Tata Safari Adventure Price, Mileage And Features In Telugu: టాటా మోటార్స్, తన పాపులర్ SUV 'సఫారీ'లో కొత్త వేరియంట్‌ను లాంచ్ చేసింది. "అడ్వెంచర్ X+" (Adventure X+) పేరిట ఆ వేరియంట్‌ను భారతదేశ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. అగ్రెసివ్ లుక్స్‌లో కనిపిస్తున్న అడ్వెంచర్ X ప్లస్ ప్రారంభ ధర (Tata Safari Adventure Price) ను రూ. 19.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది. ఇది, పరిచయ ధర & 31 అక్టోబర్ 2025 వరకే ఈ రేటు చెల్లుబాటు అవుతుంది, ఆ తర్వాత మారుతుంది. ఈ వేరియంట్ టాటా సఫారీ Pure X & Accomplished X ట్రిమ్‌ల మధ్యలో ఉంటుంది. అయితే, లక్షణాల పరంగా టాప్ వేరియంట్‌లతో కూడా పోటీ పడుతుంది.
టాటా సఫారీ అడ్వెంచర్ X+ ఫీచర్లుటాటా సఫారీ అడ్వెంచర్ X+ కంపెనీ ఇచ్చిన గొప్ప & ఆధునిక లక్షణాల కారణంగా దీనిని లగ్జరీ SUVగా చెప్పాలి. సాధారణంగా, చాలా ఖరీదైన వాహనాల్లో కనిపించే అనేక ఫీచర్లు టాటా కొత్త SUVలో కనిపిస్తాయి. ఇందులో ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) & 360-డిగ్రీ కెమెరా వంటి భద్రతా లక్షణాలు ఉన్నాయి, ఇవి డ్రైవింగ్‌ను మరింత సురక్షితంగా & స్మార్ట్‌గా మారుస్తాయి. ఇంకా, ట్రైల్ హోల్డ్ EPB వంటి చాలా అడ్వాన్స్‌డ్ ఫీచర్లను సఫారీ అడ్వెంచర్ X+ లో చూడవచ్చు. ఈ SUVలో నార్మల్, రఫ్ & వెట్ విత్ ఆటో హోల్డ్ వంటి మూడు డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి, అవసరాన్ని బట్టి ఒక డ్రైవింగ్ మోడ్‌లోకి మారవచ్చు. ఈ కారులో ఎర్గోమాక్స్ డ్రైవర్ సీటును కూడా ఉంది, ఇది మెమరీ & వెల్‌కమ్ ఫంక్షన్‌తో వస్తుంది.
పవర్ & పనితీరు టాటా సఫారీ అడ్వెంచర్ X+ ఇంజిన్ విషయానికి వస్తే.. సఫారీ & హారియర్‌లో ఇప్పటికే ఉపయోగిస్తున్న అదే నమ్మకమైన 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్‌ను ఈ SUVలోనూ ఉపయోగించారు. ఈ ఇంజిన్ 168 bhp పవర్‌ను & 350 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ SUVని రెండు ట్రాన్స్‌మిషన్ ఎంపికలలో (6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ & 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్) కొనవచ్చు. ఈ ఫోర్‌వీలర్ నగర రోడ్లపైనే కాకుండా ఆఫ్-రోడింగ్ వంటి క్లిష్టమైన రోడ్లపై కూడా శక్తిమంతమైన & మృదువైన పనితీరును అందిస్తుంది.
అడ్వెంచర్ & స్టైల్ కలిసిన కారును కోరుకునే కస్టమర్ల కోసం సఫారీ అడ్వెంచర్ X+ ను ప్రత్యేకంగా రూపొందించామని టాటా మోటార్స్ తెలిపింది. టాప్-స్పెక్ వేరియంట్ల స్థాయిలో భారీ ధర చెల్లించకుండానే, అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో ప్రత్యేకంగా నిలబడాలనుకునే కస్టమర్లకు ఈ SUV ఒక అద్భుతమైన ఎంపిక. దీని అద్భుతమైన లుక్స్, అధునాతన సాంకేతికత & శక్తిమంతమైన పనితీరు నగర రోడ్లను దాటి కొండలు, గుట్టలు & కష్టతరమైన రోడ్ల మీద కూడా సాఫీగా సాగుతుంది. ADAS భద్రత సాంకేతికతల వల్ల, కారులో ప్రయాణించే కుటుంబ సభ్యులకు బలమైన భద్రత కూడా ఉంటుంది.