Tiago EV Smart 19 vs Pure Plus 19: భారతీయ ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ విప్లవం వేగంగా పుంజుకుంటోంది. ముఖ్యంగా మధ్యతరగతి వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని టాటా మోటార్స్ ప్రవేశ పెట్టిన టియాగో ఈవీ ఈ మార్కెట్‌లో ఒక సంచలనం. అయితే ఈ కారులో ఏ వేరియంట్ కొనుగోలు చేయాలని విషయంలో చాలా మంది అయోమయానికి గురవుతుంటారు. ముఖ్యంగా బేస్ వేరియంట్ అయిన స్మార్ట్19, దాని తర్వాతి వెర్షన్ ప్యూర్ ప్లస్ 19 మధ్య ఏది ఉత్తమం. ఈ రెండింటి మధ్య ఉన్న అసలు తేడాలేంటీ? అనే అంశాలను లోతుగా చూద్దాం.
ధర వ్యత్యాసం, ఏది మీ జేబుకు భారం?
టాటా టియాగో ఈవీ ధరల విషయానికి వస్తే, ఈ రెండు వేరియంట్ల మధ్య గణనీయమైన తేడా ఉంది. టాటా డియాగో ఈవీ స్మార్ట్ 6.99 లక్షలు, టాటా టియాగో ఈవీ ప్యూర్ ప్లస్ 19 8.49 లక్షలు అంటే కేవలం ఫీచర్ల కోసం మీరు అదనంగా 1.5 లక్షలు వెచ్చించాల్సి ఉంటుంది. ఈ అదనపు ధరతో మీకు లభించే ప్రయోజనాలు ఏంటో చూద్దాం.
ఒకే ఇంజిన్- ఒకటే పవర్
సాంకేతికపరంగా ఈ రెండు వేరియంట్లలో ఎలాంటి మార్పులు లేవు. రెండింటిలోనూ ఒకే రకమైన బ్యాటరీ ప్యాక్, మోటార్‌ను ఉపయోగించారు. 19.2kWh బ్యాటరీ సామర్థ్యంతో 61.18hp, గరిష్ట టార్క్ 110Nm, కలిగి ఉంటుంది. పర్మనెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్ వాడారు. ఫ్రంట్ వీల్ డ్రైవ్ లే అవుట్‌తో వస్తోంది. ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కలిగి ఉంది.
రేంజ్, ఛార్జింగ్‌లో తేడాలు?
ఎలక్ట్రిక్‌్ కార్ల కొనుగోలుదారులు ప్రధానంగా చూసేది రేంజ్, స్మార్ట్ 19, ప్యూర్ ప్లస్ 19 వేరియంట్లు రెండూ ఒకే రకమైన రేంజ్‌ను అందిస్తాయి. ఈ రెండు కూడా 226 కిలోమీటర్లు రేంజ్ ఇచ్చారు. 3.3kW AC ఛార్జర్‌తో పది నుంచి 100శాతం వరకు ఛార్జ్ కావడానికి సుమారు 6.9 గంటలు పడుతుంది. ఈ రెండు కార్లలోనూ మల్టిపుల్ డ్రైవ్ మోడ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవి మీ ప్రయాణం అవసరాలకు అనుగుణంగా శక్తిని సర్దుబాటు చేస్తాయి.
ఫీచర్ల పోలిక
నిజమైన వ్యత్యాసం ఫీచర్ల దగ్గరే మొదలవుతుంది. 1.5 లక్షల వ్యత్యాసంలో టాటా మోటార్స్ ప్యూర్ ప్లస్ 19లో అందించి అదనపు హంగులు ఉన్నాయి.
స్మార్ట్ 19 ఈ వేరియంట్‌లో టువంటి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, స్పీకర్లు ఉండవు. ఇది కేవలం బేసిక్ మోడల్ మాత్రమే. ప్యూర్ ప్లస్ 19లో 8 అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే ఉంటుంది. దీంతోపాటు వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే సౌకర్యం ఉంది. అలాగే ప్రయాణంలో సంగీతం వినడానికి 4 స్పీకర్లు, మొబైల్ ఛార్జింగ్ కోసం 2 టైప్ సీ యూఎస్‌బీ పోర్టులు అందించారు.
స్మార్ట్ 19లో పవర్ విండోస్ సౌకర్యం గురించి స్పష్టత లేదు. కానీ ప్యూర్ ప్లస్ 19లో ముందు, వెనుక రెండు వైపులా పవర్ విండోస్ లభిస్తాయి. స్మార్ట్ 19కేవలం స్టీల్ రిమ్స్‌తో వస్తుంది. కానీ ప్యూర్ ప్లస్ 19లో వీల్ కవర్లతో కూడిన స్టీల్ రిమ్స్ ఉంటాయి. ప్యూర్ ప్లస్ 19లో స్టైలిష్ షార్క్ ఫిన్ యాంటెన్నా ఉంటుంది. ఇది స్మార్ట్ 19లో లేదు.
భద్రతలో తేడా ఏంటీ?
భద్రత విషయంలో టాటా ఎప్పుడూ రాజీ పడదు. ఈ రెండు వేరియంట్లలోనూ కొన్ని కీలకమైన సేఫ్టీ ఫీచర్లు సమానంగా ఉన్నాయి. రెండు వేరియంట్లలోనూ ఉంది. పార్కింగ్ సెన్సార్లు వెనుకవైపు పార్కింగ్ సెన్సార్లు రెండింటిలోనూ ఉన్నాయి. టైర్లలో గాలి తక్కువగా ఉంటే వార్నింగ్ ఇచ్చే సిస్టమ్ రెండు మోడళ్లలోనూ అందుబాటులో ఉంది. ప్యూర్ ప్లస్ 19లో అదనంగా రియర్ పార్కింగ్ కెమెరా లభిస్తుంది. ఇది కారు రివర్స్ తీసేటప్పుడు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. డైమెన్షన్స్, సస్పెన్షన్ విషయంలో రెండు వేరియంట్ల బాడీ స్ట్రక్చర్, కొలతలు పూర్తి సమానంగా ఉంటుంది.
మీరు కేవలం సిటీ ప్రయాణాల కోసం, తక్కువ ధరలో ఎలక్ట్రిక్ కారు కావాలనుకుంటే స్మార్ట్ 19 మంచి ఎంపిక, కానీ, కారులో కూర్చొన్నప్పుడు ఆధునిక ఫీచర్లు, మంచి మ్యూజిక్ సిస్టమ్, రివర్స్ కెమెరా వంటి సౌకర్యాలు కావాలనుకుంటే ప్యూర్ ప్లస్ 19 కోసం అదనపు డబ్బు వెచ్చించడం సరైన నిర్ణయం అవుతుంది.
టాటా టియాగో ఈవీ స్మార్ట్ 19 ఒక పొదుపుగా ఉండే ఎలక్ట్రిక్ కారు, అయితే ప్యూర్ ప్లస్ 19 అనేది సౌకర్యం, సాంకేతికత కలగలిసిన ప్యాకేజీ, మీ ప్రాధాన్యత కేవలం ప్రయాణం అయితే స్మార్ట్ 19ని, ప్రయాణంతోపాటు అనుభూతి కూడా ముఖ్‌యం అనుకుంటే ప్లూర్ ప్లస్ 19ని ఎంచుకోండి.
