Brahmamudi Serial Today Episode: కేరళ వైద్యాలయంలో కావ్యకు ట్రీట్‌మెంట్‌ చేస్తుంటాడు గురువు. అక్కడే బయట నిలబడిన రాజ్‌ దగ్గరకు ఇద్దరు లోకల్‌ రౌడీలు వస్తారు. మొన్న చనిపోయిన వాడు నీకేమైనా ఇచ్చాడా అని అడుగుతాడు.

Continues below advertisement

రాజ్‌: మళ్లీ ఎందుకు వచ్చారురా..?

రౌడీ: నీ దగ్గర ఉన్నది నాకు ఇచ్చేయాలి

Continues below advertisement

రాజ్: ఇప్పుడే ఇచ్చేయాలా..?

రౌడీ: లేటు ఎందుకు..? ఇప్పుడే ఇచ్చేయాలి

రాజ్‌ కోపంగా రౌడీని కొడతాడు.

రాజ్: ఇంకా కావాలా..? చెప్పు ఇంకోటి ఏమైనా కావాలా..?

రౌడీ: చంప పగిలింది. అయినా పర్వాలేదు ఒక పని మీద వచ్చాం అది కామనే కదా…?  చచ్చినవాడితో సంబంధం లేదన్నావు.. కానీ ఇందాక వాడి అన్నతో ఏం మాట్లాడావు..? ఏందుకు మాట్లాడావు..

రాజ్‌: అరేయ్‌ చచ్చిన వాడే నాకు తెలియదు అంటే ఆ వచ్చిన వాడు ఎలా తెలుస్తాడురా..?

అంటూ రాజ్‌ మళ్లీ కొట్టబోతుంటే రౌడీలు పారిపోతారు. ఇంతలో లోపలి నుంచి కావ్య, గురు వస్తారు. అంతా బాగానే ఉందని ఇంకో ఐదు రోజుల్లో మీరు వెళ్లిపోవచ్చు అని చెప్పగానే.. కావ్య, రాజ్‌ హ్యాపీగా పీలవుతారు. ఇక స్టేషన్‌లో అప్పు పాప కేసు గురించి కానిస్టుబుల్‌ తో మాట్లాడుతుంటే సీఐ వస్తాడు.

సీఐ: అపూర్వ ఎప్పుడు వచ్చావు.. నేను నీకు ఫోన్‌ చేద్దాం అనుకున్నాను..

అప్పు: ఇందాకే వచ్చాను సార్‌ ఆ కిడ్నాప్‌ కేసు గురించి పర్‌దర్‌గా స్టెప్‌ తీసుకోబోతున్నాం.

సీఐ: అపూర్వ నువ్వు  ఆ కేసు వదిలేయాలి

అప్పు: ఏంటి సార్‌.. ఇప్పుడు ఆ పాప రీ పోస్ట్‌మార్టమ్‌ గురించి అడుగుదామనే వచ్చాను

సీఐ: నీకేమైనా పిచ్చి పట్టిందా..? నేను ఆ కేసు వదిలేయమని చెప్తుంటే.. రీ పోస్ట్‌మార్టం అంటావు..

అప్పు: సార్‌ అప్పుడు ఏదో పొరపాటు జరిగింది సార్‌ రీ పోస్ట్‌ మార్టం జరిపిస్తే కొన్ని క్లూస్‌ దొరికే చాన్స్‌ ఉంది

సీఐ: చూడమ్మా ఇన్ని రోజులు ఆ కేసు పట్టుకుని టైం వేస్ట్‌ చేసుకున్నావు.. ఇప్పుడు మళ్లీ రీ పోస్ట్‌మార్టం అని చెప్పి కాంప్లికేట్‌ చేయకు

అప్పు: అది కాదు సార్‌

సీఐ: ఏది కాదమ్మా..? అప్పుడు అన్ని పార్మాలిటీస్‌ జరిగాయి. ఆ పాప రేణుక గారి కూతురు అని కన్ఫం అయింది. ఇంకా ఏదో డిపార్ట్‌మెంట్‌ తప్పు చేసినట్టు మాట్లాడతావు

అప్పు: అది కాదు సార్‌ పాప డీఎన్‌ఏతో రేణుక డీఎన్‌ఏ మ్యాచ్‌ అవుతుందో లేదో చూడాలి

సీఐ: మ్యాచ్‌ అయినందుకే కదా కేసు క్లోజ్‌ చేశాం. మళ్లీ దాన్ని పట్టుకుని ఎందుకు లాగుతున్నావు.. నువ్వు తప్పు చేస్తున్నావు..

అప్పు: ఒక్కసారి సెకండ్‌ ఓపినీయన్‌ తీసుకుందాం.. ఒకవేళ మ్యాచ్‌ కాకపోతే రేణుక గారు చెప్పింది నిజం అవుతుంది కదా

సీఐ: షటప్‌ అనవసరంగా రేణుక మాటలు నమ్మి రాంగ్‌ రూట్లో వెళ్తున్నావు. ఇక ఈ కేసు గురించి మర్చిపో.. చూడమ్మా ఇప్పుడు నీకు ఒక కొత్త కేసు అప్పగించబోతున్నాను. ఆ కేసు టేకప్‌ చేయ్‌ లేదంటే మళ్లీ లీవ్‌ పెట్టి ఇంటికి వెళ్లిపో.. ఉదయ్‌ నా కాబిన్‌లో ఫైల్‌ ఉంది తీసుకురా..

కానిస్టేబుల్‌ ఫైల్‌ తీసుకురాగానే అది అప్పు ఇస్తూ… ఈ కేసు టేకప్‌ చేయ్‌ అని వెళ్లిపోతాడు సీఐ. మరోవైపు పెన్‌ డ్రైవ్‌ తీసుకురాలేదని రౌడీలు వాళ్ల బాస్‌ కొడతాడు. దీంతో ఈసారి కావ్య, రాజ్‌లను చంపైనా పెన్‌ డ్రైవ్‌ తీసుకొస్తామని వెళ్లిపోతారు రౌడీలు. అపర్ణ, ఇందిరాదేవిలు రాజ్‌కు ఫోన్‌ చేసి మాట్లాడతారు ఎప్పుడొస్తారని అడిగితే ఇంకో ఐదు రోజుల్లో వస్తామని చెప్తారు. మరోవైపు రాహుల్‌ తాను కావ్య డిజైన్స్‌ ఎలా దొంగిలించింది. వాటిని తానే వేశానని స్వప్నను ఎలా నమ్మిస్తుంది మొత్తం రుద్రాణికి చెప్తాడు. రుద్రాణి హ్యాపీగా ఫీలవుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!