Upcoming Affordable Cars Under Rs 10 Lakh: పాపులర్‌ కారు కంపెనీలు, ఈ పండుగ సీజన్‌లో (Festive Season 2025) కొత్త మోడళ్లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. పనోరమిక్ సన్‌రూఫ్‌, వెంటిలేటెడ్ సీట్లు & లెవల్-2 ADAS వంటి అధునాతన ఫీచర్లతో ఈ కొత్త కార్లు రాబోతున్నాయి. రూ.10 లక్షల కంటే తక్కువ ధరలో, త్వరలో విడుదల కానున్న ఐదు కొత్త SUVలు & సెడాన్‌లు ఇవే..

Continues below advertisement

ఎలక్ట్రిక్ & ICE వెర్షన్లలో రాబోతున్న Tata Sierra90ల నాటి ఐకానిక్ SUV టాటా సియెర్రా కొత్త అవతారంలో తిరిగి వస్తోంది. ఈ కంపెనీ, నవంబర్ 2025లో 65kWh & 75kWh బ్యాటరీ ప్యాక్‌లతో EV వెర్షన్‌ను విడుదల చేస్తుంది. దీని పరిధి 500km నుంచి 600km వరకు ఉంటుంది. దీని డిజైన్ ప్రీమియం & ఫ్యూచరిస్టిక్‌గా ఉంటుంది. స్లీక్‌ LED హెడ్‌లైట్‌లు, ఫ్లోటింగ్‌ రూఫ్‌ & కనెక్టెడ్‌ టెయిల్‌ల్యాంప్‌లు ఉంటాయి. ఇంటీరియర్‌లో.. ట్రిపుల్-స్క్రీన్ సెటప్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు & ADAS వంటి లక్షణాలు ఉంటాయి. ICE వెర్షన్ 1.5-లీటర్ టర్బో పెట్రోల్ & 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో శక్తినిస్తుంది. దీని ధర ₹20-30 లక్షల మధ్య ఉంటుందని, Hyundai Creta & Kia Seltos వంటి పాపులర్‌ SUV లతో పోటీ పడుతుందని భావిస్తున్నారు.

Mahindra Thar Facelift 2025ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలకు పేరుగాంచిన మహీంద్రా థార్, ఈ ఏడాది చివర్లో ఫేస్‌లిఫ్ట్‌ రూపంలో వస్తోంది. కొత్త థార్‌లో కొత్త ఫ్రంట్ గ్రిల్, అప్‌డేటెడ్‌ హెడ్‌లైట్లు & అల్లాయ్ వీల్స్ ఉంటాయి. ఇంటీరియర్‌లో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 360-డిగ్రీ కెమెరా & ADAS వంటి లక్షణాలు ఉంటాయి. ఇంజిన్ ఎంపికల్లో.. 2.0-లీటర్ టర్బో పెట్రోల్ & 2.2-లీటర్ డీజిల్ ఉంటాయి, ఇవి 6-స్పీడ్ మాన్యువల్ & ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లతో అనుసంధానమై ఉంటాయి. ధరలు ₹15-20 లక్షల వరకు ఉంటాయని అంచనా.

Continues below advertisement

Tata Punch Facelift 2025టాటా పంచ్ కూడా ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌లో రాబోతోంది. కొత్త ఫ్రంట్‌ & రియర్‌ డిజైన్, LED హెడ్‌లైట్‌లు & కొత్త అల్లాయ్ వీల్స్‌ ఉంటాయి. ఇంటీరియర్‌లో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఛార్జింగ్ & వెంటిలేటెడ్ సీట్లు వంటి ఫీచర్లు యాడ్‌ అవుతాయి. ఇప్పటికే ఉన్న 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ (86 bhp) & CNG ఎంపికలు అలాగే ఉంటాయి, కొత్త టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను కూడా తీసుకురావచ్చు. దీని ధర ₹7-11 లక్షల మధ్య ఉంటుంది. Maruti Ignis & Hyundai Exter తో ఇది పోటీ పడవచ్చు.

New Gen Hyundai Venueకొత్త హ్యుందాయ్ వెన్యూ అక్టోబర్ లేదా నవంబర్ 2025లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. Hyundai Creta నుంచి ప్రేరణతో దీనిని డిజైన్‌ చేశారు. నిలువుగా పేర్చినట్లు ఉండే LED హెడ్‌లైట్లు & కనెక్టెడ్‌ DRLs హైలైట్‌ కావచ్చు. ఇంటీరియర్‌లో డ్యూయల్ 12.3-అంగుళాల స్క్రీన్ సెటప్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు & లెవల్-2 ADAS వంటి లక్షణాలను చూడవచ్చు. ఇంజిన్ ఎంపికలలో... 1.2-లీటర్ పెట్రోల్, 1.0-లీటర్ టర్బో పెట్రోల్ & 1.5-లీటర్ డీజిల్ ఉంటాయి. ధరలు ₹8-14 లక్షల వరకు ఉండొచ్చని అంచనా. ఈ SUV Tata Nexon & Maruti Fronx తో పోటీ పడుతుంది.

MG Majestorకొత్త రాబోతున్న SUVలలో, MG ప్రీమియం సెడాన్ మెజెస్టర్‌ పేరు కూడా ఉంది. ఇది 7-స్పీడ్ DCT గేర్‌బాక్స్‌తో అనుసంధానమైన 1.5-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ లేదా హైబ్రిడ్ ఇంజిన్‌తో శక్తినిస్తుంది. ఇంటీరియర్‌లో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ & ADAS ఉంటాయి. దీని ధర ₹15-20 లక్షల మధ్య ఉంటుంది. Honda City & Hyundai Verna తో ఇది పోటీ పడవచ్చు.