Best ADAS Cars: ప్రస్తుతం మార్కెట్లో కొత్తగా కార్లు కొనేవారిలో సెక్యూరిటీ ఫీచర్లకు సంబంధించిన అవగాహన నిరంతరం పెరుగుతోంది. దీని కారణంగా అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్ట్ సిస్టమ్ (ADAS) చాలా వేగంగా ప్రజాదరణ పొందుతోంది. ఈ సిస్టమ్‌తో వచ్చిన కొన్ని కార్ల గురించి తెలుసుకుందాం.


ఎంజీ ఆస్టర్
ఎంజీ ఆస్టర్ ఏడీఏఎస్‌తో ఫీచర్‌ ఉన్న అత్యంత చవకైన కార్లలో ఒకటి. ఇది లెవెల్ 2 అటానమస్ టెక్నాలజీని కలిగి ఉంది. ఆస్టర్ రెండు ఇంజన్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉంది. ఇందులో 1.5 లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్, 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో అనేక ఫీచర్లు కూడా ఉన్నాయి. దీని ఏడీఏఎస్ సిస్టమ్‌లో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, లేన్ డిపార్చర్ అలర్ట్, లేన్ డిపార్చర్ మిటిగేషన్, ఫ్రంట్ కొలిషన్ మిటిగేషన్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, ఇంటెలిజెంట్ హెడ్‌ల్యాంప్ కంట్రోల్, స్పీడ్ అసిస్ట్ సిస్టమ్ ఉన్నాయి. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.10.82 లక్షల నుంచి రూ.18.69 లక్షల మధ్య ఉంది.


మహీంద్రా ఎక్స్‌యూవీ700
మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఏడీఏఎస్ ఫీచర్లలో లేన్ డిపార్చర్ అలర్ట్, లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, హై బీమ్ అసిస్ట్, ట్రాఫిక్ సిగ్నల్ ఐడెంటిఫికేషన్, ఫ్రంట్ కొలిషన్ మిటిగేషన్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, స్మార్ట్ పైలట్ అసిస్ట్ ఉన్నాయి. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 14.03 లక్షల నుంచి రూ. 26.53 లక్షల మధ్య ఉంటుంది.


హోండా సిటీ ఈ:హెచ్ఈవీ
సిటీ ఈ:హెచ్ఈవీ అనేది హోండా లాంచ్ చేసిన మొట్టమొదటి బలమైన హైబ్రిడ్ కారు. ఇందులో పెట్రోల్‌తో పాటు ఈవీని కూడా ఉపయోగించవచ్చు. ఈ కారు ఏడీఏఎస్‌తో కూడా రానుంది. ఇది లేన్ కీప్ అసిస్ట్ సిస్టమ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటో హై బీమ్, కొలిషన్ మిటిగేషన్ బ్రేకింగ్ సిస్టమ్, రోడ్ డిపార్చర్ వార్నింగ్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.18.89 లక్షల నుంచి రూ.20.39 లక్షల వరకు ఉంది.


ఎంజీ జెడ్ఎస్ ఈవీ
ఎంజీ జెడ్ఎస్ ఈవీ ఒక ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ. ఇది శక్తివంతమైన మోటార్, 50 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో మార్కెట్లో లాంచ్ అయింది. ఈ కారు లోపలి భాగం చాలా విలాసవంతంగా ఉంటుంది. అత్యాధునిక సాంకేతికత, సౌకర్యాలను కలిగి ఉంది. దీని ఏడీఏఎస్ సిస్టమ్‌లో వెనుక డ్రైవ్ అసిస్ట్, ఎమర్జెన్సీ స్టాప్ సైన్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ సిస్టమ్‌ సహా అనేక ఫీచర్లు ఉన్నాయి. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 23.38 లక్షల నుండి రూ. 28 లక్షల మధ్య ఉంది.


టాటా హారియర్
కొత్త టాటా హారియర్ ప్రీమియం 5 సీటర్ ఎస్‌యూవీ. ఈ ఎస్‌యూవీ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో డీజిల్ ఇంజన్‌తో లభిస్తుంది. ఏడీఏఎస్ టెక్నాలజీ దీని టాప్ స్పెక్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఇది ఎస్‌యూవీని మరింత సురక్షితంగా మారుస్తుంది. దీని ఏడీఏఎస్‌లో ఫ్రంట్ కొలిషన్ అలర్ట్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్, హై బీమ్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, లేన్ చేంజ్ అలర్ట్, డోర్ ఓపెన్ అలర్ట్, రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, అల్ రియర్ కొల్లిషన్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 15.20 లక్షల నుంచి రూ. 24.27 లక్షల మధ్య ఉంది.


Also Read: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!


Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!