2025 Tata Sierra Review: టాటా మోటార్స్‌, 2025లో, తన లెజెండరీ మోడర్‌ సియెరాను పూర్తిగా కొత్త రూపంలో తిరిగి తీసుకొచ్చింది. 1991 మోడల్‌ సియెరాకు ఉన్న ప్రత్యేక గుర్తింపును, ఆధునిక డిజైన్‌తో కలిపి కొత్త మిడ్‌సైజ్‌ SUVగా రూపొందించింది. క్రెటా, గ్రాండ్‌ విటారా వంటి మోడళ్లకు టఫ్‌ కాంపిటీషన్‌ ఇవ్వడానికి ఇది మార్కెట్లోకి వచ్చింది. అయితే, ఈ SUVలో అన్నీ ప్లస్‌లేనా? ఏవైనా మైనస్‌లు ఉన్నాయా? - ఈ ప్రశ్నలకు సమాధానం మీ కోసం స్పష్టంగా అందిస్తున్నాం.

Continues below advertisement

టాటా సియెరా కొనడానికి 3 కారణాలు

1) కంఫర్ట్‌–హ్యాండ్లింగ్‌ మధ్య అద్భుత బ్యాలెన్స్‌టాటా కార్లలో కనిపించే సాలిడ్‌ రైడ్‌ క్వాలిటీని సియెరా కూడా కొనసాగిస్తోంది. చిన్న బంప్‌లను సులభంగా తట్టుకుంటుంది. వేగం పెరుగుతున్నప్పుడు కూడా ఈ SUV స్టేబుల్‌గా, కంట్రోల్‌లోనే ఉంటుంది. సిటీ డ్రైవ్‌లో స్టీరింగ్‌ తేలికగా ఉండటం, హైవేలో అది ఖచితత్వంతో పని చేయడం వల్ల ఈ రెండింటి ఫీలింగ్‌ కూడా చాలా నేచురల్‌గా ఉంటుంది. 205mm గ్రౌండ్‌ క్లియరెన్స్‌, టెరైన్‌ మోడ్స్‌ ఉండటం వల్ల గతుకుల రోడ్లు, చిన్న గుంతలను కూడా సులభంగా దాటేస్తుంది.

Continues below advertisement

2) ప్రీమియం ఇంటీరియర్‌ & హెరిటేజ్‌ డిజైన్‌సియెరా డిజైన్‌ ఈ సెగ్మెంట్‌లోనే హైలైట్‌. బాక్సీ షేప్‌, హై బోనెట్‌, స్క్వేర్‌ ఆర్చ్‌లు ఈ SUVకి పవర్‌ఫుల్‌ రోడ్‌ ప్రెజెన్స్‌ ఇస్తాయి. ఫుల్‌–గ్లాస్‌ C–పిల్లర్‌ ప్యానెల్‌, స్లిమ్‌ LED హెడ్‌ల్యాంప్స్‌, ఫ్లష్‌ డోర్‌ హ్యాండిల్స్‌, 19-అంగుళాల డైమండ్‌ కట్‌ వీల్స్‌ వంటివి లగ్జరీ లుక్‌ అందిస్తాయి. కేబిన్‌లో మూడు స్క్రీన్‌లు, పానోరమిక్‌ సన్‌రూఫ్‌, వెంట్‌లేటెడ్‌ సీట్లు, వైర్‌లెస్‌ చార్జింగ్‌, JBL 12-స్పీకర్‌ సిస్టమ్‌ కూడా ఇంటీరియర్‌ అనుభవాన్ని మరింత రిచ్‌గా చేస్తాయి. 1991 నాటి సియెరాకు గుర్తింపుగా ఉన్న థిక్‌ B–పిల్లర్‌, రియర్‌ గ్లాస్‌ కర్వ్‌డ్‌ డిజైన్‌ - అన్నీ కొత్త మోడల్‌లో కూడా రిఫ్లెక్ట్‌ అవుతాయి.

3) టర్బో–పెట్రోల్‌ ఇంజిన్‌ రిఫైన్‌మెంట్‌1.5 లీటర్ల టర్బో–పెట్రోల్‌ ఇంజిన్‌, ఈ బండిని స్టార్ట్‌ చేసిన క్షణం నుంచి స్మూత్‌గా ఉంటుంది. సడెన్‌ సర్జ్‌ లేకుండానే క్లీన్‌గా యాక్సిలరేట్‌ అవుతుంది. 6-స్పీడ్‌ Aisin ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ స్మూత్‌ షిఫ్ట్‌ కారణంగా, సిటీ & హైవే డ్రైవ్‌లు సులభంగా ఉంటాయి. ప్యాడిల్‌ షిఫ్టర్లు కూడా ఉన్నాయి, కానీ ఈ SUVని ఆటో మోడ్‌లోనే వదిలేస్తే బెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌ ఇస్తుంది.

టాటా సియెరాకు దూరంగా ఉండడానికి 2 కారణాలు

1) డీజిల్‌ ఇంజిన్‌ నాయిజ్‌ ఎక్కువడీజిల్‌ వెర్షన్‌లో వైబ్రేషన్స్‌ స్పష్టంగా కనిపిస్తాయి. ఐడిల్‌లోనూ, యాక్సిలరేషన్‌లోనూ ఇంజిన్‌ సౌండ్‌ క్యాబిన్‌లోకి బాగా వినపడుతుంది. దీని టార్క్‌ హైవేలో సరిపోతున్నా, రిఫైన్‌మెంట్‌ కోరుకునే వారికి ఇది మైనస్‌ పాయింట్‌ అవుతుంది.

2) NVH లెవల్స్‌ మెరుగుపరిచాల్సిన అవసరం ఉందిహైవేలో రోడ్‌ నాయిజ్‌, టైర్‌ నాయిజ్‌ కేబిన్‌లోకి కొంచెం ఎక్కువగా వస్తాయి. టర్బో–పెట్రోల్‌ వెర్షన్‌లో కూడా పూర్తిగా సైలెంట్‌ అనుభవం ఉండకపోవచ్చు. ప్రీమియం SUV ఫీలింగ్‌ తగ్గే అంశం ఇదే.

ఫైనల్‌గా...టాటా సియెరా... డిజైన్‌, రైడ్‌ క్వాలిటీ, ఇంటీరియర్‌ ఫీల్‌ వంటి అంశాల్లో తన సెగ్మెంట్‌లో ప్రత్యేక స్థానం సంపాదించింది. సిటీ, హైవేల్లో వరకు బలమైన, స్టైలిష్‌ & ఫీచర్‌ రిచ్‌ SUV కావాలనుకునే వారికి ఈ కారు మంచి ఆప్షన్‌ అవుతుంది. కానీ డీజిల్‌ రిఫైన్‌మెంట్‌ & NVH విషయాల్లో ఇంకా మెరుగుదల అవసరం. 

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.