భారతీయ వాహన మార్కెట్లో SUVలకు వినియోగం బాగా పెరిగింది. సరసమైన ధరలోనూ ఈ వాహనాలు లభించడంతో వినియోగదారులు వాటినే కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వాహనాలు 40 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయి. త్వరలో ఆటోమోటివ్ విభాగంలో మార్కెట్ లీడర్లుగా అవతరించే అవకాశం ఉంది. ఇందులో హాచ్ బ్యాక్‌లకు సమానమైన ధర ఉన్న ఎంట్రీ-లెవల్ మోడల్‌లు కూడా ఉన్నాయి. టాటా పంచ్, నిస్సాన్ మాగ్నైట్, రెనాల్ట్ కిగర్, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్ భారతీయ మార్కెట్లో అత్యంత సరసమైన టాప్ 5 ఎంట్రీ-లెవల్ SUVలు. ప్రతి మోడల్ పెట్రోల్, డీజిల్‌తో సహా వివిధ ఇంజన్ ఎంపికలతో అందించబడుతుంది. 2023 భారతీయ మార్కెట్‌లో కొనుగోలు చేయగల టాప్ 5 అత్యంత సరసమైన ఎంట్రీ లెవల్ SUVలు ఏవో ఇప్పుడు చూద్దాం..
1.టాటా పంచ్ - రూ. 5.99 లక్షలు
టాటా పంచ్ అనేది టాటా మోటార్స్ ఎంట్రీ లెవల్ SUV. దీని ప్రారంభ (ఎక్స్-షోరూమ్) ధర రూ. 5.99 లక్షలు. కంపెనీ ఈ మైక్రో SUVని వారి ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ టియాగో ధరల శ్రేణిలో అందిస్తోంది. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కస్టమర్ బేస్‌ను ఈ కారు కలిగి ఉంది. ఒకే ఇంజన్ ఎంపిక, 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ AMT ట్రాన్స్ మిషన్ ఎంపికతో అందించబడుతుంది.
2.నిస్సాన్ మాగ్నైట్ - రూ. 5.99 లక్షలు
నిస్సాన్ మాగ్నైట్ భారత్ లో ఓ రేంజిలో అమ్మకాలు కొనసాగిస్తోంది. మాగ్నైట్ భారతీయ మార్కెట్లో కంపెనీకి బ్రేకవుట్ ఉత్పత్తిగా చెప్పుకోవచ్చు. నిస్సాన్ నుంచి వచ్చిన ఈ ఎంట్రీ లెవల్ SUV సమకాలీన జపనీస్ రూపాన్ని కలిగి ఉంది. దీని ప్రారంభ (ఎక్స్-షోరూమ్) ధర రూ. 5.99 లక్షలు. ఇది టాటా పంచ్ మాదిరిగానే భారతీయ మార్కెట్లో అత్యంత సరసమైన SUV. నిస్సాన్ రెండు ఇంజన్ ఆప్షన్‌లతో మాగ్నైట్‌ను అందిస్తుంది. 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్, 1.0 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.
3.రెనాల్ట్ కిగర్- రూ. 6.49 లక్షలు
రెనాల్ట్ కిగర్ నుంచి భారతీయ మార్కెట్లో విడుదలైన ఎంట్రీ లెవల్ SUV. దీని ప్రారంభ(ఎక్స్-షోరూమ్) ధర రూ.6.49 లక్షలు. రెనాల్ట్ కిగర్‌ను రెండు ఇంజన్ ఎంపికలతో అందిస్తుంది. ఒకటి 1.0L పెట్రోల్ ఇంజన్ ను కలిగి ఉంటుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, 5-స్పీడ్ AMT ట్రాన్స్ మిషన్‌తో జతచేయబడి ఉంటుంది. మరొకటి 1.0L టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్. ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, CVTతో జతచేయబడి ఉంటుంది.
4.హ్యుందాయ్ వెన్యూ - రూ. 7.68 లక్షలు
భారతీయ మార్కెట్లో హ్యుందాయ్ వెన్యూ అనేది ఎంట్రీ లెవల్ SUV. దీని ప్రారంభ(ఎక్స్-షోరూమ్) ధర రూ.7.68 లక్షలు. హ్యుందాయ్ మూడు ఇంజన్ ఎంపికలతో వెన్యూను అందిస్తుంది. అందులో ఒకటి 114.41 bhp, 250 Nm టార్క్ ఉత్పత్తి చేసే 1.5L డీజిల్ ఇంజన్ ను కలిగి ఉంటుంది. మరొకటి 81.86 bhp, 114 Nm టార్క్ ఉత్పత్తి చేసే 1.2L పెట్రోల్ ఇంజన్. ఇంకొకటి 1.0L టర్బోచార్జ్డ్ పెట్రోల్ b21 ఇంజన్ ను కలిగి ఉంటుంది.
5.కియా సోనెట్ - రూ. 7.79 లక్షలు
కియా సోనెట్ భారతీయ మార్కెట్లో సబ్-4M SUV. దీని ప్రారంభ(ఎక్స్-షోరూమ్) ధర రూ.7.79 లక్షలు. కియా హ్యుందాయ్ వెన్యూ వంటి ఇంజన్ ఎంపికలతో సోనెట్‌ను అందిస్తుంది. 81.86 bhp, 114 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే 1.2L పెట్రోల్ ఇంజన్, 114.41 bhp, 250 Nm టార్క్ ను ఉత్పత్తి చేసే 1.5L డీజిల్ ఇంజన్, 1.0L టర్బో పెట్రోల్ ఇంజన్ ను కలిగి ఉంటుంది.
Read Also: సెకండ్ హ్యాండ్ కారు కొనాలి అనుకుంటున్నారా? ఈ 5 విషయాల్లో జాగ్రత్తగా ఉండండి!