Mahindra SUV: మహీంద్రా ఎస్‌యూవీ లైనప్‌కు నిరంతరం డిమాండ్ పెరుగుతోంది. కంపెనీ ఆర్థిక ఫలితాలను మహీంద్రా ప్రకటించింది. 2024 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కంపెనీ ఎస్‌యూవీలకు యావరేజ్‌గా 51 వేల బుకింగ్స్ అందుకున్నట్లు వెల్లడించింది. ఇంకా మూడు లక్షల ఆర్డర్‌లు డెలివరీ కావాల్సి ఉంది. మహీంద్రా స్కార్పియో (స్కార్పియో ఎన్, స్కార్పియో క్లాసిక్ రెండూ) అత్యధిక డిమాండ్‌లో ఉన్నాయి. వీటికి సంబంధించి 1.19 లక్షల బుకింగ్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. ఇది కంపెనీ మొత్తం పెండింగ్ ఆర్డర్‌లలో 42 శాతం కావడం విశేషం.


మహీంద్రా స్కార్పియో బుకింగ్
రెండు స్కార్పియో వేరియంట్లు కలిపి నెలవారీ బుకింగ్ 17,000 యూనిట్లకు చేరుకుంది. స్కార్పియో ఎన్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 13.26 లక్షల నుంచి రూ. 24.54 లక్షల మధ్య ఉండగా, స్కార్పియో క్లాసిక్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 13.25 లక్షల నుంచి రూ. 17.06 లక్షల మధ్య ఉంటుంది.


మహీంద్రా థార్, ఎక్స్‌యూవీ 700 బుకింగ్స్ ఇలా...
2023-24 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో మహీంద్రా థార్ నెలకు 10,000 బుకింగ్‌లతో బలమైన స్థానాన్ని కలిగి ఉంది. దీని కారణంగా కంపెనీ ప్రస్తుతం థార్ కోసం 76,000 యూనిట్ల బుకింగ్స్ పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఆఫ్ రోడ్ ఎస్‌యూవీ రియర్ వీల్ డ్రైవ్ (RWD), 4X4 వేరియంట్లు రెండూ అధిక డిమాండ్‌లో ఉన్నాయి. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 10.98 లక్షల నుంచి రూ. 16.94 లక్షల మధ్య ఉన్నాయి. దీని తరువాత మహీంద్రా ఎక్స్‌యూవీ700 సగటు నెలవారీ బుకింగ్ 9,000 యూనిట్లను పొందుతోంది. అయితే ఈ ప్రీమియం ఎస్‌యూవీ కోసం 70,000 యూనిట్ల ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఎక్స్‌యూవీ700 మోడల్ లైనప్ ప్రస్తుత ఎక్స్ షోరూమ్ ధర రూ. 14.03 లక్షల నుంచి రూ. 26.57 లక్షల మధ్య ఉంటుంది.


మహీంద్రా బొలెరో (బొలెరో నియో, బొలెరో నియో ప్లస్ రెండూ) పెండింగ్‌లో ఉన్న ఆర్డర్ 11,000 యూనిట్లు. ఈ ఎంపీవీ 2023-24 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 9,000 యూనిట్ల సగటు నెలవారీ బుకింగ్‌లను పొందింది. మహీంద్రా ఎక్స్‌యూవీ300 సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ, ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ SUV కోసం మొత్తం 10,000 బుకింగ్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. ఇది మహీంద్రా మొత్తం పెండింగ్ ఆర్డర్‌లలో 3.5 శాతం మాత్రమే. ఎక్స్‌యూవీ300 ధర రూ. 7.99 లక్షల నుంచి రూ. 14.76 లక్షల మధ్య ఉండగా, ఎక్స్‌యూవీ400 ఎక్స్-షోరూమ్ ధర రూ. 15.99 లక్షల నుంచి రూ. 19.39 లక్షల మధ్య ఉంటుంది.


మరోవైపు లోటస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీతో భారతీయ మార్కెట్లోకి ప్రవేశించింది. కంపెనీ ఇప్పటికే తన రెండో మోడల్ ఎమిరా స్పోర్ట్స్‌కార్‌ను భారతదేశం కోసం అనౌన్స్ చేసింది. 2024 ఏప్రిల్ నుంచి లోటస్ ఎమిరాను న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన కొత్త లోటస్ ప్రత్యేక మోటార్స్ షోరూమ్ ద్వారా విక్రయించనున్నారు. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply


Also Read: సూపర్ హిట్ టయోటా కామ్రీ అప్‌డేటెడ్ వెర్షన్ త్వరలో - ఈసారి హైబ్రిడ్ ఇంజిన్‌తో!


Also Read: లాంచ్‌కు రెడీ అవుతున్న కొత్త స్విఫ్ట్ - సరికొత్త ఇంజిన్, సూపర్ లుక్‌తో!