వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ తన ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొస్తోంది. భవిష్యత్ లో వాహన మార్కెట్ ను ఎలక్ట్రిక్ వాహనాలే శాసిస్తాయని బలంగా నమ్ముతున్న టాటా కంపెనీ, ఆ సెగ్మెంట్ ను మరింత విస్తరిస్తోంది. అందులో భాగంగానే టియాగో EVని మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రస్తుతం దేశీయంగా తక్కువ ధరకు లభిస్తున్న కారు ఇదే. దీని ఫీచర్లు, ధర సహా పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఆకట్టుకునే డిజైన్
టాటా టియాగో EV చూడ్డానికి ఆకట్టుకునేలా ఉంటుంది. వెలుపల, లోపల ఆకర్షించే లుక్ ను కలిగి ఉంటుంది. ముందు భాగంలో గ్రిల్ బ్లాక్ ప్లాస్టిక్ తో వస్తుంది. దాని మధ్యలో లోగోను పొందుపర్చారు. దాని పక్కనే EV బ్యాడ్జ్ కూడా స్పష్టంగా ఉంటుంది. హెడ్ లైట్లు క్లోజ్డ్ ఆఫ్ గ్రిల్ కింద టీల్ బ్లూ స్టిప్ ద్వారా కనెక్ట్ చేయబడి ఉంటాయి. DRL లు ఫ్రంట్ బంపర్‌లో తక్కువగా ఉంటాయి. 14 ఇంచెస్ హైపర్ స్టైల్ వీల్స్ ను కలిగి ఉంటుంది. ఇంటీరియర్ చాలా లేటెస్ట్ గా ఉంటుంది.
అదిరిపోయే ఫీచర్స్
టియాగో EVలో.. 7 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ను ఉంది. ఆపిల్ కార్ ప్లేతో పాటు ఆండ్రాయిడ్ ఆటోకు సపోర్ట్ చేస్తుంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్లు, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్‌లు, పుష్ బటన్ స్టార్ట్, క్రూయిజ్ కంట్రోల్ ను కలిగి ఉంటుంది. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ తో పాటు ఏసీ వెంట్స్ చుట్టూ టీల్ ఉంటుంది. టెలిమాటిక్స్ యాక్సెస్ ను కలిగి ఉంది. ఇందులో 6 ఎయిర్ బ్యాగులు ఉంటాయి. ఏబీఎస్ విత్ ఈబిడి, రియర్ పార్కింగ్ సెన్సార్లు, సీట్ బెల్ట్ రిమైండర్, రియర్ పార్కింగ్ కెమెరా ఉంటుంది.
బ్యాటరీ ప్యాక్ ప్రత్యేకత
ఇది రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంది. 19.2kWh, 24kWh బ్యాటరీ ప్యాక్స్. ఇందులోని 19.2kWh బ్యాటరీ ఒక ఫుల్ ఛార్జ్ తో 250 కి మీ ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఈ వెర్షన్ 60.3 బిహెచ్‌పి పవర్, 110 ఎన్ఎమ్ 24kWh బ్యాటరీ ప్యాక్ XT, XZ తో పాటు XZ+ టెక్ LUX వేరియంట్‌లతో అందుబాటులో ఉంది. కలిగిన 50kW DC ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. కేవలం 57 నిమిషాల్లో 10 శాతం నుంచి 80 శాతం బ్యాటరీని ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ వెర్షన్ 73.75 బిహెచ్‌పి పవర్, 114 ఎన్ఎమ్ టార్క్ టార్క్ అందించే ఒకే ఎలక్ట్రిక్ మోటారు ద్వారా శక్తిని పొందుతుంది.
5 రంగుల్లో లభ్యం
టియాగో EV ఐదు రంగుల్లో అందుబాటులో ఉంది టీల్ బ్లూ, డేటోనా గ్రే, ప్రిస్టైన్ వైట్, మిడ్నైట్ ప్లం, ట్రాపికల్ మిస్ట్. అంతేకాదు, ఈ వెహికల్‌లో సిటీ మోడ్, స్పోర్ట్ మోడ్ అనే రెండు డ్రైవింగ్ మోడ్‌లు ఉంటాయి.
Read Also: క్రాష్ టెస్ట్ రేటింగ్‌లో దుమ్మురేపిన స్కార్పియో N, సేఫ్టీలో ఎన్ని స్టార్స్ సాధించిందో తెలుసా?