Driving Licence Validity May Be Extended To 50 Years:  దేశంలోని కోట్లాది మంది వాహనదారులకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఒక సూపర్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఉన్న రూల్స్ ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ వాలిడిటీ 20 ఏళ్లు మాత్రమే ఉంటోంది. ఆ తర్వాత సిటిజన్స్ మళ్లీ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ, హెల్త్ సర్టిఫికెట్లు సబ్మిట్ చేసి రిన్యూవల్ చేసుకోవాల్సి వస్తోంది. ఈ ప్రాసెస్ మొత్తాన్ని సింప్లిఫై చేసి, పబ్లిక్ సర్వీసులను మరింత ఈజీగా మార్చడమే ఈ కొత్త ప్రపోజల్ ముఖ్య ఉద్దేశం. దీనిపై అధికారులు క్లారిటీ ఇస్తూ, చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని, ఇంకా ఫైనల్ డెసిషన్ తీసుకోలేదని స్పష్టం చేశారు.

Continues below advertisement

Read Also: Renault Duster Techno Review: కొత్త రెనాల్ట్ డస్టర్ 1.0 లీటర్ టర్బో మోడల్ రివ్యూ?: డ్రైవింగ్ లవర్స్ కు బెస్ట్ ఆప్షన్ గా డెసిషన్.. ఫీచర్లు తక్కువైనా పర్ఫార్మెన్స్ అదుర్స్..

రాష్ట్రాల రెవెన్యూ అభ్యంతరాలుఈ ప్రతిపాదనపై కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. లైసెన్స్ రిన్యూవల్స్ తగ్గితే తమకు వచ్చే ఆదాయానికి గండి పడుతుందని భయపడుతున్నాయి. అయితే ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఫీజుల కలెక్షన్ కంటిన్యూ అవుతుందని, దీనివల్ల రాష్ట్రాల రెవెన్యూకి ఎలాంటి నష్టం వాటిల్లదని కేంద్ర అధికారులు భరోసా ఇస్తున్నారు. డిజిటల్ సిస్టమ్ ద్వారా ఫైనాన్షియల్ లావాదేవీలు క్లియర్ గా సాగుతాయి.

Continues below advertisement

Read Also: SUV vs MPV vs Sedan: మీ ఫ్యామిలీకి సరిపోయే పర్ఫెక్ట్‌ కారు ఏదీ? ధర, మైలేజ్, కంఫర్ట్‌ మధ్య అసలు తేడాలివే!

పేపర్‌వర్క్ లేని ఆన్‌లైన్ సేవలులైసెన్స్ వాలిడిటీ పెంచడమే కాకుండా, వెహికల్ ఓనర్‌షిప్ ట్రాన్స్‌ఫర్, పర్మిట్ రిన్యూవల్స్ వంటి రవాణా శాఖ సేవలను 100% ఆన్‌లైన్ చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. దీనివల్ల ప్రజలు ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఇంట్లోనే పనులు పూర్తి చేసుకోవచ్చు. కాగిత రహిత లావాదేవీల వల్ల కరప్షన్ తగ్గి, ట్రాన్స్‌పరెన్సీ పెరుగుతుంది. అలాగే ప్రజలకు చాలా ఉపయోగ కరంగా ఉంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే లైసెన్స్ క్యాన్సిల్..రూల్స్ మారినంత మాత్రాన డ్రైవర్లు ఇష్టమొచ్చినట్లు డ్రైవ్ చేయడానికి కుదరదు. ట్రాఫిక్ వైలేషన్స్ చేసే వారికి నెగెటివ్ పాయింట్లు కేటాయించే కొత్త సిస్టమ్‌ను డెవలప్ చేస్తున్నారు. పాయింట్లు ఎక్కువైతే లైసెన్స్ సస్పెండ్ లేదా పూర్తిగా క్యాన్సిల్ అవుతుంది. ఈ విధానం ద్వారా రాష్ డ్రైవింగ్ చేసేవారిని ఈజీగా కంట్రోల్ చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు.