MG Hector Facelift in India | భారత్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న కార్ల కంపెనీలలో జేఎన్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఒకటి. పెట్రోల్, డీజిల్ నుండి ఎలక్ట్రిక్ కార్ల వరకు ప్రతి విభాగంలోనూ కంపెనీ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. 2019లో వచ్చిన MG మొదటి SUV హెక్టర్. ఇప్పటికీ కంపెనీ అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటి. ఇప్పుడు MG హెక్టర్ కొత్త మోడల్ 2026లో రాబోతోందని సమాచారం. ఇది పాత మోడల్ కంటే మరింత మోడ్రన్‌గా ఉంటుంది. కంపెనీ SUV డిజైన్‌లో మార్పులు చేస్తోంది. తద్వారా కొత్త మోడల్ Hyundai Cretaకి పోటీ ఇవ్వనుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.
కొత్త లుక్‌లో హెక్టర్ ఎలా కనిపిస్తుంది?
2023లో ఎంజీ హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ వచ్చింది. 2026లో రాబోయే అప్‌డేట్ దానిపైనే తయారు చేశారు. ఈసారి హెక్టర్ బయటివైపు లుక్ కొద్దిగా మార్చుతారు, కానీ ఆకర్షణీయంగా ఉండనుంది. ఇందులో కొత్త గ్రిల్ అమర్చుతారు. ఇది మునుపటి కంటే పెద్దదిగా, స్టైలిష్‌గా ఉంటుంది. SUV ముందు భాగాన్ని మరింత శక్తివంతంగా చూపించడానికి దాని ఫ్రంట్ బంపర్‌ను కొద్దిగా మారుస్తారు. దీని LED హెడ్‌లైట్‌లు ఎప్పటిలాగే సన్నగా ఉంటాయి. ఇవి హెక్టర్ గుర్తింపుగా మారాయి. వెనుక వైపున కూడా కొత్త బంపర్ డిజైన్ ఇవ్వనున్నారు. ఇది కారు వెనుక భాగాన్ని మరింత మోడ్రన్‌గా చేస్తుంది. ప్రత్యేకమైన మార్పు దాని కొత్త అల్లాయ్ వీల్స్‌లో చూడవచ్చు. ఈసారి ఎంజీ హెక్టర్ 19-అంగుళాల పెద్ద వీల్స్ తో వస్తుందని అంతా భావిస్తున్నారు.
ఎంజీ హెక్టర్ ఫీచర్లు
ఎంజీ హెక్టర్ ఎల్లప్పుడూ ఫీచర్-రిచ్ SUVగా పరిగణిస్తారు. కంపెనీ దాని ఫీచర్లలో చాలా వరకు మునుపటిలాగే ఉంచుతుంది. కస్టమర్‌లు వాటిని బాగా లైక్ చేస్తున్నారు. అయినప్పటికీ వెనుక సీటులో వెంటిలేషన్ వంటి కొన్ని కొత్త ఫీచర్‌లు జత చేయవచ్చు. పెద్ద వర్టికల్ టచ్‌స్క్రీన్‌లో కూడా కొత్త ఇంటర్‌ఫేస్ ఉంటుంది. దీన్ని ఈజీగా ఉపయోగించవచ్చు. దీనితో పాటు పనోరమిక్ సన్‌రూఫ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఎయిర్ ప్యూరిఫైయర్, యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఎలక్ట్రిక్ డ్రైవర్ సీటు వంటి ఫీచర్‌లు ఉంటాయి. MG ప్రత్యేకమైన i-SMART సాంకేతికత ఇందులో ఉంటుంది. దీని ద్వారా మీరు కారును లాక్ చేయడం, అన్‌లాక్ చేయడం, కండీషన్ చెక్ చేయడం, లేదా వాయిస్ కమాండ్ ఇవ్వడం వంటి పనులను మీ మొబైల్ నుండే ఆపరేట్ చేయవచ్చు.
ఇంజిన్‌లో ఎలాంటి మార్పులు ఉంటాయి?
ఎంజీ హెక్టర్ కేవలం ఫేస్‌లిఫ్ట్ మాత్రమే, పూర్తిగా కొత్త మోడల్ కాదు. కనుక కొత్త మోడల్ కారులో ఇంజిన్‌లో పెద్ద మార్పులు చేసే అవకాశం తక్కువ. 2026 హెక్టర్‌లో గతంలోలాగే ఇంజిన్‌లు ఉంటాయి. 1.5-లీటర్ టర్బో పెట్రోల్, ఇది 141 bhp పవర్, 250 Nm టార్క్ ఇస్తుంది. 2.0 లీటర్ టర్బో డీజిల్, ఇది 167 bhp పవర్, 350 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. పెట్రోల్ ఇంజిన్‌తో 6 స్పీడ్ మాన్యువల్, CVT గేర్‌బాక్స్ రెండూ ఉంటాయి. డీజిల్ ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.