Tata Tiago: టాటా మోటార్స్ 2016లో టియాగోను భారత మార్కెట్‌లో లాంచ్ చేసింది. మెరుగైన మైలేజ్, డిజైన్ కారణంగా ఇది వినియోగదారులను ఆకర్షించడం ప్రారంభించింది. చాలా త్వరగానే దేశీయ విపణిలో ప్రముఖ కారుగా మారింది. ఇప్పుడు ఈ కారు 5,00,000 యూనిట్ల అమ్మకాల సంఖ్యను దాటింది.
15 నెలల్లోనే లక్ష మార్కు
కంపెనీ ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ కారు 15 నెలల్లోనే లక్ష యూనిట్ల అమ్మకాల సంఖ్యను దాటింది. ఈ కారు గుజరాత్‌లోని సనంద్ ఫ్యాక్టరీలో తయారు అవుతుంది. ఇదే దాని హోమ్ గ్రౌండ్. కంపెనీ ఈ కారును ఆరు వేరియంట్‌లలో విక్రయిస్తుంది. ఈ కారు ధర రూ. 5.59 లక్షల నుంచి రూ. 8.11 లక్షల మధ్య ఉంది.
టాటా టియాగో కారు పెట్రోల్, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్‌తో సహా పలు పవర్‌ట్రెయిన్‌లలో అందుబాటులో ఉంది. ఇది కాకుండా టాటా టియాగో ఎన్ఆర్‌జీ వేరియంట్‌ను పెట్రోల్ ఆప్షన్‌లో విక్రయిస్తున్నారు.
కంపెనీ అందించిన సమాచారం ప్రకారం ఈ కారు విక్రయాలలో 60 శాతం పట్టణ ప్రాంతాల్లో, 40 శాతం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. ఇది కాకుండా టాటా టియాగో కస్టమర్లలో 10 శాతం వాటా మహిళలదే. ఈ కారును కొనుగోలు చేసిన కస్టమర్లలో 71 శాతం మంది కొత్త కస్టమర్లే. వారి మొదటి కారును కొనుగోలు చేశారు.
ఏ కారుతో పోటీ
దేశీయ విపణిలో టాటా టియాగోకు గ్రాండ్ ఐ10 నియోస్, మారుతి సుజుకి స్విఫ్ట్ వంటి హ్యాచ్‌బ్యాక్ కార్ల నుంచి మంచి పోటీ ఉంది.
టాటా టియాగోలో ఈవీ వెర్షన్‌ను కూడా కంపెనీ లాంచ్ చేసింది. అదే టాటా టియాగో ఈవీ. ఈ కారులో రెండు వెర్షన్లు ఉన్నాయి. వీటిలో 19.2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ వెర్షన్ 250 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. ఇక 24 కేడబ్ల్యూహెచ్ మోడల్ 315 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను అందించనుంది. బ్యాటరీ ప్యాక్‌కు 8 సంవత్సరాలు లేదా 1.6 లక్షల కిలోమీటర్ల వరకు వారంటీని కంపెనీ అందించనుంది. ఇక కారుకు 3 సంవత్సరాలు లేదా 1.25 లక్షల కిలోమీటర్ల వరకు వారంటీ లభించనుంది.
టియాగో ఈవీలో రెండు ఛార్జర్ ఆప్షన్లు ఉన్నాయి. 3.3 కిలో వాట్ కాంపాక్ట్ ఏసీ చార్జర్ ద్వారా బ్యాటరీ ఛార్జ్ చేస్తే పూర్తిగా ఛార్జ్ కావడానికి మూడు గంటల 36 నిమిషాలు పట్టనుంది. అదే 7.2 కిలో వాట్ ఫాస్ట్ ఛార్జర్ ద్వారా అయితే చాలా వేగంగా కేవలం 57 నిమిషాల్లోనే 10 నుంచి 80 శాతం చార్జింగ్ ఎక్కనుందని కంపెనీ తెలిపింది.
టాటా టియాగో ఈవీలో 8 స్పీకర్ల హర్మాన్ ఇన్‌ఫోటెయిన్‌మెంట్ సిస్టం అందించారు. యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి ఫీచర్లను ఇది సపోర్ట్ చేయనుంది. లెదర్ సీట్లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ట్రైన్ సెన్సింగ్ వైపర్స్, ఆటో హెడ్ ల్యాంప్స్, ఆటో ఫోల్డ్ ఉన్న ఎలక్ట్రిక్ ఓవీఆర్ఎమ్స్, క్రూజ్ కంట్రోల్, పుష్ బటన్ స్టార్ట్ స్టాప్, కూల్డ్ గ్లోవ్ బాక్స్, స్మార్ట్ వాచ్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు కూడా ఈ కారులో ఉన్నాయి.
Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial