Best Family Cars In India Under Rs 15 Lakhs: మన దేశంలో, పెద్ద కుటుంబాల అవసరాలకు అనుగుణంగా ఉండే కార్లు కొందరికి అవసరం, మరికొందరికి ఆశయం. చిన్న SUVలు, MPVలు ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్‌లోకి వచ్చాయి & ట్రెండింగ్‌లో ఉన్నాయి. అయితే.. మంచి స్పేస్, సౌకర్యం, డీసెంట్ మైలేజ్ ఉన్న కార్లు కావాలంటే 7-సీటర్ కార్లు బెస్ట్ ఆప్షన్. వీటిలోనూ తక్కువ ధర కలిగిన కార్లు ఉన్నాయి, రూ. 15 లక్షల లోపునే మార్కెట్‌లో లభిస్తున్నాయి.
రూ. 15 లక్షల లోపు బెస్ట్ 7-సీటర్ కార్లు
1. మారుతి ఎర్టిగా (Maruti Ertiga)
ధర: రూ. 9.12 లక్షల నుంచి రూ. 13.40 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్)
ఇంజిన్: 1.5 లీటర్ K-సిరీస్ పెట్రోల్
మైలేజ్: సుమారు 20.51 kmpl (పెట్రోల్), 26.11 km/kg (CNG)
ప్రత్యేకతలు: మంచి రైడ్ క్వాలిటీ, ఫ్యామిలీకి తగిన స్పేస్, సెకండ్ & థర్డ్ రో లో సౌకర్యవంతమైన సీటింగ్
హైలైట్: CNG వేరియంట్ కూడా అందుబాటులో ఉంది
2. 2025 రెనాల్ట్ ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్ (2025 Renault Triber Facelift)
ధర: రూ. 6.29 లక్షల నుంచి రూ. 9.16 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్, ఇది పరిచయ ధర)
ఇంజిన్: 1.0 లీటర్ పెట్రోల్
మైలేజ్: 19 kmpl వరకు
ప్రత్యేకతలు: వేరియబుల్ సీటింగ్, తొలగించగలిగిన మూడో వరుస సీటు, MPV తరహాలో ఉండే SUV లుక్
హైలైట్: ఫీచర్లకు తగ్గ బడ్జెట్ ధర
3. కియా కారెన్స్ క్లావిస్ (Kia Carens Clavis / Premium 7-seater)
ధర: రూ. 11.50 లక్షల నుంచి రూ. 21.50 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్)
ఇంజిన్: 1.5 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్
మైలేజ్: 16.8-21.3 kmpl
ప్రత్యేకతలు: స్మూత్ డ్రైవింగ్, స్టైలిష్ డిజైన్, డిజిటల్ డాష్‌బోర్డ్, సేఫ్టీ ఫీచర్లలో ముందుంది
హైలైట్: పెద్ద SUV లా అనిపించే MPV
4. మహీంద్రా బోలెరో నియో (Mahindra Bolero Neo)
ధర: రూ. 9.97 లక్షల నుంచి రూ. 12.18 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్)
ఇంజిన్: 1.5 లీటర్ డీజిల్
మైలేజ్: 17.2 kmpl
ప్రత్యేకతలు: రగ్డ్ బిల్డ్, రియర్ వెహికల్ డ్రైవ్, లాంగ్ లైఫ్‌కు ఉపయోగపడే SUV
హైలైట్: గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా డిమాండ్
5. టాటా సుమో రీబోర్న్ (లాంచ్ అయ్యే అవకాశం)
ధర: అంచనా రూ. 10-15 లక్షల మధ్య
ఇంజిన్: 2.0 లీటర్ క్రయోటెక్ డీజిల్ (అంచనా)
మైలేజ్: ఇంకా వెల్లడి కాలేదు
ప్రత్యేకతలు: పాత సుమో మాదిరిగానే గంభీరమైన బాడీ, పెద్ద కుటుంబాలు రఫ్‌గా ఉపయోగించుకునేందుకు తగిన SUV
హైలైట్: తిరిగి రాబోతున్న సుమోపై భారీ ఆసక్తి
ప్రాంతాల వారీగా ధరలు (హైదరాబాద్ – విజయవాడ)
రాష్ట్రాన్ని బట్టి, ఈ కార్ల ఎక్స్-షోరూమ్ ధరల్లో స్వల్ప తేడాలు ఉండవచ్చు.
బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకుని, స్పేస్, మైలేజ్, స్టైల్ అన్నీ పరిగణనలోకి తీసుకుంటే – మారుతి ఎర్టిగా & రెనాల్ట్ ట్రైబర్ ఫ్యామిలీకి సరైన ఎంపికలు. ఫీచర్ల ప్రాధాన్యత ఉంటే, కియా కారెన్స్ ఉత్తమ ఎంపిక. రఫ్ యూజ్, రూరల్ డ్రైవింగ్ కోసం బోలెరో నియో ఒక రఫ్ అండ్ టఫ్ SUV తరహా ఆప్షన్. త్వరలో సుమో రీబోర్న్ కూడా మార్కెట్లోకి వస్తే మరింత ఆసక్తికరమైన పోటీ నెలకొంటుంది.