Renault Duster Techno 1.0L Turbo Petrol First Drive Review: ఇండియా ఆటోమొబైల్ మార్కెట్ లో డ్రైవింగ్ ఎక్స్ పీరియన్స్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే రెనాల్ట్ డస్టర్ సరికొత్త 1.0 లీటర్ టీసీఈ 100 టెక్నో వేరియంట్ తో ఎంట్రీ ఇచ్చింది. ఈ కొత్త మోడల్ లో కంపెనీ ఫీచర్ల కంటే డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ కే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చింది. ఎక్స్‌టీరియర్ లుక్ పరంగా చూస్తే పాత రగ్గడ్, మస్కులర్ డిజైన్ ను కంటిన్యూ చేశారు. టెస్ట్ డ్రైవ్ లో వాడిన బ్లాక్ కలర్ మోడల్ చాలా పవర్‌ఫుల్ గా కనిపించింది. క్యాబిన్ లోపల ప్యాసింజర్లకు మంచి స్పేస్ లభిస్తుంది. అయితే ఇది ఎంట్రీ-టు-మిడ్ వేరియంట్ కావడం వల్ల లెథరెట్ సీట్లు, 360 డిగ్రీ కెమెరా వంటి లగ్జరీ ఫీచర్లు ఇందులో మిస్ అయ్యాయి.

Read Also: Tiago EV Smart 19 vs Pure Plus 19: టాటా టియాగో ఈవీ: స్మార్ట్ 19 vs ప్యూర్ ప్లస్‌ 19- లక్షరన్నర తేడాతో మీకు దక్కేదేంటీ?

లీనియర్ పవర్ డెలివరీ.. 

ఈ కార్ లోని 1.0 లీటర్ త్రీ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 100 హెచ్‌పీ పవర్, 166 ఎన్ఎమ్ టార్క్ జనరేట్ చేస్తుంది. చిన్న ఇంజన్ అయినప్పటికీ సిటీ ట్రాఫిక్ లో, హైవేలపై డ్రైవ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. త్రీ సిలిండర్ మోటార్ అయినప్పటికీ క్యాబిన్ లోపలికి నాయిస్, వైబ్రేషన్స్ (NVH) రాకుండా రెనాల్ట్ బాగా కంట్రోల్ చేసింది. ఇందులో ఎకో, నార్మల్ అనే టూ డ్రైవింగ్ మోడ్స్ ఇచ్చారు. ఎకో మోడ్ లో కొంచెం టర్బో లాగ్ కనిపిస్తుంది, అందుకే హైవేలపై ఓవర్ టేక్ చేయడానికి నార్మల్ మోడ్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి.

Read Also: Splendor Plus Flex Fuel Bike EMI: హీరో స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ లాంచ్: పెట్రోల్ తో పనిలేకుండా ఇథనాల్ తో నడిచే సరికొత్త మోడల్..  నెలకు ఎంత ఈఎంఐ

స్మూత్ రైడ్ కంఫర్ట్.. 

ఈ కార్ లో ఉన్న 17 ఇంచుల వీల్స్, సస్పెన్షన్ సెటప్ వల్ల ఇండియన్ రోడ్లపై ఉండే గుంతలను చాలా ఈజీగా అబ్జార్బ్ చేసుకుంటుంది. గుంత‌ల‌ రోడ్లపై కూడా రైడింగ్ కంఫర్ట్ అద్భుతంగా ఉంటుంది. అయితే దీని మ్యాన్యువల్ గేర్‌బాక్స్ షిఫ్ట్స్ అంత స్మూత్ గా లేవు, కొంచెం నాచీగా అనిపిస్తాయి. అలాగే హై వేరియంట్లలో ఉన్నట్లు వెనుక వైపు డిస్క్ బ్రేక్స్ ఇవ్వకపోవడం వల్ల బ్రేకింగ్ కాన్ఫిడెన్స్ కొంచెం తగ్గుతుంది. అన్నింటికంటే పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే ఈ 1.0 లీటర్ ఇంజన్ తో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ ఇవ్వలేదు.

మైలేజ్ ఎంతంటే..?

నార్మల్ డ్రైవింగ్ కండిషన్స్ లో ఈ కార్ లీటరుకు 11 నుంచి 13 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇందులో 5th, 6th ఓవర్ డ్రైవ్ గేర్స్ ఉండటం వల్ల హైవేలపై లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఇంకా బెటర్ మైలేజ్ వచ్చే ఛాన్స్ ఉంది. గంటకు 100 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్తున్నప్పుడు ఇంజన్ కేవలం 2500 ఆర్‌పీఎమ్ వద్ద చాలా రిలాక్స్డ్ గా రన్ అవుతుంది. ఫీచర్లు తక్కువైనా పర్వాలేదు, మంచి రైడింగ్ కంఫర్ట్, సాలిడ్ ఇంజన్ పంచ్ కావాలనుకునే వారికి ఈ డస్టర్ 1.0 లీటర్ మోడల్ బెస్ట్ ఛాయిస్. ఇంకా ఎక్కువ పవర్ కావాలనుకుంటే 1.3 లీటర్ ఇంజన్ వెర్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు.