గ్లోబల్ NCAP 2022 నుంచి కొత్త ప్రోటోకాల్ ప్రకారం భారత్ లో కార్లను పరీక్షిస్తోంది. తాజాగా భారత్ లో సుమారు 45 కార్లను క్రాష్ టెస్ట్ చేసింది. ఇందులో వోక్స్‌ వ్యాగన్, స్కోడా టాప్ ప్లేస్ దక్కించుకున్నాయి. వోక్స్‌ వ్యాగన్ విర్టస్, స్కోడా స్లావియా, స్కోడా కుషాక్, వోక్స్‌ వ్యాగన్ టైగన్ భారతదేశంలో అత్యంత సురక్షితమైన కార్లుగా అవతరించాయి. ఇక మారుతి సుజుకి ఎంట్రీ-లెవల్ కార్లు తక్కువ రేటింగ్‌లను పొందాయి. S-Presso, Swift, Ignis, WagonR, Alto K10 తక్కువ రేటింగ్స్ పొందిన కార్ల లిస్టులో చేరాయి.

  






పెద్దల భద్రతలో అత్యంత సురక్షితమైన కార్లు


పెద్దల భద్రతలో భారతదేశంలోని టాప్ 5 GNCAP సురక్షితమైన కార్లుగా వోక్స్‌ వ్యాగన్ వర్టస్ / స్కోడా స్లావియా (29.71) రేటింగ్స్ తో టాప్ ప్లేస్ దక్కించుకున్నాయి. వోక్స్‌ వ్యాగన్ టైగన్, స్కోడా కుషాక్ (29.64) రెండో స్థానంలో నిలిచాయి. మహీంద్రా స్కార్పియో ఎన్ (29.25) తర్వాతి స్థానాన్ని దక్కించుకున్నాయి. ఇతర 5 రేటెడ్ కార్లు పాత టెస్ట్ ప్రోటోకాల్ ప్రకారం ఉన్నాయి. ఇందులో టాటా పంచ్ (16.45), మహీంద్రా XUV300 (16.42), టాటా ఆల్ట్రోజ్ (16.13), టాటా నెక్సన్ (16.06), మహీంద్రా XUV700 (16.03) రేటింగ్స్ కలిగి ఉన్నాయి. కొత్త GNCAP ప్రోటోకాల్స్ ప్రకారం, 1-స్టార్ అడల్ట్ సేఫ్టీ రేటింగ్ ఉన్న కార్లలో S-Presso, WagonR, Swift , Ignis ఉన్నాయి. మారుతి ఆల్టో K10 2-స్టార్ రేటింగ్ పొందింది.


పిల్లల భద్రతలో అత్యంత సురక్షితమైన కార్లు  


పిల్లల భద్రతలో, కొత్త ప్రోటోకాల్‌ల ప్రకారం వోక్స్‌ వ్యాగన్ టైగన్, స్కోడా కుషాక్, వోక్స్‌ వ్యాగన్ విర్టస్, స్కోడా స్లావియా అత్యుత్తమ పనితీరు కనబర్చాయి. పిల్లల భద్రతలో మొత్తం 49కి గాను నలుగురూ 42 పాయింట్లు సాధించాయి.  మహీంద్రా స్కార్పియో N 28.93 పాయింట్లతో 3-స్టార్ చైల్డ్ సేఫ్టీ రేటింగ్‌ను కలిగి ఉంది. పాత ప్రోటోకాల్ ప్రకారం, అత్యధిక చైల్డ్ సేఫ్టీ రేటింగ్ ఉన్న కార్లలో XUV700 (41.66), థార్ (41.11), టాటా పంచ్ (40.89), హోండా సిటీ ఫోర్త్ జెన్ (38.27), XUV300 (37.44), టిగోర్ EV (37.24) రేటింగ్ ను కలిగి ఉన్నాయి. కొత్త టెస్ట్ ప్రోటోకాల్‌ల ప్రకారం, Ignis, ఆల్టో కె10, ఎస్-ప్రెస్సో, వ్యాగన్ఆర్ జీరో జిఎన్‌సిఎపి రేటింగ్‌ను కలిగి ఉన్నాయి. మారుతి స్విఫ్ట్ పిల్లల భద్రతలో 1-స్టార్ రేటింగ్‌ను కలిగి ఉంది.


మొత్తం పాయింట్ల పరంగా అత్యంత సురక్షితమైన కార్లు


కొత్త టెస్ట్ ప్రోటోకాల్స్ ప్రకారం అత్యధిక మొత్తం పాయింట్లను కలిగి ఉన్న భారతదేశపు సురక్షితమైన GNCAP కార్లను పరిశీలిస్తే Virtus / Slavia (71.71), Taigun / Kushaq (71.64),  Scorpio N (58.18) రేటింగ్ తో టాప్ ప్లేస్ దక్కించుకున్నాయి. పాత ప్రోటోకాల్స్ ప్రకారం, ఎక్కువ రేటింగ్ స్కోర్ కలిగిన కార్లు XUV700 (57.69), పంచ్ (57.34), XUV300 (53.86), థార్ (53.63), సిటీ ఫోర్త్ జెన్ (50.30),  టయోటా అర్బన్ క్రూయిజర్ (50.20) టాప్ ప్లేస్ దక్కించుకున్నాయి. మిగిలిన అన్ని కార్లు 50 కంటే తక్కువ స్కోర్ చేశాయి. కొత్త ప్రోటోకాల్‌ల ప్రకారం, ఇగ్నిస్ (20.34), వ్యాగన్ఆర్ (23.09), ఎస్-ప్రెస్సో (23.55), ఆల్టో కె10 (25.19), స్విఫ్ట్ (35.87)లకు అత్యల్ప పాయింట్లు ఉన్నాయి.


కొత్త ప్రోటోకాల్స్ ఆధారంగా GNCAP క్రాష్ పరీక్షలు ఫోక్స్‌ వ్యాగన్, స్కోడా, మారుతి కార్లపై దృష్టి సారించింది. మహీంద్రా స్కార్పియో Nకు ఎంట్రీ లభించింది. ఇది అంచనాలకు తగ్గట్టుగానే రాణించింది. పిల్లల భద్రతలో SUV మరింత స్కోర్ చేసి ఉంటే మొత్తం పాయింట్లు ఎక్కువగా ఉండేవి. SUV వెనుక సీట్లు బెల్ట్ ప్రిటెన్షనర్, బెల్ట్ లోడ్ లిమిటర్, సైడ్ హెడ్ (థొరాక్స్ హెడ్) ఎయిర్‌ బ్యాగ్, సైడ్ ఛెస్ట్ ఎయిర్‌ బ్యాగ్, సైడ్ పెల్విస్ ఎయిర్‌ బ్యాగ్, ఇంటిగ్రేటెడ్ CRS, సీట్ బెల్ట్ వంటి ఫీచర్లు లేకపోవడంతో, పిల్లల భద్రతలో స్కార్పియో N కోసం పాయింట్లు కోల్పోయింది. మహీంద్రా అప్‌డేట్‌లను పరిచయం చేస్తోంది. కాబట్టి, XUV700, XUV300, థార్  లాంటి ఇతర SUVలు కొత్త టెస్ట్ ప్రోటోకాల్‌ల ప్రకారం ఎక్కువ పాయింట్లను స్కోర్ చేసే అవకాశం ఉంది.


Read Also: రూ. 8 లక్షల లోపు అదిరిపోయే SUVలు ఇవే! చూసి, మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి!