Tesla Cybertruck Delivery: టెస్లా నుంచి వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సైబర్‌ట్రక్ (Tesla Cybertruck) ధరను కంపెనీ వెల్లడించింది. దీని ధర 60,990 డాలర్ల (సుమారు రూ. 51 లక్షలు) నుంచి ప్రారంభం కానుంది. ఈ ధర 2019లో సీఈవో ఎలాన్ మస్క్ పేర్కొన్న ధర కంటే దాదాపు 50 శాతం ఎక్కువ. ఇది ప్రస్తుతం ఎంపిక చేసిన కస్టమర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
రాయిటర్స్ నివేదిక ప్రకారం ఇందులో మూడు వేరియంట్‌లు ఉన్నాయి. వీరి ధర రూ.51 లక్షల నుంచి రూ. 83 లక్షల మధ్య ఉండనుంది. ఎలాన్ మస్క్ (Elon Musk) తన సైబర్‌ట్రక్‌ను సాధారణ ట్రక్కు కంటే మెరుగైనదని, స్పోర్ట్స్ కారు కంటే వేగవంతమైనదని తెలిపాడు. అతను సైబర్‌ట్రక్‌ను వేదికపైన ప్రదర్శించాడు. తర్వాత టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో జరిగిన కార్యక్రమంలో కొంతమంది కస్టమర్‌లకు దానిని అందించాడు. దీని రూపకల్పన గురించి ఎలాన్ మస్క్ మాట్లాడుతూ ఇది ఫ్యూచరిస్టిక్ డిజైన్ అని తెలిపాడు.
ఆల్ వీల్ డ్రైవ్ వేరియంట్ వచ్చే ఏడాది
సైబర్‌ట్రక్ ధరలు టెస్లా వెబ్‌సైట్‌లో అయ్యాయి. దీని హైఎండ్ పెర్ఫార్మెన్స్ వేరియంట్ 'సైబర్‌బీస్ట్' వచ్చే ఏడాది అందుబాటులోకి వస్తుంది. ఇది ఆల్ వీల్ డ్రైవ్ ట్రిమ్‌తో కూడా రానుంది. దీని ప్రారంభ ధర దాదాపు రూ. 66 లక్షల వరకు చూడవచ్చు. దీని రేర్ వీల్ డ్రైవ్ వేరియంట్ కూడా 2025లో దాదాపు రూ. 51 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులోకి రానుంది.
నాలుగేళ్ల క్రితం...
2019లో సైబర్‌ట్రక్ దాదాపు 40,000 డాలర్ల (సుమారు రూ. 33 లక్షలు) ధరతో మార్కెట్లోకి వస్తుందని ఎలాన్ మస్క్ అంచనా వేశారు. దీని తర్వాత ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది వినియోగదారులు 100 డాలర్లు చెల్లించి బుక్ చేసుకున్నారు. ఇది మార్కెట్లోకి రావడానికి దాదాపు నాలుగు సంవత్సరాలు పట్టింది.
ఇది టెస్లా మొదటి కొత్త మోడల్. కాబట్టి ఇది కంపెనీ తన పేరును కాపాడుకోవడానికి దీని సక్సెస్ చాలా అవసరం. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వెహికల్ (EV) విభాగంలో టెస్లా పోటీని ఎదుర్కొంటున్న తరుణంలో అమ్మకాలను పెంచడంలో ఈ సైబర్‌ట్రక్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
సైబర్‌ట్రక్ హై రేంజ్ వేరియంట్ (Tesla Cybertruck Range) ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 547 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయగలదు. ఇది రేంజ్ ఎక్స్‌టెండర్ లేదా అదనపు బ్యాటరీ ప్యాక్‌తో రానుంది. వెహికిల్ రేంజ్‌ను మరింత పెంచడంలో ఇది సహాయపడుతుంది. 2025లో టెస్లా సైబర్‌ట్రక్ ప్రతి సంవత్సరం దాదాపు 250,000 యూనిట్ల ఉత్పత్తిని చేరుకునే అవకాశం ఉందని ఎలాన్ మస్క్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఫోర్డ్ ఎఫ్150 లైటెనింగ్, రివియన్ ఆటోమోటివ్ ఆర్1టీ, జనరల్ మోటార్స్ హమ్మర్ ఈవీలతో సైబర్ ట్రక్ పోటీ పడనుంది.
ఫీచర్లు ఇలా...
ఈ కారులో టెస్లా అద్భుతమైన ఫీచర్లు అందించింది. ఏకంగా గంటకు 200 కిలోమీటర్లకు పైగా టాప్ స్పీడ్‌ను ఈ కారు అందించనుంది. 845 హెచ్‌పీ పవర్‌ను ఈ కారు డెలివర్ చేయనుంది. 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 2.6 సెకన్లలోనే అందుకోనుంది. 15 స్పీకర్ ఆడియో సిస్టంను ఈ కారులో అందించారు.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply
Also Read: సూపర్ హిట్ టయోటా కామ్రీ అప్‌డేటెడ్ వెర్షన్ త్వరలో - ఈసారి హైబ్రిడ్ ఇంజిన్‌తో!
Also Read: లాంచ్‌కు రెడీ అవుతున్న కొత్త స్విఫ్ట్ - సరికొత్త ఇంజిన్, సూపర్ లుక్‌తో!