Tata Tiago Facelift Top Feature: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో టాటా మోటార్స్ తన లైనప్‌ను క్రమంగా అప్‌డేట్ చేస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. తాజాగా లాంచ్ అయిన టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్ మోడల్ సరికొత్త ఫీచర్లతో సెగ్మెంట్లోనే బెస్ట్ ఆప్షన్‌గా నిలిచింది. ఈ మార్పులు టియాగో డిమాండ్‌ను భారీగా పెంచే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా మారుతి సుజుకి స్విఫ్ట్ కారును కొనాలనుకునే వారు సైతం ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్ వైపు చూసేలా టాటా ఈ కారును డిజైన్ చేసింది. స్విఫ్ట్ కారులో అస్సలు కనిపించని కొన్ని ప్రత్యేకమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Read Also: Tiago EV Smart 19 vs Pure Plus 19: టాటా టియాగో ఈవీ: స్మార్ట్ 19 vs ప్యూర్ ప్లస్‌ 19- లక్షరన్నర తేడాతో మీకు దక్కేదేంటీ?

అడ్వాన్స్‌డ్ ఛార్జింగ్ అప్‌డేట్స్..ఈ కొత్త మోడల్లో డ్యుయల్ వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ సెటప్ ఇచ్చారు. దీనివల్ల కారులోని ఇద్దరు ప్యాసింజర్లు ఒకేసారి ఎలాంటి కేబుల్స్ లేకుండా స్మార్ట్‌ఫోన్స్ ఛార్జ్ చేసుకోవచ్చు. ఫ్యామిలీతో లాంగ్ జర్నీ చేసే వారికి, నెవిగేషన్ ఎక్కువగా వాడే వారికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. అలాగే కారులోని రెండు వరుసలలో 65W టైప్-సి ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్స్ అమర్చారు. దీని సహాయంతో లాప్‌టాప్స్ కూడా ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు.

Read Also: Driving Licence News: డ్రైవింగ్ లైసెన్స్ వాలిడిటీని 50 ఏళ్లకు పెంచేలా కేంద్ర యోచన, త్వరలోనే కొత్త రూల్స్ వచ్చే ఛాన్స్.

బిగ్ స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్, ప్యాడల్ షిఫ్టర్స్టియాగో ఫేస్‌లిఫ్ట్ లోపల 10.25 ఇంచుల భారీ టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను సెట్ చేశారు. ఈ సెగ్మెంట్లో ఇదే అతిపెద్ద స్క్రీన్ కావడం విశేషం. ఇది కారు క్యాబిన్‌కు మోడర్న్, ప్రీమియం లుక్ ఇస్తుంది. దీనితో పాటు ఏఎమ్‌టి (AMT) వేరియంట్లలో ప్యాడల్ షిఫ్టర్స్ ఇవ్వడం అందరినీ సర్‌ప్రైజ్ చేసింది. డౌన్‌హిల్స్ లో డ్రైవ్ చేసేటప్పుడు, ఓవర్‌టేక్ చేసేటప్పుడు డ్రైవర్లకు ఇది మంచి కంట్రోల్ ఇస్తుంది.

సిఎన్‌జి విత్‌ బూట్ స్పేస్..ఈ కారులో ట్విన్ సిలిండర్ టెక్నాలజీని ఉపయోగించారు. దీనివల్ల డిక్కీలో సిఎన్‌జి సిలిండర్లు ఉన్నప్పటికీ, లగేజ్ పెట్టుకోవడానికి మంచి బూట్ స్పేస్ దొరుకుతుంది. ఏఎమ్‌టి గేర్‌బాక్స్‌తో పాటు డ్యుయల్ సిలిండర్ సిఎన్‌జి కాంబినేషన్ ఆఫర్ చేస్తున్న ఏకైక హ్యాచ్‌బ్యాక్ కారు ఇదే. ఈ స్మార్ట్ స్పేస్ మేనేజ్‌మెంట్ రోజువారీ వాడకానికి కారును పర్ఫెక్ట్‌గా మారుస్తుంది. ఈ ఫీచర్ వల్ల కస్టమర్లకు భారీగా బూట్ స్పేస్ ఆదా అవుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.