకు పైగా బుకింగ్స్ సంపాదించింది. వినియోగదారులలో ఈ కారుపట్ల ఉన్న మోజుకు ఇదో నిదర్శనంగా చెప్పుకోవచ్చు. జిమ్నీ ఇండియన్ ఆటో ఎక్స్‌ పో 2023లో గ్లోబల్‌ గా అరంగేట్రం చేసింది. మేలో ఇండియన్ మార్కెట్లో లాంచ్ కానుంది. జిమ్నీ ధర రూ. 9.99 లక్షల నుంచి రూ. 15 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా.


2.మహీంద్రా థార్


మహీంద్రా థార్  భారతీయ కార్ల ఔత్సాహికులకు ఎంతో ఇష్టమైనదిగా చెప్పుకోవచ్చు. మహీంద్రా లేటెస్ట్ SUVలో ఆశించే అన్ని సౌకర్యాలతో కొత్త థార్‌ను తీసుకొచ్చింది. థార్ ధర రూ. 9.99 లక్షల నుంచి 16.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఇది SUV సెగ్మెంట్‌లో సరసమైన ఎంపికగా చెప్పుకోవచ్చు.


3.మహీంద్రా స్కార్పియో-N


స్కార్పియో-N అనేది మహీంద్రా నుండి వచ్చిన లేటెస్ట్ కారు.  గత సంవత్సరం ఈ కారు బుకింగ్‌లను ప్రారంభించినప్పుడు, కేవలం ఒక నిమిషంలోపు 25,000 కంటే ఎక్కువ బుకింగ్‌లను పొందింది. స్టేజ్2 BS6 అమలు తర్వాత, స్కార్పియో-N ధర రూ. 13.05  లక్షల నుంచి రూ. 24.51 లక్షల వరకు ఉంది. ఇది SUV సెగ్మెంట్‌లో ప్రీమియం ఆఫర్‌గా మారింది. Scorpio-N  కొత్త ఫ్లాగ్‌షిప్ SUVగా వస్తోంది.  


4.టాటా పంచ్


టాటా పంచ్ అనేది ఒక మైక్రో SUV. ఇది SUVలను ఎంట్రీ లెవల్ హ్యాచ్‌ బ్యాక్ సెగ్మెంట్‌కు తీసుకువచ్చింది. పంచ్ భారతదేశంలో అత్యంత సరసమైన SUV. దీని ప్రారంభ ధర రూ. 5.99 లక్షలు. ఇది మారుతి సుజుకి స్విఫ్ట్ మాదిరిగానే ఉంటుంది. గ్లోబల్ NCAP రేటింగ్ 5 స్టార్‌లతో భారతదేశంలోని అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటిగా నిలిచింది. టాటా పంచ్ భారతదేశంలో అత్యంత వేగంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటి. అంతేకాదు, భారతీయ వినియోగదారులకు  అత్యంత ఇష్టమైనదిగా చెప్పుకోవచ్చు.


5.హ్యుందాయ్ క్రెటా


హ్యుందాయ్ క్రెటా భారత మార్కెట్లో కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో బెంచ్‌ మార్క్‌ గా మారింది. క్రెటా ప్రస్తుతం దాని సెకెండ్ జెనెరేషన్ లో ఉంది.  ఇప్పటికీ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న SUVలలో ఒకటి.  హ్యుందాయ్ క్రెటా ధర  రూ. 10.87 లక్షల నుంచి 19.20 లక్షల వరకు ఉంటుంది.  మొత్తంగా భారత్ లో గేమ్ ఛేంజింగ్ SUVలుగా ఈ 5 కార్లు దూసుకుపోతున్నాయి.    


Read Also: 45కు పైగా ఇండియన్ కార్ల క్రాష్ టెస్ట్ - సేఫ్టీ రేటింగ్స్‌లో దుమ్మురేపిన కార్లు ఇవే!