Tata Sierra Launch 24 Variants: టాటా సియెర్రా అనేది ఒక 5 సీటర్ SUV వాహనం. టాటా మోటార్స్‌కు చెందిన ఈ కారు నవంబర్ 25న భారత మార్కెట్లోకి లాంచ్ అయింది. ప్రారంభ సమయంలో సియెర్రా బేస్ మోడల్ ధర మాత్రమే వెల్లడించారు. అయితే ఇప్పుడు టాటా మోటార్స్ సియెర్రా మోడల్ అన్ని 24 వేరియంట్‌ల ధరల వివరాలను వెల్లడించింది. వాటి ధరలు కూడా ట్రెండ్ అవుతున్నాయి. టాటా సియెర్రా ఎక్స్-షోరూమ్ ధర రూ. 11.49 లక్షల నుంచి ప్రారంభమై రూ. 18.49 లక్షల వరకు ఉంది. టాటా సియెర్రా అన్ని వేరియంట్‌లు, వాటి ధరల గురించి తెలుసుకుందాం. బడ్జెట్ మాత్రం కాస్త ఎక్కువే అని కస్టమర్లు అంటున్నారు. సామాన్యులకు మాత్రం ఇవి బడ్జెట్ ధరలలో అందుబాటులో లేవు. కానీ ప్రీమియం ఫీచర్లు, బెస్ట్ సౌకర్యం కోసం ఆ మాత్రం ఖర్చు ఉంటుందని కంపెనీ ప్రతినిధుల అభిప్రాయం.

Continues below advertisement

టాటా సియెర్రా అన్ని వేరియంట్‌ల ధర

టాటా మోటార్స్ సియెర్రా మోడల్ అన్ని వేరియంట్‌లను మార్కెట్‌లో విడుదల చేసింది. టాటా ఈ కొత్త కారు స్మార్ట్ ప్లస్, ప్యూర్, ప్యూర్ ప్లస్, అడ్వెంచర్, అడ్వెంచర్ ప్లస్, అకంప్లిష్డ్, అకంప్లిష్డ్ ప్లస్ మోడల్‌లలో మార్కెట్‌లోకి వచ్చింది. 

  • టాటా సియెర్రా స్మార్ట్ ప్లస్ వేరియంట్, ఇందులో 1.5 లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్ అమర్చారు. మాన్యువల్ ట్రాన్స్మిషన్‌తో ఈ కారు వస్తుంది. ఈ కారు బేస్ మోడల్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 11.49 లక్షలుగా ఉంది. అదే సమయంలో 1.5 లీటర్ క్రయోజెట్ డీజిల్ ఇంజిన్‌తో లభించే బేస్ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 12.99 లక్షలు.
  • టాటా సియెర్రా ప్యూర్ వేరియంట్‌ల ఎక్స్-షోరూమ్ ధర రూ. 12.99 లక్షలకు ప్రారంభమై రూ. 15.99 లక్షల మధ్య ఉంది. సియెర్రా ప్యూర్ ప్లస్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 14.49 లక్షలకు ప్రారంభమై గరిష్టంగా మోడల్ బట్టి రూ. 17.49 లక్షల మధ్య ఉంది.

Continues below advertisement

  • సియెర్రా అడ్వెంచర్ మోడల్‌లో 3 వేరియంట్‌లు తీసుకువచ్చింది. వీటి ఎక్స్-షోరూమ్ ధర రూ. 15.29 లక్షలకు ప్రారంభం కాగా, రూ. 16.79 లక్షల వరకు ఉంది. అడ్వెంచర్ ప్లస్ నాలుగు వేరియంట్‌లు మార్కెట్‌లో ఉన్నాయి. వీటి ఎక్స్-షోరూమ్ ధర రూ. 15.99 లక్షలకు ప్రారంభం కాగా, గరిష్టంగా రూ. 18.49 లక్షల వరకు ఉంది.
  • సియెర్రా అకంప్లిష్డ్ మోడల్ నాలుగు వేరియంట్‌లు, అకంప్లిష్డ్  ప్లస్ మోడల్ మూడు వేరియంట్‌లు సైతం మార్కెట్‌లోకి వచ్చాయి. టాటా సియెర్రా ఈ టాప్ మోడల్స్ ధర గురించి ఇంకా వివరాలు బయటకు రాలేదు. 

Also Read: హ్యుందాయ్ క్రెటాను ఢీకొట్టనున్న MG Hector Facelift.. త్వరలో మార్కెట్లోకి, ఫీచర్లు చూశారా